Why most of new bloggers failed? Explained in Telugu | Blogger VJ

Why most of blogs were  failed?
Why most of blogs were  failed?
 మీకు తెలుసా 98% బ్లాగ్స్ ఫెయిల్ అవుతున్నాయి అని? మనం ఇంతకూ ముందు ఆర్టికల్ లో ఒక బ్లాగ్ సక్సెస్ అయితే ఎలా ఉంటుంది, ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అని విహంగ వీక్షణంగా తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్ లో ఒక బ్లాగ్ లేదా బ్లాగర్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఒక బ్లాగ్ నుండి ఎందుకు రెవిన్యూ జేనరేట్ చేయలేకపోతున్నారు? అనే విషయాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం! 

Miku Telugu Chadavatam Rada? Don't Worry. Click Here

 ఒక బ్లాగ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది?

అవును 98% బ్లాగులు ఫెయిల్ అవుతున్నాయి. తమ సక్సెస్ ని చూడకుండానే అవి కుప్పకూలిపోతున్నాయి. అలా జరగటానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇవి ఖచ్చితంగా కారణాలు అని నేను చెప్పను, కానీ చాలా బ్లాగులు వీటిని ఎదుర్కొంటున్నాయి. అవి ఏంటో చూద్దాం.
  • ఒక బ్లాగ్ ను కేవలం డబ్బు సంపాదించడానికే స్టార్ట్ చేయటం.
  • మొదలుపెట్టిన రోజు నుండి వేల మంది విసిటర్స్ వస్తారు అని తప్పుగా అంచనా వేయటం.
  • లాంగ్ రన్ లో గోల్స్ లేకపోవటం.
  • వాళ్లు చేసే పని పై వాళ్ళకి నియంత్రణ లేకపోవడం.
  • చేస్తే అతిగా చేయటం లేదా అసలు చేయకుండా ఉండటం.
·       ఇంకా ఎన్నో ....

ఒక బ్లాగ్ ను డబ్బు కోసమే స్టార్ట్ చేయటం:

       చాలా మంది చేసే తప్పు ఇదే. ఏ పనిలో అయినా విజయం సాధించాలి అంటే మనం ఆ విజయం దక్కటానికి కావాల్సిన అర్హతని మనం సంపాదించుకోవాలి. ఎంత విజయం కావాలంటే అంత కష్టపడాలి. అవును, నువ్వు ఎంత గ్రాండ్ సక్సెస్ కావాలి అనుకుంటున్నావో, అంత హార్డ్ వర్క్ చేయాలి. బ్లాగ్ విషయానికి వస్తే ఒక బ్లాగ్ రాత్రికి రాత్రే సక్సెస్ కాదు. కొంత సమయం పడుతుంది. అయితే డబ్బు కోసమే బ్లాగ్ స్టార్ట్ చేస్తే వెంటనే మనీ ఎర్న్ చేయవచ్చు అని అనుకుంటారు. అనుకున్నంతగా రిజల్ట్ లేకపోవడంతో నిరుత్సాహపడతారు.
       సాదారణంగా మనిషికి ఏదైనా ఒక పని చేస్తే డబ్బు వస్తూ ఉంటె (ఇన్కమ్ జెనరేట్ అవుతూ ఉంటె) అతనికి ఆ పని చేయటంలో ఉత్సాహం రెట్టింపుగా ఉంటుంది. అలా కానీ పక్షంలో నిరాశ, నిస్పృహ ఆవరించి ఆ పని చేయనియకుండా చేస్తాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది.

తప్పుగా అంచనా వేయటం:

చాలా మంది బ్లాగర్స్ తమకి నెలకి అన్ని వేల మంది విసిటర్స్ వస్తున్నారు, మేము నెలనెలా అన్ని వేల డాలర్లు సంపాదిస్తున్నాం అని చెప్తారు. అవును దీనిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్లు అంత డబ్బు సంపాదిస్తున్నారు, నేను కూడా అలాగే సంపాదిస్తాను అని బ్లాగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, నేను వాళ్లు మనీ ఎర్నింగ్స్ తప్పు అని చెప్పను. కానీ వాళ్లు ఎంతకాలం కష్టపడితే ఆ స్థాయికి వచ్చారో మనం అర్థం చేసుకోవాలి అని అంటాను. చాలా మంది bloggers ఇక్కడే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

అతిగా పని చేయడం లేదా అసలు చేయకపోవడం:

       చాలా డబ్బు సంపాదించాలి అనే ఆత్రంలో చాలా మంది అతిగా పని చేస్తారు. అంటే ఇక వేరే పని ఏమి లేకుండా ఉదయం నుండి రాత్రి వరకూ తెగ పని చేస్తారు. అలా చేసాక వారు రిజల్ట్స్ చూసాక, ఎంత ఉత్సాహంగా పని చేసారో అంత నిరుత్సాహం ఆవరిస్తుంది. “అతి సర్వత్ర వర్జయేత్” అని చెప్పినట్లు ప్రతీ పనికి ఒక లిమిట్ ఉంటుంది. దానిని మనం తెలుసుకుని పని చేయాలి. లేదంటే శారీరకంగా, మానసికంగా బలహీన పడతాం.
       మనం చేసే పనికి మనం కొన్ని పరిమితులు విధించుకోవాలి. అంటే మొదట బ్లాగ్గింగ్ ని పార్ట్ టైం గా మొదలుపెట్టాలి. దాని నుండి ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యాక బ్లాగ్గింగ్ పూర్తి స్థాయిలో చేయవచ్చు అని నీకు నమ్మకం కలిగాక ఫుల్ టైం బ్లాగర్ గా మారవచ్చు. ఇలా చేయటం వలన నీకు నీ రోజువారీ పనులకి ఇబ్బంది ఉండదు. నువ్వు పెద్దగా(అతిగా) ఊహించుకోవు కాబట్టి, నిదానంగా బ్లాగ్ డెవలప్ అయిన ఎలాంటి భావోద్వేగాలకి గురి కాకుండా ఉంటావు.
       అనుకున్న విధంగా జరగటం లేదు అని నిదానంగా మీరు పని చేసే టైం లో ఇతర విషయాల మిద దృష్టి కేంద్రీకృతం అవుతుంది. నిదానంగా నీకు బ్లాగ్గింగ్ చేయటానికి ఎలాంటి ఇంటరెస్ట్ ఉండదు. కాలక్రమేణ నీ బ్లాగ్ కూడా కనుమరుగవుతుంది. మొదట్లో రోజుకి 3 పోస్టులు వ్రాసే నువ్వు వారానికి ఒక పోస్టు కూడా వ్రాయలేక పోతావు. కాబట్టి ఒక ప్రణాళిక బద్ధంగా పని చేయడం కోసం ప్రయత్నించండి.

లాంగ్ రన్ లో గోల్స్ లేకపోవటం:

       ఏ బిజినెస్ అయిన సక్సెస్ అవ్వాలంటే గోల్స్ / టార్గెట్స్ ఉండాలి. వాటిని మన సామర్ధ్యాలు, మార్కెట్ కంపిటిషన్ బట్టి సెట్ చేసుకోవాలి. గోల్స్ సెట్ చేసుకోవటం ద్వారా ఒక లక్ష్యం దిశగా మనం అడుగులు వేయటానికి సాధ్యపడుతుంది. గోల్స్ రకరకాలుగా ఉంటాయి. రోజువారీ గోల్స్, ఆరునెలల గోల్స్, సంవత్సరం గోల్స్ ఇలా వాళ్ళని బట్టి గోల్స్ మారుతూ ఉంటాయి. ఈ గోల్స్ ని సెట్ చేసుకోవటం ద్వారా ఒక క్రమశిక్షణ కి మనం అలవాటు పడతాం.
       ఇలా ఇంకా ఎన్నో రకాల కారణాల వల్ల 98% బ్లాగ్స్ ఫెయిల్ అవుతున్నాయి. బ్లాగ్గింగ్ లో సక్సెస్ అయినవాళ్ళని మెంటార్స్ గా స్వీకరించడం, వాళ్ళని సలహాలు అడగడం ద్వారా మనం కూడా సక్సెస్ బాట పట్టటానికి సిద్దం కండి. యుద్ధం గెలవండి. జై హింద్. 

TENGLISH 

Miku telusa 98% blogs fail avutunnayi ani? Manam intaku mundu article lo oka blog success ayithe yela untundi, yenni upayogalu untayi ani vihanga vikshanamga telusukunnam. Ee article lo oka blog leda blogger fail yenduku avutunnaru? Oka blog nundi revenue yenduku generate cheyalekapothunnaru.

Oka Blog Yenduku Fail Avutundi?

Avunu 98% blogs fail avutunnayi. Tama success ni chudakundane avi kuppakoopipothunnayi. Ala jaragataniki chala karanalu unnayi. Ayithe ivi khachitamga karanalu ani nenu cheppanu, kani chala blogs vitini yedurontunnayi. Avi yento chuddam.
·       Oka blog nu kevalam dabbu sampadinchadanike start cheyatam.
·       Modalupettina roju nundi vela mandi visitors vastaru ani tappuga anchana veyatam.
·       Long run lo goals lekapovatam.
·       Vallu chese pani pai vallaki niyantrana lekapovatam.  
·       Cheste atiga cheyatam leda asalu cheyakunda undatam.
·       Inka enno ....

Oka blog nu dabbu kosam start cheyatam:

       Chala mandi chese tappu ide. Ye panilo ayina vijayam sadhinchali ante manam aa vijayam dakkataniki kavalsina arhatani manam sampadinchukovali. Yenta vijayam kavalante antha kashtapadali. Avunu, nuvvu yentha grand success kavali anukuntunavo, antha hard work cheyali. Blog vishayaniki vaste oka blog ratriki ratre success ckadu. Kontha samayam padutundi. Ayithe dabbu kosam blog start cheste ventane money earn cheyavachu ani anukuntaru. Anukunnantaga result lekapovadamto nirutsahapadataru.  
       Sadaranamga manishiki yedaina oka pani cheste dabbi vastoo unte (Income generate avutoo unte) ataniki aa pani cheyatam lo utsaham rettimpuga untundi. Ala kani pakshamlo nirasa, nispruha aavarinchi aa pani cheyaniyakunda chestayi. Ikkada kooda ade jarugutundi.  

Tappuga Anchana Veyatam:

Chala mandi bloggers tamaki nelaki anni vela mandi visitors vastunnaru, memu nelanela anni vela dollars sampadistunnam ani cheptaru. Avunu antha dabbu sampadistunnaru, nenu kooda alage sampadistunnanu ani blog start chestoo untaru, nenu vallu money earnings tappu ani nenu cheppanu. Kani vallu yenta kalam kashtapadithe aa sthayiki vacharo manam artham chesukoni, chala mandi bloggers ikakde tappuga artham chesukuntunnaru.  

Atiga Pani Cheyadam leda Asalu Cheyakapovadam :

       Chala dabbu sampadinchali ane atram lo chala mandi atiga pani chestaru. Ante ika vere pani yemi lekunda undayam nundi ratri tega pani chestaru. Ala chesaka varu results chusaka, yenta utsahamga cehstaro, anta nirutsaham aavaristundi. “Ati Sarvatra Varjayet” ani cheppinatlu prati paniki oka limit untindi. Danini manam telusukuni pani cheyali. Ledante physical ga , mental ga balaheena padatam.
       Manam chese paniki manam konni parimithulu vidhinchukovali. Ante modata blogging ni part time ga modalu pettali. Dani nunid earning start ayyaka blogging poorthi sthayilo cheyavachu. ani iku nammakam kaligaka full time blogger ga maravachu. Ila chayatam valana niku nee rojuvari panulaki ibbandi undadu. Nuvvu Nuvvu peddaga (athiga) oohinchukovu kabatti, nidanamga blog develop ayina yelanto bhavodvegalaki guri kakunda untavu.
       Anukunna vidhamga jaragatam ledu ani nidanamga miru pani chese time lo itara vishayala mida drushti kendrikrutham avutundi. Nidanamga niku blogging cheyataniki yelanti yelanti interest undadu. Kalakramena nii blog kooda kanumarugu avutundi. Modatlo rojuki 3 postulu vrase nuvvu varaniki oka post kooda vrayaleka pothavu. Kabatti oka pranalika baddamga pani cheyadam kosam prayatninchandi.

Long Run lo Goals Lekapovatam:

       Ye business ayin success avvalante goals / targets undali. Vatini mana samardhayalu, market competition batti set chesukovali. Goals set chesukovatam dwara oak lakshyam dishaga manam adigilu veyataniki sadhyapadutundi. Goals rakarakaluga untayi. Daily goals, Six Months goals, One Year goals ila vallani batti goals marutoo untayi. Ee goals ila vallani batti goals marutoo untayi. Ee goals ni set chesukovatam dwara oka kramasikshana ki manam alavatu padatham.  

       Ila inka yenni rakala karanala valla 98% blogs fail avutunnayi. Blogging success ayinavallani mentors ga  sweekarinchadam, vallani salahalu adagadam dwara manam kooda success bata pattataniki siddham kandi. Yuddham gelavandi. Jai Hind
Share:

No comments:

Post a Comment

Popular Posts