What Next After Blogging ? బ్లాగ్గింగ్ తరువాత నెక్స్ట్ ఏంటి ? Part -2

What Next After Blogging ?
What Next After Blogging ? బ్లాగ్గింగ్ తరువాత నెక్స్ట్ ఏంటి ? Part -2

బ్లాగ్గింగ్ తరువాత ఏంటి అనే అంశం పై మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ ఆర్టికల్ తదుపరి భాగం. బ్లాగ్గింగ్ ద్వారా మనం ఏ నేర్చుకుంటున్నాం, వాటిని ఎలా ఉపయోగించాలి అని ఇంతకూ ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి ద్వారా బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

డిజిటల్ మార్కెటింగ్ :

ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్, ఇప్పుడిప్పుడే అవగాహనలోకి వస్తున్నా రంగం డిజిటల్ మార్కెటింగ్. చాలా మంది వ్యాపారాలు కూడా వీటి వలన లభించే ప్రయోజనాలు తెలుసుకుని, ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్లు ఈ పనులు చేఉకోలేరు, ఎందుకంటె వాళ్లు వల్ల బిజినెస్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్లు కావాలి. అయితే చాలా కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా, అవి స్టార్ట్అప్స్, మధ్య, చిన్న వ్యాపారులకి అందుబాటులో లేవు. కాబట్టి మీరు అలంటి వాటికీ సహాయం చేసి, వారి నుండి బిజినెస్ స్వికరించవచ్చు.
తక్కువ ప్రైసింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీరు ఆఫర్ చేయటం వలన మీకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. 1) మీరు బ్లాగ్గింగ్ ద్వారా ఎర్న్ చేస్తున్నారు, కాబట్టి ఈ వచ్చే మనీ తక్కువే అయినా అది మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది. 2) దీని వలన మీకు రకరకాల వ్యాపారాలకి అవలంబించే వివిధ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలుస్తాయి. మీకు ఈ రంగంలో అనుభవం వస్తుంది. డబ్బు ఈ రోజు వస్తే, రేపు మరో రకంగా ఖర్చు అయిపోతుంది. కానీ అనుభవం అలా కాదు. డబ్బు కన్నా విలువైనది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయవచ్చు.

గ్రాఫిక్ డిజైనింగ్:

మార్కెట్లో ఎంతగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏ మాత్రం ప్రభావం కోల్పోలేదు అనటానికి కారణం ప్రతీ సంవత్సరం ప్రచార వ్యయాలు భారీగా బడ్జెట్ ని కేటాయించడం నిదర్శనం. అంటే దాదాపుగా ప్రతీ బిజినెస్ కి బిజినెస్ కార్డ్స్ (విసిటింగ్ కార్డ్స్), ఫ్లయర్స్ (పాంఫ్లెట్స్), బ్రోచర్స్, పోస్టర్లు, స్టికర్స్, బ్యానర్స్ ఇలాంటివి కావలసి వస్తాయి. వాటిని ప్రింట్ చేసే ముందు డిజైన్ చేయడం అవసరం. క్రియేటివ్ గా, కస్టమర్స్ సంతృప్తి చెందే విధంగా డిజైనింగ్ చేయగలిగితే మంచి బిజినెస్ గా స్టార్ట్ చేయవచ్చు. నిదానంగా ప్రింటింగ్ రిలేటెడ్ బిజినెస్లు కూడా స్టార్ట్ చేయవచ్చు.

వెబ్ డిజైనింగ్ :

ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ వ్యాపారానికి వెబ్ సైట్ ఉండటం వల్ల వచ్చే లాభాల గురించిన ఆవశ్యకత తెలుసుకుంటున్నారు. అయితే వెబ్ సైట్ డిజైనింగ్ అనేది టెక్నికల్ వర్క్. వీటిని ఎవరికి వారు చేసుకోలేరు. కాబట్టి అలాంటి వాళ్లు వెబ్ సైట్ డిజైనర్స్ ని అప్రోచ్ అవుతారు. కాబట్టి వెబ్ సైట్ డిజైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా కూడా కెరియర్ లో సెటిల్ అవ్వవచ్చు.

SEO :

చాలా మంది తమకి కావాల్సిన వస్తువులు, సేవల గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తారు. అప్పుడు మనకి సంబంధించిన ప్రొడక్ట్స్ / సర్వీసెస్ గురించి ఫస్ట్ పేజిలో ఉన్న రిజల్ట్స్ గురించి మాత్రమే చెక్ చేస్తారు. కాబట్టి సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేసినప్పుడు క్లైంట్ వెబ్ సైట్ టాప్ లో రావటానికి SEO చేయాలి. అలా SEO చేసేవారికి మంచి ఇన్కమ్ వస్తుంది అనేది ఎవరూ కాదనలేని సత్యం.
కాబట్టి బ్లాగ్గింగ్ ద్వారా మన బిజినెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు. బ్లాగ్గింగ్ డబ్బుతో పటు అనేక అవకాశాలను కూడా అందిస్తుంది. అయితే ఆ అవకాశాలు మీరు బ్లాగ్గింగ్ లోతుని అనుభవించినప్పుడు మాత్రమే అందుకోగలరు. కాబట్టి బ్లాగ్గింగ్ ని సీరియస్ గా తీసుకోని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. ఈ విషయాల పై మీ సలహాలు, సూచనలు కామెంట్ చేసి మకి తెలియచేయండి. జై హింద్.
Share:

No comments:

Post a Comment

Popular Posts