HOW TO BECOME A SUCCESSFUL BLOGGER IN TELUGU | HOW TO WRITE AN ARTICLE IN TELUGU

HOW TO BECOME A SUCCESSFUL BLOGGER IN TELUGU
HOW TO BECOME A SUCCESSFUL BLOGGER IN TELUGU
ఒక బ్లాగ్ బాగా పాపులర్ కావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్న ఎదురైనప్పుడు కను చాలా సమాధానాలు వినిపించాయి. బాగా SEO చేయాలి, మంచి ఆర్టికల్స్ వ్రాయాలి, బ్లాగ్ బాగా స్పీడ్ గా ఉండాలి. మన బ్లాగ్ కి చాలా మంది రెగ్యులర్ విసిటర్స్ వుండాలి. 
FB లో మన పేజికి వేలలో ఫాలోవర్స్ ఉండాలి. ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. నిజానికి ఇవన్ని కరెక్టే. కానీ నా దృష్టిలో మన బ్లాగ్ లో వ్రాసే ఆర్టికల్స్, మన బ్లాగ్స్ ని పాపులర్ చేస్తాయి.
ఒక ఆర్టికల్ చాలా చక్కగా ఎలాంటి వారికైనా అర్థం అయ్యే విధంగా వ్రాసారు. ఉదాహరణకి బరువు తగ్గటం ఎలా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని మీరు ఒక బ్లాగ్ వ్రాసారు అని అనుకుందాం. 
ఆ బ్లాగ్ లింక్ ని మీరు facebook లో షేర్ చేసారు. మీరు వ్రాసిన ఆర్టికల్ అందరికి చాలా సులభంగా అర్థం అయ్యేలా వుంది. అప్పుడు వాళ్లు ఆ ఆర్టికల్ చదివినా తరువాత ఆ పోస్ట్ ని షేర్ చేసారు అనుకుందాం. 
అప్పుడు మీ ఆర్టికల్ మరింత మందికి రీచ్ అయ్యింది. దాన్ని మరికొంత మంది వాళ్ళ స్నేహితులకి whatsapp ద్వారా షేర్ చేసారు. అప్పుడు మీ బ్లాగ్ పోస్ట్ గురించి చాలా మందికి తెలుస్తుంది. 
వాళ్లు అందరూ మీ బ్లాగులో ఉన్న ఆర్టికల్ చదివినా తరువాత, అందులో ఉన్న మిగిలిన ఆర్టికల్స్ ని కూడా, కనీసం 2 లేదా 3 ఆర్టికల్స్ చదువుతారు. అప్పుడు వాళ్ళకి మనం రాసిన కంటెంట్ నచ్చుతుంది. 
మన బ్లాగ్ అప్డేట్స్ కోసం మన బ్లాగ్ లో సబ్స్క్రయిబ్ చేసుకోవడం, లేదా ఫేస్బుక్ లో మన బ్లాగ్ పేజి ని లైక్ చేయడం చేస్తారు. మనం క్రొత్త బ్లాగ్ పోస్ట్ చేసిన ప్రతిసారి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. 
ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాం కాబట్టి, వాళ్లు వల్ల మెయిల్ నుండి ఫేస్బుక్ లా నుండి మన బ్లాగ్ కి వస్తారు. రేగులర్ గా వాళ్లు మన బ్లాగ్ ని విసిట్ చేస్తారు.
అలా రెగ్యులర్ విసిటర్స్ మన బ్లాగ్ ని విసిట్ చేసి వాళ్ళ అభిప్రాయాలని లైవ్ చేయడం, కామెంట్ చేయడం ఆ ఆర్టికల్ ని షేర్ చేయడం చేస్తే ఆటోమేటిక్ గా SEO కూడా అవుతుంది. అప్పుడు డైరెక్ట్ గా గూగుల్ సెర్చ్ నుండి కూడా విసిటర్స్ మన బ్లాగ్ కి వస్తారు. 
అంటే ఒక బ్లాగ్ సక్సెస్ కావాలన్నా, పాపులర్ కావాలన్నా మంచి ఆర్టికల్స్ వ్రాయడం అనేది చాలా అవసరం. అందుకే గూగుల్ కూడా “SEO కోసం బ్లాగ్స్ వ్రాయవద్దు, మీ రీడర్స్ కోసం ఆర్టికల్స్ వ్రాయండి” అని చెప్తుంది. 
ఈ ఆర్టికల్ లో ఒక ఆర్టికల్లో ఒక మంచి ఆర్టికల్ వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏంటి? అని చూద్దాం!

ఒక మంచి ఆర్టికల్ వ్రాయటం ఎలా?

       సాదారణంగా మనం ఒక ఆర్టికల్ వ్రాయాలి అని కూర్చున్న తరువాత, ఆ ఆర్టికల్ లో వ్రాసే సమయంలో మన మైండ్ లో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒక్కోసారి సంబంధం లేని వాటిని, అవసరం లేని వాటిని కూడా రాస్తూ ఉంటాం. 
అలాంటప్పుడు రఫ్ గా మీరు వ్రాయాలనుకున్న టాపిక్ టైటిల్, వాటిల్లో వచ్చే సబ్ టాపిక్స్ ని హెడ్డింగ్స్ గా వ్రాసుకోండి. అలా వ్రాసుకున్న తరువాత వాటిని కవర్ చేస్తూ ఆర్టికల్ వ్రాయండి.
       మొదట్లో ఒక బుక్ లో ఆర్టికల్స్ వ్రాసి వాటిని టైపు చేసి బ్లాగ్ లో పబ్లిష్ చేయండి. ఇలా చేయడం కొంచెం కష్టం, అయినప్పటికీ నిదానంగా మీకు ఆర్టికల్స్ వ్రాయడం అలవాటు అవుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్ గా బ్లాగ్ లో వ్రాయడం మొదలు పెట్టవచ్చు. 
తరువాత మనం ఆర్టికల్ ఎవరిని దృష్టిలో పెట్టుకొని వ్రాస్తున్నామో క్లారిటీ ఉండాలి. ఎందుకంటె అన్నిసార్లు అన్నివర్గాలని మనం తృప్తిపరచలేము. కాబట్టి ఎవరికి వ్రాస్తున్నారో వల్ల స్టాండర్డ్స్, వాళ్ళ ఆలోచనలకి తగినట్లుగా వ్రాయాలి. లేదంటే 5th క్లాసు చెదివే పిల్లాడికి 10th క్లాసు పాఠాలు చెప్పునట్లు ఉంటుంది.
       మీరు వ్రాసే ఆర్టికల్ మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ విషయాన్నీ సూటిగా చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే రీడర్స్ డైలమాలో పడిపోతారు. ఇందుకోసం నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను 10th క్లాసు అయ్యాక ఫోటోషాప్ నేర్చుకున్నాను. ఆ తరువాత కూడా రెగ్యులర్ గా ప్రాక్టీసు చేసేవాడిని. కొంతకాలం తరువాత నేను నాకు వచ్చిన ఫోటోషాప్ తో పార్ట్ టైం జాబు చేయాలి అని అనుకున్నాను. 
అయితే ఒక ఫోటో స్టూడియో లో డిజైనర్స్ కావాలి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆ ఫోటో స్టూడియో ఓనర్ నన్ను ఫోటోషాప్ గురించి కొన్ని విషయాలు అడిగాడు, నేను తెలిసినంత వరకూ చెప్పను. అప్పుడు ఆయన “మేము మ్యారేజ్ ఆల్బమ్స్ ఎక్కువగా చేస్తాము” అని చెప్పాడు.
       ఒక ఫోటో ఇచ్చి ఒక డిజైన్ చేయమని చెప్పాడు. నేను నాకు తెలిసినట్లు డిజైన్ ఒక గంట తరువాత అయన వచ్చి నేను చేసిన డిజైన్ చూసాడు. నీకు హెయిర్ డీటెయిలింగ్ రాదా! అని అడిగాడు. నేను ఆ మాట వినడమే ఫస్ట్ టైం. లేదండి నాకు తెలియదు, అంటే ఏమిటి? అని అడిగాను. 
అప్పుడు ఆయన ఒకతన్ని పిలిపించి తన చేత వర్క్ చేయించాడు. తను చాలా ఫాస్ట్ గా, చాలా పర్ఫెక్ట్ గా చేసాడు. అప్పుడు అర్థం అయ్యింది, హెయిర్ డీటెయిలింగ్ అంటే ఫోటోషాప్ లో హెయిర్ కటింగ్ అని. అక్కడి నుండి నేను వచ్చేశాను.
       ఆ తరువాత నేను ఆ హెయిర్ కటింగ్ (అదే హెయిర్ డీటెయిలింగ్) నేర్చుకుందాం అని ఒక సంవత్సరం పటు youtube లో ట్యుటోరియల్స్ వెతికి ప్రయత్నించేవాడిని. వాటిలో ఒక్కసారి కూడా నేను సక్సెస్ కాలేకపోయాను. ఆ తరువాత నేను చూసేన వీడియోలు అన్నింటి నుండి నేను ఒక ప్రాసెస్ తయారు చేసి దాన్ని ప్రయత్నించి సక్సెస్ అయ్యాను. 
అంటే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటి అంటే నేను దాదాపు 100 – 200 వీడియో ట్యుటోరియల్స్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఇలా అన్ని భాషలలో హెయిర్ కటింగ్ in ఫోటోషాప్ అని ఉన్నవి అన్ని  చూసాను. కానీ ఒకటి కూడా వర్క్ అవ్వలేదు. అంటే వాళ్లు చెప్పాలనుకున్న విషయం డీటెయిల్ గా చెప్పలేదు. కాబట్టి మీరు చెప్పాలనుకున్న విషయం చాలా క్లియర్ గా ఉండాలి.
మీరు ఆర్టికల్స్ వ్రాసే సమయంలో ఆ టాపిక్ కి కీవర్డ్స్ ని సహజంగా అందులో ఇమిడేలా చూసుకోవాలి. అలాగని కీవర్డ్స్ ఎక్కువ, కంటెంట్ తక్కువగా ఉండకూడదు. ఎంతవరకూ అవసరమో అంటే వాడాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ వ్రాయడం అలవాటు చేసుకుంటే నిదానంగా మీరు ఒక మంచి బ్లాగర్ అవ్వవచ్చు. జై హింద్.
Share:

WEBSITE DESIGNING COURSE | LESSON 12| HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU

WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
WEBSITE DESIGNING COURSE | LESSON 12| HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU

హాయ్, నమస్కారం ! మనం లాస్ట్ లెసన్ లో ఒక బేసిక్ లాగిన్ ఫారం ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ లెసన్ లో ఇంకా HTML లో ఉన్న మిగిలిన ముఖ్యమైన ఫార్మ్స్ ఏంటి? వాటిని ఎలా క్రియేట్ చేయాలి? అని తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్ తెలుసుకుందాం.
ఒక HTML ఫైల్ ని క్రియేట్ చేసి, అందులో ఈ విధంగా కొంత కోడింగ్ వ్రాద్దాం.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
పైన కనిపించే ఇమేజ్ లో మనం రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేసాం. వీటి గురించి మనం లాస్ట్ లెసన్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
మనం ఒక signup ఫారంలో ఉపయోగించే వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక రేడియో బటన్ ని క్రియేట్ చేద్దాం.
దాని కోసం ఈ విధంగా కొంత కోడింగ్ వ్రాయండి.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
ఈ కోడింగ్ లో input టాగ్ లో type attribute లో radio అని ఇవ్వటం జరిగింది. దీని వలన మనకి ఒక రేడియో బటన్ క్రియేట్ అవుతుంది. రేడియో బటన్ అంటే ఏదో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలో అలాంటి వాటి కోసం దీనిని ఉపయోగిస్తాం. ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది. సాధారణంగా జెండర్ కోసం ఈ రేడియో బటన్ కోసం ఉపయోగించడం జరుగుతుంది.
ఇప్పుడు ఫైల్ సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
ఇప్పుడు ఒక కన్నా ఎక్కువ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే అందుకోసం మనం checkbox అనే attribute ని ఉపయోగిస్తాం. అందుకోసం ఈ విధంగా కోడింగ్ వ్రాద్దాం.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
ఇప్పుడు సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
ఈ విధంగా మనకి checkbox క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ వంటివి సెలెక్ట్ చేసుకోవడానికి మనం select టాగ్ ఎలా వ్రాయాలి? అని తెలుసుకుందాం. అందుకోసం ఈ విధంగా కోడింగ్ వ్రాద్దాం.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
ఈ విధంగా వ్రాసిన తరువాత సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
ఇందులో మనం మొదట వ్రాసిన select టాగ్ లోపల మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ ని option టాగ్ గా వ్రాయాలి. ఇప్పుడు మనం మెస్సెజ్ టైపు చేయాలి అంటే ఒక textarea అనే టాగ్ వ్రాయాలి. అందుకోసం ఈ విధంగా వ్రాయండి.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU
ఇప్పుడు ఫైల్ ని సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
WEBSITE DESIGNING COURSE | HOW TO CREATE HTML SIGNUP FORMS HTML IN TELUGU

ఈ విధంగా మనం కొన్ని ఫార్మ్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేస్తాం.
ఇక్కడితో మనకి HTML (బేసిక్) లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. తరువాత CSS లెస్సన్స్ అందించడం జరుగుతుంది.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.

Share:

Website Designing Course | Lesson 11 | How to create HTML Forms in Telugu

Website Designing Course | How to create HTML Forms in Telugu
Website Designing Course | How to create HTML Forms in Telugu
హాయ్, నమస్కారం ! మనం లాస్ట్ లెసన్స్ లో టేబుల్స్ ద్వారా వెబ్ లేఔట్స్ ఎలాక్రియేట్ చేయాలో, అలాగే టేబుల్స్ ఉపయోగించే విధానం, వాటిల్లో ఉండే attributes గురించి తెలుసుకున్నాం. ఈ లెసన్లో మనం లాగిన్ ఫార్మ్స్ HTML ద్వారా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. HTML ఫార్మ్స్ అనేవి మనం అప్లికేషన్స్ కోసం, డాష్బోర్స్ వంటి వాటి కోసం మనం ఉపయోగిస్తాము.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఇది facebook వెబ్సైటు యొక్క హోమ్ పేజీ లో ఉండే, లాగిన్ ఫారం, సైన్  అప్  ఫార్మ్స్. ఈ లెసన్ లో లాగిన్ ఫారం  ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.
అందుకోసం నేను ఈ విధంగా కోడింగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course | How to create HTML Forms in Telugu
పైన వ్రాసిన కోడ్ లో ఒక హెడ్డింగ్ వ్రాసాను. తరువాత, form అని ఒక టాగ్ వ్రాయడం జరిగింది. ఒక ఫారం కోసం మనం ఏ టాగ్ వ్రాసిన, అవి అన్ని ఆ ఫారం టాగ్ లోపల మాత్రమే వ్రాయాలి.
అందులో మనం మొదట username అని వ్రాసి, తరువాత input అని ఒక టాగ్ వ్రాసాను. మనం ఏ విధమైన field వ్రాయాలి అన్నా, input టాగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే వ్రాసిన input టాగ్ యొక్క attribute వల్ల కూడా ఫీల్డ్ మారిపోతుంది.
ఈ లెసన్ లో మనం ఒక రెండు attributes గురించి తెలుసుకుందాం. మొదటిది text అనే attribute value. ఈ text అనే attribute value ద్వారా  మనం టైపు చేసే టెక్స్ట్ కనిపించటానికి ఉపయోగిస్తాం.
ఇలా వ్రాసిన కోడ్ సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు ఈ విధంగా మీకు కనిపిస్తుంది.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఇప్పుడు మీరు username కనుక అక్కడ టైపు చేస్తే మీరు ఏమి టైప్ చేస్తే అక్కడ అది కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక username ఈ విధంగా టైప్ చేస్తున్నాను.
Website Designing Course | How to create HTML Forms in Telugu
మీకు పైన కనిపించినట్టు కనిపిస్తుంది.
అదే టాగ్ లో name అనే attribute ఉంది. ఈ attribute మనం అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తాం. ఈ attribute ద్వారా మనం ఈ ఫారం పని చేయటానికి background లో వ్రాసిన కోడ్ కోసం ఉపయోగిస్తాం. ఒక డిజైనర్ అయితే ఇంతకూ మించి అవసరం లేదు.
తరువాత వ్రాసిన value attribute empty గా ఇవ్వటం జరిగింది. ఈ attribute లో మీరు ఏ వేల్యూ అయితే వ్రాస్తారో ఆ వేల్యూ మీకు పేజీ యొక్క రిజల్ట్ లో కనిపిస్తుంది.
మీకు ఒక ఉదాహరణ చూద్దాం.
Website Designing Course | How to create HTML Forms in Telugu
పైన చూపించిన విధంగా కనుక మీరు కోడ్ వ్రాస్తే మీకు క్రింద చూపించిన విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఇప్పుడు ఇంకొక టాగ్ ఈ విధంగా వ్రాద్దాం.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఇప్పుడు ఇందులో వ్రాసిన విధంగా వ్రాస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఇప్పుడు ఒకసారి కోడ్ చూద్దాం.
ఇందులో మనం వ్రాసిన type అనే attribute లో password అనే వేల్యూ వ్రాయటం వలన మనకి ఆ ఫీల్డ్ పాస్వర్డ్ ని హైడ్ చేస్తుంది. ఎందుకు అంటే మనం టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించకూడదు కాబట్టి, ఒక్కసారి చూద్దాం.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఇప్పుడు ఇక్కడ నేను పాస్వర్డ్ టైపు చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా పాస్వర్డ్ కనిపించకుండా ఉండటానికి, type attribute value password గా ఇవ్వాలి.
ఇక మిగిలిన name, value attributes పైన చెప్పిన విధంగా ఉపయోగపడతాయి.
అంత బాగానే ఉంది, ఇప్పుడు మనం ఒక బటన్ క్రియేట్ చేయాలి.
బటన్ కోసం ఇలా కోడింగ్ వ్రాయండి.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఈ విధంగా కోడ్ వ్రాసి, సేవ్ చేసి, వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
 Website Designing Course | How to create HTML Forms in Telugu
ఇప్పుడు మనం input టాగ్ లో మనం type attribute లో వేల్యూ submit అని ఇచ్చాము. ఇలా ఇవ్వటం వల్లనే మనకి లాగిన్ బటన్ కనిపిస్తుంది. Name attribute పైవాటిలాగే, value attribute లో మనం ఏది టైప్ చేస్తే అది డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీకు పై విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఒక ఫీల్డ్ క్రింద మరొక ఫీల్డ్ ఉండాలి అనుకుంటే ఈ విధంగా టైప్ చేయండి.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఈ విధంగా బ్రేక్ టాగ్ వ్రాస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create HTML Forms in Telugu
ఈ విధంగా మనం లాగిన్ ఫార్మ్స్ క్రియేట్ చేయవచ్చు. CSS ద్వారా మరింత అందంగా క్రియేట్ చేయవచ్చు. ఇది ఈ లెసన్, నెక్స్ట్ లెసన్ లో మిగిలిన ఫారం ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాం.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.  కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

What is Online Money Earning? Explained in Telugu | Blogger VJ


what is online money earning in telugu
what is online money earning in telugu
ఆన్లైన్ మనీ ఎర్నింగ్” ఈ మాట చదివినా, విన్నా మనలో ఎదో తెలియని ఒక ఇంట్రెస్ట్. ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయడం ఎలా? అని గూగుల్లో సెర్చ్ చేయనివారు దాదాపుగా ఉండరు అని నా అభిప్రాయం. చాలా మందికి ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు అని తెలుసు కానీ ఎలాగో తెలియదు. చాలా మంది ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అంటే డేటా ఎంట్రీ వంటి వర్కుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అనే కాన్సెప్ట్ సముద్రమంత లోతుగా ఉంటుంది. ఈ ఆర్టికల్ లో దాని గురించి కొంత తెలుసుకుందాం. 

Miku Telugu Chadavatam Rada? Don't Worry. Click Here


రాజుకి కంప్యూటర్ పరిజ్ఞానం బాగా ఉంది. తన కుటుంబ కారణాల వల్ల ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసి జాబు చేయడం స్టార్ట్ చేసాడు. అతను ఒక షాపింగ్ మాల్ (బట్టల దుకాణం) లో కంప్యూటర్ ఆపరేటర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడ అతనికి ఏ మాత్రం కొంచెం ఖాళి దొరికినా ఇంటర్నెట్ లో తనకి కావాల్సిన విషయాల పై అవగాహన పెంచుకునేవాడు. అలా ఒకరోజు అతను కొన్ని డేటా ఎంట్రీ వర్క్స్ ద్వారా ఆన్లైన్లో డబ్బు సంపదించుకోవచ్చు అని యాడ్స్ చూసాడు. ఆ తరువాత అతని మనసులో ఆ యాడ్స్ తో నిండిపాయింది.
వాటి గురించి తాను ఇంకా బాగా తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి వాటి గురించి తను విన్నాడు. ఇవి చాలా శాతం మోసపూరితమైనవి అని తన అభిప్రాయం. తను బాగా సెర్చ్ చేసిన తరువాత కొన్ని వెబ్ సైట్స్ లో డేటా ఎంట్రీ వర్క్ గురించి చూసాడు. అయితే చాలా వెబ్ సైట్ లు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అవి ఎంత అంటే 1500 నుండి 5000 రూపాయల వరకూ ఉన్నాయి. అయితే రాజు జీతం కేవలం అయిదు వేల రూపాయలు. అంతే కాక రాజు వీటి మోసాల గురించి విని ఉన్నాడు. కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. చివరికి ఒక వెబ్ సైట్ లో 600 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసాడు. వాళ్లు ఒక సీడి ని కొరియర్ చేసారు. ఆనందంగా కొరియర్ అందుకున్న రాజు సీడి ఓపెన్ చేస్తే అందులో ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది.
అందులో ఆన్లైన్ లో వర్క్ ఎలా చేయలి? ఏయే వర్కులు ఉంటాయి? ఏ ఏ వెబ్ సైట్స్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు? ఎర్న్ చేసిన డబ్బు మనం పొందటానికి paypal / payneer అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి? అని ఉంది. మొదట దాంట్లో ఉన్న విషయాల్ని జాగ్రత్తగా చదివి, వాటిని ఇంప్లెమెంట్ చేద్దాం అనుకున్నాడు రాజు. తీర అంత చదివినా తరువాత రాజు డేటా ఎంట్రీ వర్క్ చేద్దాం కదా అనుకుంది ! అందుకు వాళ్లు ఇచ్చిన వెబ్ సైట్ లింక్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేయటం మొదలుపెట్టాడు. అన్ని వెబ్ సైట్స్, ప్రతీ వెబ్ సైట్  రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమని అడుగుతున్నారు.
ఇది మనకి వర్కౌట్ కాదు అని అర్థం అయిన రాజు మిగిలిన మార్గాల గురించి ఆలోచించాడు. తరువాత టానికి కనిపించిన మార్గం CAPTCHA ఎంట్రీ. అయితే ఇది చాలా కష్టం, చాలా సమయం వృధా అవుతుంది. అందులో ఇచ్చిన వెబ్ సైట్లో ఒక దాంట్లో ఫ్రీగా రిజిస్టర్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసాడు. ఆ తరువాత మొదలైంది అసలు కథ. 1500 CAPTCHA లు ఎంటర్ చేస్తే తనకి ఒక US డాలర్ వస్తుంది. కాబట్టి ఇది కూడా వర్కౌట్ కాలేదని దానిని వదిలేసి, ఈమెయిలు రీడింగ్ లింక్స్ లో రిజిస్టర్ అయ్యాడు. తరువాత దాని వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకున్నాడు.
తరువాత కొంత కాలం వరకూ రాజు మళ్ళి ఇలాంటి ఆన్లైన్ ఎర్నింగ్ ప్రోగ్రామ్స్ కి దూరంగా వుండి, తను నేర్చుకున్న ఫోటోషాప్ డిజైనింగ్ పై ఇంట్రెస్ట్ పెట్టి తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. తరువాత అక్కడ జాబు మానేసి ఒక డిజైనింగ్ కంపనీలో డిజైనర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడ వర్క్ చేస్తున్న సమయంలో అతనికి ఒక కంపెనీ డైరెక్టర్ పరిచయం అయ్యారు. అతనికి తను పర్సనల్ గా డిజైన్స్ చేస్తాను అని చెప్పి ఒకటి రెండు డిజైన్స్ చేసి ఇచ్చాడు. రాజు వర్క్ నచ్చిన అతను తన కంపెనీకి సంబంధించిన వర్క్స్ అన్ని రాజు చేత చేయించుకున్నాడు. రాజు తన జాబు చేసుకుంటూనే పార్ట్ టైం లాగా ఈ వర్క్స్ కూడా చేసుకునేవాడు. రాజు ఏ రోజు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళేవాడు కాదు, వాళ్లు రాజు వర్క్ చేసే కంపెనీ కి వచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ల వర్క్ ఇన్ టైం లో అయిపోయేవి.
అందుకోసం రాజు టెక్నాలజీ ఉపయోగించుకునే వాడు. వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలో వాళ్ళని వివరంగా అడిగి, డిజైన్ చేసి మెయిల్ చేసేవాడు. వాళ్లు, చిన్న, చిన్న మార్పులు, చేర్పులు లాంటివి ఉంటె ఫోన్ లో చేప్పేవాళ్ళు. ఈ విధంగా రాజు ఆన్లైన్ లో ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేసాడు. క్రమంగా అతను (కంపెనీ డైరెక్టర్)  తనకి తెలిసిన వాళ్ళకి రిఫర్ చేస్తూ రాజుకి సహాయం చేస్తూ ఉండేవాడు. అలా కొంత కాలానికి తనకి ఆన్లైన్ ద్వారా వచ్చే వర్క్ (ఇన్కమ్ కూడా) పెరిగిపోయింది. జాబ్ మానేసి ఫుల్ టైం వర్క్ చేయడం మొదలుపెట్టాడు. తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి తనతో పాటుగా మరికొంత మందికి జాబు ఇవ్వగలిగాడు.
ఇక్కడ నేను చెప్పిన ఇన్సిడెంట్ లో రాజు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ గురించి ఆలోచించి తన టైం, కొంత డబ్బు వేస్ట్ చేసుకున్నాడు. తరువాత తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నాక, తనకి ఒక అవకాశం వచ్చింది. దానిని తను సద్వినియోగం చేసుకున్నాడు, ఇక్కడ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అంటే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయడం అంటే చాలా తేలిక అనే విషయం పూర్తిగా తప్పు. “కష్టపడనిదే ఏది రాదు” కాబట్టి అలా వస్తుంది అంటే అక్కడ ఏదో మోసం ఉంది ఉండవచ్చు.
నా దృష్టిలో ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అంటే టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఉన్న చోట ఉండి , కష్టపడి డబ్బు సంపాదించుకోవడం. అయితే ఇక్కడ మనకి కొంత వెసులుబాటు వుంటుంది. టైం కి రావాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఇలాంటివి ఉండవు. ఒక క్లైంట్ కి వెబ్ సైట్ డిజైన్ చేసి, ఆన్లైన్ లో మన అకౌంట్ కి డబ్బులు వేయించుకుని, వర్క్ కంప్లీట్ చేయటం కూడా ఆన్లైన్ మనీ ఎర్నింగ్. ఒక లోగో డిజైన్ చేయడం, బ్లాగ్గింగ్ చేయటం ఇలాంటివి అన్ని కూడా ఆన్లైన్ మనీ ఎర్నింగ్ చేయవచ్చు. (ఇంకా ఉంది ........) 
  What is Online Money Earning? ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అంటే ఏమిటి? Part -2 

Tenglish

“Online Money Earning” ee mata chadivina, vinna manalo yedo teliyani oka interest. Online lo money earn cheyadam yela? ani google lo search cheyanivaru dadapuga undaru ani naa abhiprayam. Chala mandiki online dwara money earn cheyavachu ani telusu kani, yelago teliyadu. Chala mandi online money earning ante data entry workula gurinchi matrame aalochistaru. Kani online money earning ane concept samudramanta lothuga untundi. Ee article lo dani gurinchi kontha telusukundam.
Raju ki compute parignanam baga undi. Tana kutumna karanala valla intermediate madhyalone aapesi job cheyadam start chesadu. Athanu oka Shopping Mall ( battala kotlo) computer operator ga join ayyadu. Akkada athanu tanaki ye matram konchem kali dorikina tanaki kavalsina vishayala pai avagahana penchukunevadu. Ala oka roju athanu konni data yentri works dwara online lo dabbu sampadinchavachu ani konni ads chusadu. Aa taruvata atani manasulo aa ads tho nindipoyindi.
Vati gurinchi tanu inka baga telusukovali ani anukunnadu. Endukante ilanti vati gurinchi tanu vinnadu. Ivi chala satham mosapooritham ayinavi ani tana abhiprayam. Tanu baga search chesina taruvata konni websites lo data entry work gurinchi chusadu. Ayithe chala websites registration fees vasulu chestunnayi. Avi yentha ante 1500 nundi 5000 varakoo unnayi. Ayithe Raju jeetam kevalam five thousand rupees. Anthe kaka Raju viti mosala gurinchi vini unnadu kabatti risk tisukodalachukoledu. Chivariki oka website lo 600 rupayalu fees pay chesadu. vallu oka c.d. ni courier chesaru. Happyga courier andukunna Raju c.d. open cheste andulo oka word document undi.
Andulo online lo work yela cheyali? Yeye workulu untayi? Yeye websites dwara money earn cheyavachu? Earn chesina dabbu manam pondataniki paypal/ payneer accounts yeal create cheyali? ani undi. Modata dantlo unna vishayalni jagrathaga chadivi, vatini implement cheddam anukunnadu Raju. Teera antha chadivina taruvata, Raju Data Entry Work kada cheddam ani kada anukundi! Anduku vallu ichina website links okkokati open cheyatam modalupettadu. Anni websites, prati website registration fees kattamani adugutunnaru.
Idi manaki workout kadu ani artham ayina Raju migilina margala gurinchi aalochinchadu. Taruvata tanaki kanipinchina margam Captcha entry. Ayithe idi chala kashtam, chala samayam vrudha avutundi. Andulo ichina websitelo oka dantlo free ga register ayyi work start chesadu. Aa taruvata modalaindi asalu katha. 1500 Captcha lu enter cheste tanaki oka US dollar vastundi. Kabatti idi kooda workout kaledani danini vadilesi, email reading links lo register ayyadu. Taruvata dani valla kooda yelanti upayogam ledani telusukunnadu.
Taruvata kontha kalam vatakoo Raju malli ilanti online earning programs ki dooramga undi, tanu nerchukunna Photoshop Designing pai interest petti tana skills ni improve chesukunnadu. Taruvata akkada job manesi oka designing company lo designer ga join ayyadu. Akkada work chestunna samayamlo ataniki oka company director parichayam ayyaru. Ataniki tanu personal ga designs chestanu ani cheppi, okati rendu designs chesi ichadu. Raju work nachina atanu tana company ki sambandhinchina works anni Raju cheta cheyinchukunnadu. Raju tana job chesukutoone part time laga ee works kooda chesukunevadu. Raju ye roju valla office ki vellevadu kadu, vallu Raju work chese company ki vache vallu kadu. Kani valla work intime lo ayipoyevi.
Andukosam Raju technology upayoginchukunevadu. Vallaki yelandi designs kavalo vallani vivaramga adigi, desing chesi mail chesevadu. Vallu chinna chinna marpulu, cherpulu lantivi unte phone lo cheppevallu. Ee vidhamga Raju online lo earning cheyatam start chesadu. Kramamga Atanu (Company Director) tanaki telisina vallaki refer chestoo Rajuki sahayam chestoo undevadu. Ala kontha kalaniki tanaki online dwara vache work (income kooda) perigipoyindi. Job manesi full time work cheyatam modalupettadu. Tanu oka business start chesi tanato patuga marikontha mandiki job ivvagaligadu.
Ikkada nenu cheppina incident lo Raju online money earning gurinchi alochinchi tana time, kontha dabbu waste cheukunnadu. Taruvata tana skills ni improve chesukunnaka, tanaki oka avakasam vachindi. Danini tanu sadviniyogam chesukunnadu, Ikkada online money earning ante oka vishayam gurtu pettukovalil. Online lo money earn cheyatam ante chala telika ane vishayam poorthiga tappu. “Kastapadanide Yedi Radu”, kabatti ala vastundi ante akkada yedo mosam undi undavachu.
Naa drushti lo online money earning ante technology ni upayoginchukuni manam unna chota undi, kashtapadi dabbu sampadinchukovadam. Ayite ikkada manaki konta vesulubatu untundi. Time ki ravali, good morning cheppali, ilantivi undavu. Oka client ki website design chesi, online lo mana account ki dabbulu veyinchukuni, work complete cheyatam dwara kooda online money earning kindake vastundi.
Oka logo design cheyatam, Blogging cheyatam ilantivi anni kooda online money earning chevavachu. (inka undi...)

Share:

What is Blogging in Telugu? | Blogging Tips in Telugu | Blogger VJ

What is Blogging in Telugu
What is Blogging in Telugu
బ్లాగర్ అవ్వటం చాలా చాలా తేలిక. అవును చాలా చాలా తేలిక. ఎందుకు అంటే ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మనకి ఆసక్తి ఉన్న అన్ని విషయాల గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి బ్లాగర్ అవ్వటం చాలా తేలిక. బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? బ్లాగ్గింగ్ చేయటం వల్ల డబ్బులు  సంపాదించవచ్చా? కేవలం డబ్బు సంపాదించడం కోసమే బ్లాగ్గింగ్ చేయవచ్చా?  మనకి తెలుగులో ఎంతవరకూ అవకాశం ఉంది? అనేటువంటి విషయాలు తెలుసుకుందాం! 

Miku Telugu Chadavatam Rada? Don't Worry. Click Here

బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?

       బ్లాగ్గింగ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి రీడర్స్ తో పంచుకోవటమే. అది ఏ విషయం అయిన కావచ్చు, వంటలు వండటం కావచ్చు, ఏదైనా టెక్నాలజీ గురించి కావచ్చు, పాత తరం ముచ్చట్లు కావచ్చు, మీ జాబ్ ఎక్స్పెరిన్స్ కావచ్చు, మీ బిజినెస్ ఎక్స్పెరిన్స్ కావచ్చు ఇలా కాదేది బ్లాగ్గింగ్ కి అనర్హం. ఇలా ఏ టాపిక్ పైన అయిన మీకు తెలిసిన విషయాల్ని రీడర్స్ తో షేర్ చేసుకోవచ్చు.
       బ్లాగ్గింగ్ లో మనకి తెలిసిన విషయం గురించి రీడర్స్ కి అర్థం అయ్యే విధంగా , బోర్ కొట్టకుండా ఆర్టికల్స్ వ్రాయడం. అందుకోసం మనకి ప్రత్యేకంగా ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. వ్రాసే ఆర్టికల్ పై అవగాహన ఉండి వాడుక భాషలో, అర్థం అయ్యేటట్లు వ్రాయగలిగితే చాలు. అంతకు మించిన ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు.
       బ్లాగ్గింగ్ అంటే మొదట వెబ్ లాగ్ గా పిలిచేవాళ్ళు. అంటే వెబ్ సైట్ లో లేదా బ్లాగ్ లో రెగ్యులర్ గా పోస్టింగ్స్ చేయటం. అది కాలక్రమేణా బ్లాగ్ గా స్థిరపడింది. ఈ బ్లాగ్గింగ్ అనేది ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడిపుడే మన దగ్గర కూడా బ్లాగ్గింగ్ ఒక ప్రొఫెషన్ గా ఎంచుకోబడుతుంది. మన దేశంలో కూడా చాలా మంది ప్రొఫెషన్ లో బ్లాగర్స్ ఉన్నారు.

బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చా?

      అవును బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. అయితే బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అవి మన బ్లాగ్ / వెబ్ సైట్ లో Google AdSense యాడ్స్ ద్వారా ఎర్న్ చేయవచ్చు. ఈ మెథడ్ (పద్ధతి) పూర్తిగా సేక్యుర్డ్ / జేన్యున్. తరువాత మన బ్లాగ్ ద్వారా కొన్ని బ్రాండ్స్ లేదా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. దీనిని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. మన బ్లాగ్ లో ఇచ్చిన లింక్ లేదా ఇమేజ్ పై క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ / సర్వీస్ ని కొనుగోలు చేయటం ద్వారా సదరు కంపెనీ కమిషన్ రూపంలో చెల్లిస్తుంది.
       అంతే కాకుండా మన సొంత ప్రొడక్ట్స్ / సర్వీస్ లని సేల్ చేయడం ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు. మన బ్లాగ్ లేదా వెబ్ సైట్ బాగా పాపులర్ అయితే మీరు కొన్ని కంపెనీలకి సంబంధించిన ప్రోడక్ట్ లకి రివ్యూ లు వ్రాయడం ద్వారా ఆ కంపెనీలు మనకి కొంత మనీని ఇస్తాయి. అలాగే లోకల్ బిజినెస్ లా దగ్గర నుండి కూడా యాడ్స్ డిస్ప్లే చేసి మనీ ఎర్న్ చేయవచ్చు.

కేవలం డబ్బు సంపాదించడం కోసమే బ్లాగ్గింగ్ చేయవచ్చా?

       మనం ఇంతకూ ముందు చెప్పుకున్నట్లు బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్నింగ్ చేయవచ్చు. అయితే కేవలం డబ్బు సంపాదించడం కోసం బ్లాగ్ రన్ చేసినా, తరువాత మన కెరీర్ ని బిల్డ్ చేసుకోవటానికి బ్లాగ్ ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇతర స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి బ్లాగ్గింగ్ చక్కగా ఉపయోగపడుతుంది.
       వీటిల్లో మనకి కొంత ఎక్స్పెరిన్స్ వచ్చాక, మనం వాటిని బిజినెస్ సర్వీసెస్ కి సేల్ చేసుకోవచ్చు. ఇలా ఒక బిజినెస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాగ్గింగ్ తో కేవలం డబ్బు మాత్రమే కాకుండా గుర్తింపు కూడా వస్తుంది. కాబట్టి బ్లాగ్గింగ్ కేవలం డబ్బు కోసమే చేయకూడదు.

బ్లాగ్గింగ్ కి తెలుగులో ఎంతవరకూ అవకాశం ఉంది?

       ఇంత వరకూ బ్లాగ్గింగ్ గురించి చెప్పుకున్నాం కదా! మరి అయితే మనకి తెలుగులో బ్లాగింగ్ చేసేవాళ్ళకి  ఎంత వరకూ అవకాశం ఉంది? ఇప్పటికి ఇంగ్లిష్, హిందీ లో బ్లాగ్గింగ్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే 2017 వరకూ కూడా తెలుగు బ్లాగ్ కి Google Adsence ద్వారా యాడ్స్ పెట్టుకునే అవకాశం లేదు. కానీ 2017లో Google తెలుగు భాషనీ కూడా గుర్తించి తెలుగు బ్లాగ్స్ / వెబ్ సైట్స్ ని కూడా అప్రువ్ చేస్తుంది, ఇప్పుడు ఇప్పుడే తెలుగులో కూడా బ్లాగ్గింగ్ పై అవగాహన కలుగుతుంది. కాబట్టి తెలుగులో బ్లాగ్గింగ్ చేసేవాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొదలుపెడితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వవచ్చు.
       కాబట్టి బ్లాగ్గింగ్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇంతే. ముందు ముందు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు  గారు చెప్పినట్లు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని ఈ టాపిక్ ని ఇంతటితో ముగిస్తాను. జైహింద్. 

Tenglish

Blogger avvatam chala chala telika. Avunu, chala chala telika. Yenduku ante ee roju manaku andubatulo unna technology, manaki aasakti unna anni vishayla gurinchi chala samacharanni andistundi. kabatti blogger avvatam chala telika. Blogging ante yemiti? Blogging cheyatam valana dabbulu sampadhinchavacha? kevalam dabbu sampadinchadam kosame blogging cheyavacha? Kevalam dabbu sampadinchadam kosame blogging cheyacha? Manaki telugu lo blogging cheyatam valana yenthavaraku dabbu sampadinche avakasam undi? anetuvanti vidhayalu telusukundam!

Blogging Ante Yenti?


Blogging ante yedaina oka vishayam gurinchi readers tho panchukovatame. Adi ye vishayam ayina kavachu, vantalu vandatam kavachu, yedaina technology gurinchi kavachu, pata taram michatlu kavachu, mi job experience kavachu, mi business experience kavachu, ila kadedi blogging ki anarham. Ila ye topic paina ayina miku telisina vishayalni readers tho share chesukovach.

       Blogging manaki telisina vishayam gurinchi readers ki artham ayye vidhamga, bore kottakunda articles vrayadam. Andukosam manaki pratyekamga ye qualification avasaram ledu. Vrase article pai avagahana undi vaduka bashalo artham ayyatatlu vrayagaligithe chalu. Antaku minchina ye qualification avasaram ledu.  

Blogging ante modata web log ga pilichevallu. Ante website lo leda blog lo regular ga postings cheyatam. Adi kalakramena blog ga sthirapadindi. Ee blogging anedi yevaraina cheyavachu. ippudipude mana daggara kooda blogging oka proffession ga yenchukobadutundi. Mana desamlo kooda chala mandi profession bloggers unnaru.      

Blogging Dwara Money Earn Cheyavacha?


       Avunu blogging dwara money earn cheyavachu. Ayithe blogging dwara money earn cheyataniki aneka margalu unnyi, Avi mana blog/ website lo Google Adsence ads dwara earn cheyavachu. Ee method poorthiga secured / genuine. Taruvata mana blog dwara konni brands leda products ni promore cheyatam dwara money earn cheyavachu. Dinini Affiliate Markerting ani antaru. Mana blog lo ichina link leda image pai click chesi aa product / service ni knugolu chyatam dwara aa company manaki commission roopamlo chelistundi.

       Anthe kakunda mana own products / service lani sale cheyatam dwara manam dabbu sampadinchavachu. Mana blog leda website baga popular ayithe miru konni companilaki sambandhinchina product laki reviews vrayadam dwara aa companylu manaki kontha money ni istayi. Alage local business la dagara nundi kooda ads display chesi money earn cheyavachu.

Kevalam Dabbu Sampadinchadam Kosame Blogging Cheyavacha?


       Manam intaku mundu cheppukunnatlu blogging dwara money earning cheyavachu. Ayithe kevalam dabbu sampadinchadam kosam blog run chesina, taruvata mana carrer ni build chesukovataniki blog ni upayoginchukovali. Alage itara skills ni improve chesukovataniki blogging chakkaga upayogapadutundi.

       Vitillo manaki kontha experience vachaka, manam vatini business services ki sale chesukovachu. Ila oka business ni mana kriyet chesukovachu. Blogging tho kevalam dabbu matrame kakunda gurtimpu vastundi. Kabatti blogging kevalam dabbu kosame cheyakudadu.  

Blogging ki Telugulo Yenta Varakoo Avakasam Undi?


       Intha varakoo blogging gurinchi cheppukunnam kada! Mari ayithe manaki telugu lo blogging ki yenta varako avakasam undi? Ippatiki English, Hindi lo blogging chesevallu chala mandi unnaru. Ayithe 2017 varakoo kooda Telugu blogs Google Adsence dwara ads pettukune avakasam ledu. Kani 2017lo Google telugu bashani kooda gurtinchi telugu blogs/ websites ni kooda approve chestundi. Ippudu ippude telugulo kooda blogging pai avagahana kalugutundi. Kabatti telugulo blogging chesevallaki manchi bhavishyattu untundi. Kabatti ippudu modalupedithe khachitamga success avvavachu.

       Kabatti Blogging gurinchi simple ga cheppukovalante inthe. Mundu mundu marinni vishayalanu telusukundam. Srikrishnadeva Rayalu garu cheppinatlu “Desa Bashalandu Telugu Lessa” ani ee topic ni intatitho mugistanu. Jai Hind.  
Share:

Website Designing Course | Lesson 10 | How to create web layout using Table in HTML | Part -2

Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
హాయ్ నమస్కారం, మనం లాస్ట్ లెసన్ లో ఒక వెబ్ లేఔట్ కేవలం HTML ద్వారా  టేబుల్స్ ఉపయోగించి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఆ లెసన్ లో సింగల్ కాలమ్ వెబ్సైటు ఎలా చేయాలో చూసాం. ఈ లెసన్ లో మనం two కాలమ్ వెబ్సైటు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది మీరు ఇంతకుముందు నేర్చుకున్న లెసన్ కి పార్ట్ 2 అని కూడా అనుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్ స్టార్ట్ చేద్దాం.
ముందుగా మనం ఈ విధంగా కోడింగ్ చేసిన వెబ్ పేజీ ని క్రియేట్ చేద్దాం. 
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇప్పుడు నేను ఈ విధంగా కొంత కోడింగ్ ని వ్రాస్తున్నాను.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ముందుగా నేను ఒక టేబుల్ టాగ్ వ్రాసాను. తరువాత అందులో ఒక tr టాగ్ వ్రాసాను. అందులో ఒక td వ్రాసి, దానిలో ఒక లోగో ని ఇన్సర్ట్ చేశాను. అప్పుడు మీకు పైన చూపించిన విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు నేను దాని ప్రక్కన ఒక మెనూ రావటం కోసం ఈ విధంగా వ్రాస్తున్నాను.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
పైన కనిపించే ఇమేజ్ లో సెలెక్ట్ చేసిన కోడ్ వ్రాసిన తరువాత సేవ్ చేసి, వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
పైన కనిపించే ఇమేజ్ లో మీకు లోగో ప్రక్కన ఈ విధంగా ఒక మెనూ కనిపిస్తుంది. ఇలా ప్రక్కప్రక్కన నావిగేషన్ లింక్స్ రావటం కోసం నేను లోగో ఇన్సర్ట్ చేసిన td తరువాత ఇంకొక td లోపల ఒక table టాగ్ ని వ్రాసాను. అందులో నేను ఒక tr టాగ్ వ్రాసి, మళ్ళి అందులో 5 td లు వ్రాసాను. ఆ td లలో ప్రతి దానిలోని ఒక anchor టాగ్ ని వ్రాసాను. Href మాత్రం డమ్మి లింక్స్ గా # ఇవ్వటం జరిగింది.
Note: ఒక టేబుల్ లోపల ఎన్ని టేబుల్స్ అయినా ఇన్సర్ట్ చేయవచ్చు. కానీ వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎక్కడన్నా ఒక టాగ్ అయినా బ్రేక్ అయినా మొత్తం స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త!
ఇప్పుడు మీకు వెబ్ లేఔట్ స్ట్రక్చర్ రావటం కోసం నేను మొదట వ్రాసిన మెయిన్ టేబుల్ కి నేను బార్డర్, ఇంకా సెంటర్  align, టేబుల్ width  attributes ఈ విధంగా వ్రాస్తున్నాను.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
 ఇప్పుడు సేవ్ చేసి, వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
మనం వ్రాసిన బార్డర్ attribute వలన మనకి బార్డర్ యొక్క width డిఫైన్ అవుతుంది. అదే మీరు వేల్యూ 2 ఇస్తే, బార్డర్ థిక్ నెస్ అనేది పెరుగుతుంది. కానీ మనకి 1 సరిపోతుంది. Align attribute ద్వారా మనం సెంటర్, లెఫ్ట్, రైట్ అలైన్మెంట్స్ చేయవచ్చు అని మీకు తెలుసు కదా! ఇక చివరగా width. మనం మనకి కావాల్సినంత width ఇవ్వవచ్చు. నేను మాత్రం ఈ లెసన్ లో 900 pixels ఇచ్చాను.
కానీ నాకు లోగో td width ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా? అయితే ఆ td టాగ్ లో width attribute ఈ విధంగా వ్రాద్దాం.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
నేను 30% width లోగో td కి అలాట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇప్పుడు మనకి మెనూ లెఫ్ట్ align అయినట్టు కనిపిస్తుంది.
మనం మెనూ లింక్స్ ని సెంటర్ align చేద్దాం. అందుకోసం ఈ విధంగా కోడింగ్ వ్రాద్దాం.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇందులో నేను మనం మెనూ కోసం వ్రాసిన టేబుల్ యొక్క width 100% అని, tr align center అని, ప్రతి td width 20% అని ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేసి, వెబ్ పేజీని  రిఫ్రెష్ చేయండి.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
మనకి పై విధంగా కనిపిస్తుంది. ఇపుడు ఈ కోడ్ ఎందుకు ఇలా వ్రాయాలి అని తెలుసుకుందాం.
మొదట మనం మెనూ కోసం వ్రాసిన టేబుల్ width 100% అని ఇచ్చాము. లోగో వ్రాసిన td width 30% అని వ్రాసాము, ఇంకా అందులో 70% ఉంది. ఆ మొతం స్పేస్ టేబుల్ కోసం మాత్రమే అని (ఆ టేబుల్ రో లో ) అక్కడ డిఫైన్ చేస్తున్నాం.
తరువాత tr align center చేసాం. ఇలా వ్రాయటం వలన tr టాగ్ లోపల వ్రాసే tdల అలైన్మెంట్ కూడా సెంటర్ అవుతుంది.
చివరగా ప్రతి td లోను width 20% అని వ్రాసాము. మనకి మొత్తం 5 నావిగేషనల్ లింక్స్ ఉన్నాయి. మొత్తం టేబుల్  యొక్క width 100% అయితే, మనకి ప్రతి td width 20% అయితేనే అన్ని tdలు సమానంగా ఉంటాయి.
ఇక్కడితో హెడర్  సెక్షన్ అయినట్లే. ఇక మెయిన్ బాడీ కంటెంట్ చూద్దాం.
(హెడర్ సెక్షన్ అంతా లాస్ట్ లెసన్ లో ఎలా క్రియేట్ చేసామో ఇక్కడ కూడా అలాగే చేయాలి, అందుకే సేమ్ కోడ్ పేస్ట్ చేయడం జరిగింది.)
ఇప్పుడు మనం టూ కాలమ్ వెబ్సైటు క్రియేట్ చేయాలి అని అనుకున్నాం కాబట్టి అందుకు సంబంధించిన కోడ్ ఈ విధంగా వ్రాస్తున్నాను.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
పైన కనిపించే ఇమేజ్ లో మీకు సెలెక్ట్ అయ్యి ఉన్న కోడ్ మనం వెబ్ పేజీ లో వ్రాసి సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇప్పుడు వ్రాసిన కోడ్ ఏంటో చూద్దాం.
కామెంట్ తర్వాత ఒక tr వ్రాసాను. అందులో ఒక td వ్రాసి, ఆ td కి colspan అనే attribute వ్రాయటం జరిగింది. ఎందుకు colspan వ్రాస్తామో లాస్ట్ లెసన్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు colspan వ్రాయకపోతే అలైన్మెంట్స్ మనకి కావాల్సినట్టుగా రావు (కుదరవు).
ఆ td లో ఒక హెడ్డింగ్ టాగ్ వ్రాసాను. ఇప్పుడు ఒక చిన్న పేరాగ్రాఫ్ యాడ్ చేస్తాను.

Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఈ విధంగా పేరాగ్రాఫ్ టాగ్ యాడ్ చేసి, దానిని సెంటర్ align చేసి, ఫైల్ ని సేవ్ చేయండి. తరువాత వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇప్పుడు ఈ విధంగా కోడ్ యాడ్  చేద్దాం.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇందులో నేను మరల ఒక టేబుల్ ఇన్సర్ట్ చేశాను. ఆ టేబుల్ కి width అనే attribute ద్వారా 100% అని ఇచ్చాను. ఆ టేబుల్ లోపల ఒక tr, దాని లోపల ఒక td వ్రాసాను. ఆ td కి కూడా width అనే attribute వ్రాసి 70% ఇచ్చాను.
ఇప్పుడు ఆ td లోపల ఇమేజ్ టాగ్ వ్రాసి ఒక టాగ్ వ్రాశాను. ఇప్పుడు సేవ్ చేసి, వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి.  అప్పుడు మీకు ఈ విధముగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇప్పుడు మళ్ళి ఈ విధంగా కోడ్ వ్రాయండి.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఈ విధంగా నేను ఒక హెడ్డింగ్ టాగ్, ఒక పేరాగ్రాఫ్ టాగ్ వ్రాసాను. ఇప్పుడు ఈ ఫైల్ ని సేవ్ చేసి, వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది,
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఏంట్రా టూ కాలమ్ వెబ్సైటు అని సింగల్ కాలమ్ వెబ్సైటు చేస్తున్నాడు ఏంట్రా అనుకుంటున్నారా? ఆగండాగండి !
ఇప్పుడు మనం ఇంతవరకు వ్రాసిన td క్లోజ్ అయ్యాక ఇంకొక td టాగ్ వ్రాయండి. నేను ఈ విధంగా కోడ్ వ్రాస్తున్నాను.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2

నేను ఒక td లోపల ఒక హెడ్డింగ్ టాగ్, ఒక పేరాగ్రాఫ్ టాగ్ వ్రాసాను.  సేవ్ చేసి, రిఫ్రెష్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇప్పుడు మనం వ్రాసిన హెడ్డింగ్ టాగ్, పేరాగ్రాఫ్ టాగ్ కాపీ చేసి, 2 సార్లు ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా హెడ్డింగ్స్ మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు మార్చుకోవాలి అనుకుంటే హెడ్డింగ్ టాగ్స్ లో ఉన్న రీసెంట్ పోస్ట్స్ ని మార్చండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
ఇప్పుడు ఫుటర్ సెక్షన్ వ్రాయండి. ఆల్రెడీ మనం లాస్ట్ లెసన్ లో వ్రాసాము కదా, అదే సెక్షన్ వ్రాయండి.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course in Telugu | How to create web layout using Table in HTML | Part -2
మనం లాస్ట్ క్లాస్ లో టేబుల్స్ ద్వారా ఒక వెబ్ లేఔట్ క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ లెసన్ ద్వారా టేబుల్స్ గురించి మరింత తెలియచేయాలి అని మరో వెబ్ లేఔట్ లెసన్ ప్లాన్ చేయటం జరిగింది.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.  కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

Popular Posts