How to start blogging in Telugu? Blogging Tips | Blogger VJ

How to start blogging in Telugu
How to start blogging in Telugu

“సబ్బు బిళ్ళ - కుక్క పిల్ల – అగ్గిపుల్ల కదెదీ కవితకి అనర్హం” అని అన్నారు శ్రీ శ్రీ గారు. అవును టాలెంట్ ఉన్నవాడు తనకు ఉన్న పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకుంటాడు. మీరు అవకాశం కోసం ఎదురు చూసేవారా? అవకాశాన్ని సృష్టించుకునే వారా? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే బ్లాగ్గింగ్ కి కూడా నేను పైన చెప్పినవి వర్తిస్తాయి. కాబట్టి ఈ ఆర్టికల్ లో బ్లాగ్గింగ్ ఏ టాపిక్స్ పై చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి? ఒక బ్లాగర్ కి (సక్సెస్ కావాలి అనుకునే వారికీ) ఉండవలసిన లక్షణాలు ఏమిటి? అనే అంశాలు చూద్దాం!

Miku Telugu Chadavatam Rada? Don't Worry. Click Here


       మనం ఇంతకు ముందు బ్లాగ్గింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. బ్లాగర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో చెప్పుకున్నాం. ఒక బ్లాగ్ ఆర్టికల్ వ్రాయడం అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి మాత్రమే వ్రాయడం కాదు. వ్రాయడం ఒక కళ. ఇప్పుడు అంటే రచయితల గురించి పెద్దగ ఎవరికీ ఆసక్తి లేదు కనీ, ఒక 15 / 20 ఏళ్ళ క్రితం రచయితల నుండి వచ్చే నవలలు, కథలు, సీరియళ్ళు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసేవారు. అలంటి వాళ్ళలో నేను ఒకటి రెండు పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. యండమూరి వీరేంద్రనాథ్ గారు, యద్దనపూడి సులోచనారాణి గారు, ఇలా అన్ని బాషలలో సాహిత్యానికి సేవ చేసిన వాళ్లు “ఎందరో మహానుభావులు. అందరికి వందనాలు” ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే “writing is not writing, it’s an art”.

బ్లాగ్గింగ్ ఏ ఏ టాపిక్స్ పై చేయాలి?

      మొదటే శ్రీ శ్రీ గారి వాక్యం చెప్పుకున్నట్లు, కాదేది బ్లాగ్గింగ్ కి అనర్హం. మీరు ఏ టాపిక్ తీసుకున్నా, దాని గురించి తెలుసుకోవాలి అనుకునే రీడర్స్ ఉంటారు. ముందుగా టాపిక్ ని నిషి (niche) అని పిలవాలి. బ్లాగ్గింగ్ నేర్చుకునేటప్పుడు టర్మినలజి కూడా నేర్చుకోవాలి. బ్లాగ్గింగ్ ఏ నిషి పై అయిన చేయవచ్చు. ఉదాహరణకి, వంటలు వాడటం, ఆన్లైన్ టెక్నాలజీస్ గురించి వివరణ చేయడం, ఫిట్నెస్ టిప్స్ ఇవ్వడం, హెల్త్ టిప్స్, సెక్సువల్ టిప్స్ ఇవ్వడం, కంప్యూటర్ హార్డువేర్ గురించి వివరించడం ఇలా ఏ నిషి పై అయిన బ్లాగ్ ఆర్టికల్స్ వ్రాయవచ్చు.
       అయితే నీకు ఆ నిషి పై పూర్హి ఇష్టం లేదా బాగా అభిరుచి ఉండాలి. పూర్తిగా దాని గురించి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటె మన అభిరుచి, తెలుసుకోవాలనే తపనని రగల్చి మరింత తెలుసుకునేలా చేస్తుంది. అలా కాకుండా ఒక నిషి పై పూర్తి అవగాహనా ఉండి, దాని గురించి మీకు A – Z తెలిసి, మీకు దాని పై ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, మీకు తెలిసిన విజ్ఞానం రీడర్స్ కి సరిగ్గా చేరాడు. అందుకే మనం బ్లాగ్గింగ్ క్ష్హెసె నిషి పై మనకి బాగా ఇష్టం / అభిరుచి  ఉండాలి.

కొన్ని నిషి ఐడియాలు:

 • కూకింగ్
 • ఆన్లైన్ ట్యుటోరియల్స్
 • ఇన్సూరెన్స్
 • డేటింగ్ టిప్స్
 • ఫిట్నెస్ టిప్స్ ఫర్ మెన్
 • ఫిట్నెస్ టిప్స్ ఫర్ విమెన్
 • హెల్త్ టిప్స్
 • పేరెంటింగ్ బ్లాగ్
 • టెక్నాలజీ రివ్యూస్
 • గాడ్జెట్ రివ్యూస్
 • ఆన్లైన్ మనీ ఎర్నింగ్
 • ఫోటోగ్రఫీ టిప్స్
 • వీడియోగ్రఫీ టిప్స్
ఇలా ఎన్నో నిషిస్ ఉన్నాయి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ పై బ్లాగ్గింగ్ చేయడం మొదలుపెడితే సక్సెస్ అవగలరు.

బ్లాగ్ ఆర్టికల్స్ ఎలా వ్రాయాలి?

       చాలా మందికి బ్లాగ్గింగ్ గురించి తెలుసుకున్నాక, మొదట వచ్చే ప్రశ్న బ్లాగ్ లో ఆర్టికల్స్ ఎలా వ్రాయాలి? నాకు ఎలా వ్రాయాలో తెలియదు, మరి ఎలా? ఇలా రకరకాల డౌట్స్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. ఒక ఆర్టికల్ ఎలా వ్రాయాలి అని ఎక్కడా ఎలాంటి నిభందనలు లేవు. ఒక ఆర్టికల్ ఎలా వ్రాయాలి అని నన్ను అడిగితే, “చదివే వాళ్ళకి అర్థం అయ్యేలా” అని చెప్తాను. అంతే కదా!
          నేను 7th క్లాస్ చదివేటప్పుడు మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. అందులో మాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ లో 3 మార్కులు నీట్ హ్యాండ్ రైటింగ్ కి ఉండేవి. తరువాత 10th క్లాసులో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. నేను 10th క్లాస్ కి రాగానే నేను మా ఇంగ్లీష్ టీచర్ని ఇలా అడిగాను ”మిస్ మాకు సెవెంత్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ కి 3 మార్క్స్ ఉండేవి కదా, 10thలో కూడా అల ఉంటాయా?అని. అప్పుడు మా టీచర్ చెప్పిన మాట నేను ఎప్పటికి మర్చిపోలేను.
       10thలో, 7th లో లాగా నీట్ గా వ్రాస్తే మర్కులెం ఉండవు కానీ, నువ్వు వ్రాసింది అర్థం అయితేనే మార్కులు వస్తాయి. నువ్వు ఏం వ్రాసావో అర్థం కాకపోతే, వాళ్లు ఎలా మార్కులు వేస్తారు?” అని చెప్పారు.  అవును నిజమే కదా, మనం వ్రాసింది అర్థం అయితేనే కదా వాళ్లు మనం వ్రాసింది కరెక్ట్ / కాదు అని మార్కులు వేయగలరు. అంటే మనకి వచ్చిన మార్కులన్నీ రైటింగ్ కే కదా!
          ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మనం వ్రాసిన ఆర్టికల్ వాళ్ళకి ఎంతవరకూ అర్థం అవుతుంది, ఎంతవరకూ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే విషయం దృష్టిలో పెట్టుకుంటే చాలు. మనం వ్రాసేటప్పుడు చిన్న చిన్న పాదాలను ఉపయోగించి, సింపుల్ గా వ్రాసిన చాలు. ఎందుకంటె ఒక పెద్దనది విస్తారమైన ప్రవాహంలాగా సముద్రంలో కలిసినా, అది తన ప్రయాణాన్ని ఒక చిన్న రంధ్రం లేదా ఒక బిలం నుండే ప్రారంబిస్తుంది. కాబట్టి ఎలా వ్రాయాలి అని టెన్షన్ పడవద్దు.

బ్లాగర్ కి ఉండవలసిన లక్షణాలు ఏమిటి?

సక్సెస్ ఫుల్ బ్లాగర్ కావాలి అనే బ్లాగర్ కి అన్నింటి కన్నా ముఖ్యంగా ఓపిక, నేను సక్సెస్ కావాలి అనే పట్టుదల ఉండాలి. జనరల్ గా అందరూ మంచి (సక్సెస్ ఫుల్) బ్లాగర్ కావాలి అంటే వాళ్ళకి రైటింగ్ స్కిల్ల్స్ వుండాలి, ఎస్ఈవో (SEO) స్కిల్ల్స్ ఉండాలి, కీవర్డ్స్ ఎలా యూస్  చేయాలి, ఏం యూస్ చేయాలి అని తెలిసి ఉండాలి అని అంటారు. కానీ వాటి అన్నింటికన్నా ముందు ఓపిక (పేషన్స్), సక్సెస్ కావాలి అనే పట్టుదల ఉండాలి. ఎందుకంటే బ్లాగ్గింగ్ లో సక్సెస్ అవ్వటం అనేది రాత్రికి రాత్రే జరిగే విషయం కాదు. ఈ విషయాన్నీ ఎంతోమంది టాప్ బ్లాగర్స్ కూడా చాలాసార్లు ఒప్పుకున్నారు.
       కొన్ని కొన్ని బ్లాగ్స్ ఆరు నెలల్లో సక్సెస్ కావచ్చు, కొన్ని సంవత్సరంలో కావచ్చు, కొన్నింటికి రెండేళ్ళు పట్టవచ్చు. మొదలుపెట్టిన వెంటనే సక్సెస్ కాలేదు అని మనం నిరుత్సహపడకూడదు. “వేదన లేకుండా వచ్చే ఏ విజయం అంత రుచికరంగా ఉండదు”. అంతే కాకుండా అదే సమయంలో మనం మరిన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. పట్టుదలతో వేదిలేయకుండా ప్రయత్నించాలి.
ఏ వ్యాపారం కూడా మొదలుపెట్టిన వెంటనే విజయవంతం కాదు” అనే విషయం గుర్తుపెట్టుకోవాలని కనీసం 6 నెలల నుండి ఓకే సంవత్సర కాలం పడుతుంది ఒక వ్యాపారం తన కాళ్ళ పై నిలబడటానికి. కాబట్టి నిరుత్సాహ పడకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. చాలా మంది బ్లాగర్స్ ఫెయిల్ అవ్వటానికి, వాళ్లు ఓర్పు వహించ లేకపోవటమే ప్రధాన కారణం అని అనిపిస్తుంది.

నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి

      ఈ డిజిటల్ యుగంలో ఎప్పుడు ఏది మారిపోతుందో, ఏ టెక్నాలజీ అధికంగా ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. SEO లో వచ్చే మార్పులు, ముఖ్యంగా గూగుల్ అల్గారిథమ్స్ కి సంబంధించిన విషయాలు, సోషల్ మీడియా లో ప్రమోషనల్ అప్డేట్స్ ఇలా అన్నింటిలో అప్డేట్ గా వుండాలి. “మారుతున్న సంకేతికతకి అనుగుణంగా మనం మారకపోతే, ప్రపంచం కూడా మరిన్ని మర్చిపోతుంది. జై హింద్.  

Tenglish

“Sabbu Billa – Kukka Pilla – Aggipulla Kadedi kavitha ki anarham” ani annaru Sri Sri Garu. Avunu talant unnavadu tanaku unna paristhiti ni oka avakasamga maluchukuntadu. Miru avasaham kosam yeduru chusevara? Avakasanni srustinchikunevara? Idantha nenu yenduku cheptunnanu ante blogging ki nenu kooda paina nenu cheppinavi vartistayi. Kabatti ee article lo blogging ye topics pai cheyali? Blogs yela vrayali? oka bloggers ki (success kavali anukune variki) undavalasina lakshnalu yemiti? ane amshalu chuddam!

       Manam intaku mundu blogging ante yento cheppukunnam. Bloggers yenduku fail avutunnaro cheppukunnam. Oka blog article vrayadam ante yedaina oka topic gurinchi matrame vrayadam kadu. Vrayadam oka kala. Ippudu ante rachayithala gurinchi peddaga yevariki aasakti ledu kani, oka 15-20 yella kritam rachayithala nundi vache navalalu, kathalu, seriels yeppudu vastayi ani yeduru chusevaru. Alanti vallalo nenu okati rendu perlu cheppe prayatna chestanu. Yandamuri Veerendranath garu, Yaddanapudi Sulochana Rani garu, ila anni bashalalo sahithayniki seva chesina vallu ”Yendaro Mahanubhavulu, Andariki Vandanalu” idanta nenu yenduku cheptunnanu ante “Writing is not writing, It’s an Art”.
Blogging Ye Ye Topics Pai Cheyali?
      Modate Sri Sri gari vakhyam cheppukunnatlu, kadedi blogging ki anarham. Miru ye topic tisukunna, dani gurinchi telusukovali anukune readers untaru. Munduga topic ni niche ani pilavali. Blogging gurinchi nerchukunetappudu terminology kooda telusukovali. Blogging ye niche pai ayina cheyavachu. Udaharanaki, vantalu vandatam, online technologies gurinchi vivarana cheyadam, fitness tips ivvadam, health tips, sexual tips ivvatam, computer hardware gurinchi vivarinchadam...ila ye niche pai ayina blog articles vrayavachu.
       Ayithe niku aa niche pai poorthi istha leda baga abhiruchi undalli. Poorthiga dani gurinchi teliyalsina avasaram ledu. Yendukante mana abhiruchi telusukovalane tapanane ragalchi marinta telusukunela chestundi. Ala kakunda oka niche pai poorti avagahana undi, dani gurinchi miku A-Z telisi, dani pai interest ledu anukondi, miku telisina vignanam readers ki sarigga cheradu. Anduke manam blogging chese niche pai manaki baga istham / abhiruchi undali.
       Konni Niche Ideas:
·      Cooking
·      Online Tutorials
·      Insurance
·      Dating Tips
·      Fitness tips for men
·      Fitness tips for women
·      Health Tips
·      Parenting Blog
·       Technology Reviews
·       Gadget Reviews
·       Online Money Earning
·       Photography Tips
·       Videography Tips
Ila yenno nishes unnayi. Miku baga interest unna topic pai blogging cheyadam modalupedite success avagalaru.
Blog Articles Yela Vrayali?
       Chala mandi blogging gurinchi telusukunnaka, modata vache prashna blog lo articles lo yela Vrayali? Naku yela vrayalo teliyadu, mari yela? Ila rakarakala doubts mind lo tirugutoo untayi. Oka article yela vrayalo ani yekkada yelanti nibhandanalu levu. Oka article yela vrayali ani nannu adigithe, “Chadive vallaki artham ayyela” ani chepatanu. Anthe kada!  
          Nenu 7th class chedivetappudu maku public exams undevi. Andulo maku English exam lo 3 markulu neet hand writing ki undevi. Taruvata 10th class lo public exams undevi. Nenu 10th class ki ragane nenu maa English teacher ni ila adiganu “Miss maku seventh lo neet hand writing ki 3 marks undevi kada, 10th lo kooda ala untaya? ani.” Appudu maa teacher cheppina mata nenu yeppatiki marchipolenu.
       “10th lo 7th lo laga neet ga vraste markulem undavu kani, nuvvu vrasindi artham ayithene markulu vastayi. Nuvvu yem vrasavo artham kakapothe, vallu yela markulu vestaru? ani chepparu. Avunu nijame kada, manam vrasindi artham ayithene kada vallu manam vrasindi correct / kacu ani marks veyagalaru. Ante manaki vachina mars anni writing ke kada!
          Ikkada nenu ee vishayam yenduku cheptunnanu ante manam vrasina article vallaki yentha varakoo artham avutundi, yentha varakoo vallaki upayogapadutundi ane vishayam drushtilo pettukunte chalu. Manam vrasetappudu chinna chinna padalanu upayoginchi, simple ga vrasina chalu. Yendukante oka pedda nadi vistaramaina pravaham laga samudram lo kalisina, adi tana prayananni oka chinna randhram leda oka bilam nundi prarambistundi. Kabatti yela vrayali ani tension padavaddu.
Blogger ki undavalasina lakshnalu yemiti?
Successfull kavali ane blogger ki anniti kanna mukhyamga oopika, nenu success kavali ane pattudala undali. General ga andaroo manchi (successfull) blogger kavali ante vallaki writing skills undali, SEO skills undali, keywords yela use cheyali, ye keywords use cheyal ani telisu undali ani antaru. Kani vari annintikanna mundu oopika (Patience), success kavali ane pattudala undali. Endukante blogging lo success avvatam anedi ratriki ratri jarige vishayam kadu. Ee vishayanni yento mandi top bloggers kooda chala sarlu oppukunnaru.
       Kooni konni blogs six months lo success kavachu, konni one year lo success kavachu, konni two years pattavachu. Modalupettina ventane success kaledu ani manam dissoppoint kakudadu. “Vedana lekunda vache ye Vijayam antha ruchikaramga undadu”. Anthe kakunda ade samayamlo manam marinni skills develop chesukovadaniki prayatninchali. Pattudalatho vedileyakunda prayatninchali.
Ye vyaparam kooda modalupettina ventane vijayavantam kadu” ane vishayam gurtu pettukovalani kanisam 6 months nundi one year time padutundi. oka business tana kalla pai nilabadataniki. Kabatti nirutsaha padakunda try chestoo undali. Chala mandi bloggers fail avvataniki, vallu oorpu vahincha lekapovatame pradhana karanam ani anipistundi.
Nirantaram Update avuto undali:  
      Ee digital yogamlo yeppudu yedi maripotundo, ye technology adhikamga prabhavam chuputundo teliyadu. Kabatti yeppatikappudu update avutoo undali. SEO lo vache marpulu, mukhyamga Google algarithams ki sambandhinchina vishayalu, social media lo promotional updates ila annintilo update ga undali. “Marutunna technology ki anugunamga manam marakapothe, prapancham kooda marinni marchipotundi. Jai Hind
 
Share:

No comments:

Post a Comment

Popular Posts