What is SEM ? What is SMM? in Telugu by Blogger VJ

What is SEM ? What is SMM? in Telugu by Blogger VJ
What is SEM ? What is SMM? in Telugu by Blogger VJ

మనం ఇంతకూ ముందు పోస్టులలో SEO గురించి SOCIAL MEDIA OPTIMIZATION ల గురించి తెలుసుకున్నాం. అయితే మనం మొదటి నుండి డిజిటల్ మార్కెటింగ్... డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తున్నాం కదా మరి మనం ఇంతవరకూ మార్కెటింగ్ చేయలేదు కదా అని మీకు సందేహం రావచ్చు. అవును ఇంతవరకూ మనం మార్కెటింగ్ చేయలేదు. ఈ పోస్టులో SEARCH ENGINE MARKETING గురించి, SOCIAL MEDIA MARKETING లా గురించి  తెలుసుకుందాం.

SEARCH ENGINE MARKETING అంటే ఏమిటి?

పేరులోనే ఉంది SEARCH ENGINE ద్వారా మన ప్రోడక్ట్ ని  మనం మార్కెటింగ్ చేస్తాం. అయితే ఇందు కోసం మనం డబ్బు ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి మనం గూగుల్ లో ఒక మొబైల్ కోసం సెర్చ్ చేసాం అనుకుందాం. అప్పుడు మనకి మొబైల్స్ యొక్క వెబ్ సైట్స్ తోపాటుగా మనకి అమెజాన్, ఫ్లిప్కర్ట్ వంటి eCommerce వెబ్ సైట్ ల లింక్స్ కూడా కనిపిస్తాయి. వీటిని SEARCH ENGINE MARKETING చేయటం ద్వారా మొదట ఈ లింక్స్ వస్తాయి. అంటే మన ad అనేది ఫస్ట్ పేజిలో ఎలాంటి SEO చేయవలసిన అవసరం లేకుండా మన వెబ్ సైట్ SEARCH ENGINE ఫస్ట్ పేజి లో మన ad వస్తుంది.
అయితే మనకి చాలా SEARCH ENGINES అందుబాటులో ఉన్నాయి. వాటిలో Google, Bing, Yahoo, Ask.com, AOL.com, Baidu లు టాప్ SEARCH ENGINES. వీటిలో మనం advertisement చేయటం ద్వారా SEARCH ENGINE MARKETING చేయవచ్చు. అయితే SEARCH ENGINE MARKETING ద్వారా మన వెబ్ సైట్ SEARCH ENGINES లో టాప్ లో రావటం ద్వారా HIGH CTR(CLICK THROUGH RATE) సాధ్యపడుతుంది.
SEARCH ENGINE MARKETING లో Google, Bing & Yahoo లు టాప్ SEARCH ENGINES. Google Ad-words ద్వారా మనం గూగుల్ లో మనం ad ఇవ్వవచ్చు. BING లేదా YAHOO ADS ద్వారా మనం BING / YAHOO లలో SEARCH ENGINE MARKETING చేసి, మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని మార్కెటింగ్ చేయవచ్చు.

SOCIAL MEDIA MARKETING అంటే ఏమిటి?

సోషల్ మీడియా platform ల ద్వారా మనం మార్కెటింగ్ చేయటాన్ని SOCIAL MEDIA MARKETING అని అంటారు. ఇందులో మనకి Facebook, Twitter, YouTube, Instagram వంటి ఫేమస్ సోషల్ మీడియా platforms లో మనం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేసుకుంటాం. ఇలా చేయటం ద్వారా డైరెక్ట్ గా కస్టమర్ కి మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించగలం.  
అలాగే వారితో ఇంటరాక్ట్ అవ్వటానికి, ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి ఉపయోగిస్తాము. ఈ SOCIAL MEDIA MARKETING లో Facebook ద్వారా మనకి ఎక్కువగా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి వాళ్ళని మోటివేట్ చేయటానికి అవకాశం ఉంటుంది. అలతే twitter మన దగ్గర తక్కువ, కానీ ప్రొఫెషనల్ పీపుల్ ట్విట్టర్ యూస్ చేస్తేరు.  అలాగే YouTube లో మార్కెటింగ్ చేయటం కోసం పైన చెప్పినట్టు గూగుల్ ad-words ద్వారా ప్రమోట్ చేయవచ్చు.  ఈ పోస్టులో కేవలం SEARCH ENGINE MARKETING, SOCIAL MEDIA MARKETING లా గురించి ఇంట్రడక్షన్ గా మాత్రమే చెప్తున్నాం. ముందు ముందు డీటెయిల్ పోస్టులను అందించగలం. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

What is SMO (Social Media Optimization)? Explained in Telugu by Blogger VJ

What is SMO (Social Media Optimaization)? Explained in Telugu by Blogger VJ
What is SMO (Social Media Optimization)? Explained in Telugu by Blogger VJ

ఈ రోజుల్లో మనకి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ద్వారా అనేక ఇబ్బందులు ఉన్న అంతకు మించి మనకి కొన్ని అదనపు ప్రయోజనాలు కలుగుతున్నాయి. మనం మన brand వేల్యూ పెంచుకోవటంలో సోషల్ మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. అవును ఈ పోస్టులో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకుందాం. 
అవును మనకి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అంట కూడా ఫ్రీ గా లభిస్తుంది. ఒక మెయిల్ ఐడి తో అన్ని రకాల సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేస్తాం.
జిమెయిల్ దగ్గర నుండి అన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ అన్ని మనకి ఫ్రీ గా అందిస్తున్నాయి. అసలు Social Media Optimization (SMO) లో ఏమేమి ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి? ఒకసారి చూద్దాం!

ఇవన్ని కూడా మనకి అందుబాటులో ఉన్న ఫేమస్ ప్లాట్ ఫారంస్. వీటిని అన్నింటిని మేనేజ్ చేయటానికి ఒక మెయిల్ ఐడి కావాలి. అందుకోసం మనం జిమెయిల్ ని ఫ్రీ గా ఉపయోగించవచ్చు. మన సోషల్ మీడియా అకౌంట్స్ లో
ముందుగ మనం మనకి కావాల్సిన సోషల్ మీడియా platform ని సెలెక్ట్ చేసుకోవాలి. 
తరువాత మన అకౌంట్ ప్రొఫైల్ ని ఫిల్ చేసి, అందులోనే మన బిజినెస్ రిలేటెడ్ వెబ్ సైట్ లింక్స్, బిజినెస్ రిలేటెడ్ keywords అన్నింటిని ఫిల్ చేయాలి. తదుపరి మీరు మీ కస్టమర్స్ కి ఉన్న సమస్యలని మీకు తెలిసిన సమాచారాన్ని పంచుకోండి. తదుపరి మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి తెలియచేయండి. నిరంతరం మీ కస్టమర్స్ కి అందుబాటులో ఉండటానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది.
సోషల్ మీడియా స్ట్రాటజీ లో Facebook టాప్ పోసిషన్ లో ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఒక పేజి create చేసుకుని మన ఫాలోయర్స్ కి మనం అందుబాటులో ఉండవచ్చు. మీరు మీ బిజినెస్ కోసం కంటెంట్ మార్కెటింగ్ చెయ్యట్లేదు అనుకోండి, కానీ Facebook ద్వారా మనం కేవలం ఇమేజస్ తో కూడా ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ ని మనం బిల్డ్ చేయవచ్చు.
ఇప్పుడు ఉన్న అన్ని సోషల్ మీడియా platforms అన్ని కూడా మొబైల్ users ని టార్గెట్ చేస్తుంటాయి. ఎందుకంటె మన దేశంలో అత్యధికమంది స్మార్ట్ ఫోన్ users ఉన్నారు. అలాగే దాదాపుగా ప్రతీ వెబ్ సైట్ కూడా మొబైల్ ఫ్రెండ్లీ గా ఉండేటట్టు బిజినెస్ ఓనర్స్ చూసుకుంటూ ఉన్నారు. 
మనం సోషల్ మీడియా లో ప్రమోట్ చేసే ప్రతీ ఇమేజ్ ని కూడా మొబైల్ యూసర్ కి కూడా బాగా కనిపించేలా ప్లాన్ చేయాలి. మనం create చేసే పోస్టులు మన బిజినెస్ రిలేటెడ్ గా ఉండాలి, ఎందుకంటే మనం create చేసే పోస్టుల ద్వారా మనం మన ఫ్యాన్ బేస్ ని పెంచుకోవచ్చు. యూసర్ ఇంటరాక్షన్ అనెది పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

What is SEO (Search Engine Optimization)? Explained in Telugu | Blogger VJ

What is SEO (Search Engine Optimaization)? Explained in Telugu | Blogger VJ
What is SEO (Search Engine Optimization)? Explained in Telugu | Blogger VJ

మనకి దేని గురించి అయిన తెలియకపోతే మనం వెంటనే ఏం చేస్తాం? మన మొబైల్ లోనో లేదా కంప్యూటర్ లోనో గూగుల్ లో search చేస్తాం, అవునా! అలాగే మన కస్టమర్స్, లేదా మన క్లైంట్స్ వెబ్ సైట్ కూడా అలాగే రావాలి అని ఎవరైనా అనుకుంటారు, కదా! మరి అది ఎలా సాధ్యం. 
ఉదాహరణకి మీరు ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తున్నారు అనుకుందాం. ఎవరైనా గూగుల్ లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ గుంటూరు అని టైపు చేసి search చేస్తే మీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వెబ్ సైట్ ఫస్ట్ రావాలి అంటే ఎం చేయాలి? అంటే అలా రావాలి అంటే మనం search engine optimization అని అంటారు. దీనినే SEO అని కూడా అంటారు. 
మరి SEO ఎలా చేయాలి? SEO చేయటానికి ఎంత ఖర్చు అవుతుంది? SEO చేస్తే ర్యాంకింగ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది? ఇలాంటి ఎన్నో విషయల గురించి ఈ పోస్ట్లో చూద్దాం ! SEO అనేది కొంత టెక్నికల్ పార్ట్ కి సంబంధించిన విషయం. కానీ అదేదో అర్థం కానీ విషయం మాత్రం కాదు. SEO మనం చేసుకోవచ్చు. 
ఒక వేళ మనకి చేయటానికి టైం లేకపోయినా, చేయటం కుదరకపోయినా ఒక SEO ఎక్స్పర్ట్ ని హైర్ చేసుకోవచ్చు లేదా SEO ఏజెన్సీ వల్ల ద్వారా చేయవచ్చు.
SEO అనేది మనం వెబ్ సైట్ డొమైన్ (వెబ్ సైట్ పేరు) తోనే మొదలవుతుంది. SEO లో WordPress వెబ్ సైట్ అయితే ఇంకా ఎన్నో అదనపు సౌకర్యాలుంటాయి. అంటే HTML కోడింగ్ లో చేయవలసిన SEO టెక్నిక్స్ చాలా వరకు చేసి ఉంటాయి. తరువాత keywords గురించి కొంత రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. రెగ్యులర్ గా వెబ్ సైట్ నందు కంటెంట్ అప్డేట్ చేయాలి. మన వెబ్ సైట్ ని search engines కి సబ్మిట్ చేయాలి. 
ఒకసారి search engines కి వెబ్ సైట్ ని సబ్మిట్ చేసాక, ఆయా search engines యొక్క crawlers మన వెబ్ సైట్ ని రీడ్ చేసి వాటి డేటాబేస్ లో ఇండెక్స్ చేసుకుంటాయి. గూగుల్ అయితే ఒక పేజిని ఇండెక్స్ ర్యాంకింగ్ చేయటానికి సుమారుగా 200 విషయాలని పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఇవి ఎపటికి అప్పుడు మారిపోతూ ఉంటాయి.
ఇది ఒక నిరంతర ప్రక్రియ. మనం రెగ్యులర్ గా మన వెబ్ సైట్ ని అప్డేట్ చేయడం అంటే ఎలా చేస్తాము? అందుకోసమే పెద్ద పెద్ద బిజినెస్ వెబ్ సైట్స్ బ్లాగ్స్ ని రేగులర్ గా maintain చేస్తూ ఉంటాయి.  SEO లో మనకి బిజినెస్ కి కావాల్సిన keywords ని సెలెక్ట్ చేసుకొని వాటిని మన వెబ్ సైట్ కోసం optimize చేయాలి. ఇంకా meta tags, meta descriptionవంటివి on-page optimization చేస్తాము.  ఇలా రకరకాల పద్దతుల ద్వారా మనం మన వెబ్ సైట్ ని SEO ఫ్రెండ్లీగా రెడీ చేయాలి.

SEO చేయటం ద్వారా మనకి కలిగే ఉపయోగం ఏంటి? 

మన వెబ్ సైట్ ద్వారా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని సేల్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఈ డిజిటల్ యుగంలో ప్రతీ దానికి గూగుల్ పై ఆధారపడిన రోజులలో వెబ్ సైట్ ఎంత అవసరమో, SEO కూడా అంతే అవసరం. ఇందువల్ల మన బిజినెస్ డెవలప్ అవ్వాలి. వెబ్ సైట్ వల్ల మనకి ఒక రెండు లీడ్స్ వచ్చిన చాలు. మన వెబ్ సైట్ create చేసి, SEO చేసిన ప్రయోజనం జరిగినట్టే. అంతే కదా! 
కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ లో SEO కూడా ఒక భాగమే. మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ప్రతీ మాడ్యుల్ ని మనం విడివిడిగా చూడకూడదు. ఎందుకంటే కొన్ని మన బిజినెస్ brand విలువని create చేస్తాయి. కొన్ని లీడ్స్ తీసుకురావటంలో ఉపయోగపడతాయి. కొన్ని డైరెక్ట్ గా సేల్స్ చేయటంలో ఉపయోగపడతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

What is Email Marketing? Explained in Telugu | Blogger VJ


What is Email Marketing? Explained in Telugu | Blogger VJ
What is Email Marketing? Explained in Telugu | Blogger VJ
ప్రతీ రోజు మెయిల్ ఓపెన్ చేయగానే, మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ అయ్యింది.10 నిమిషాలలో మీ లోన్ ఆన్లైన్ లో అప్రూవల్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డు  రెడీ అయ్యింది అని మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్ని కూడా ఈమెయిలు మార్కెటింగ్ లో భాగంగా మనకి వస్తూ ఉంటాయి. అసలు ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ వలన ఉపయోగం ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాలు చూద్దాం! హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ లో భాగంగా ఈ పోస్టులో email marketing గురించి తెలుసుకుందాం.

ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏమిటి?  

సింపుల్ గా చెప్పాలంటే, ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి మన కస్టమర్స్ కి మనం ఈమెయిలు ద్వారా తెలియచేయటానికి ఈమెయిలు మార్కెటింగ్ అంటారు. మనం ఒక బ్రాండ్ ని create చేయాలి అన్నా, ప్రమోట్ చేయాలి అన్నా ఈమెయిలు మార్కెటింగ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనం నేరుగా మన కస్టమర్ లేదా subscribers కి నేరుగా ఈమెయిలు ద్వారా సమాచారాన్ని చేరవేయవచ్చు. ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనం మన కస్టమర్స్ కి అందుబాటులో ఉండవచ్చు.

ఈమెయిలు మార్కటింగ్ వలన ఉపయోగం ఏంటి?

ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనకి మన కస్టమర్ కి మధ్య ఉన్న రేలషన్ మరింత బలంగా అవుతుంది. కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. మన కస్టమర్ కి మన బ్రాండ్ లేదా కంపెనీ పై నమ్మకాన్ని పెంచటంలో తోడ్పడుతుంది. అయితే ఈ మధ్య ఈమెయిలు మార్కెటింగ్ అంటే కేవలం కమర్షియల్ మెసేజెస్ ద్వారా advertisement, బిజినెస్ సేల్స్ కి సంబంధించిన మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయి.  బ్లాగ్స్ కి సంబంధించిన ఈమెయిలస్ చూసినట్లయితే అందులో వాళ్లు రీసెంట్గా పోస్ట్ చేసిన పోస్టు యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మెయిల్స్ మనం పొందుతుంటాం. ఉదాహరణకి మీరు మా పోస్టులు కూడా అలాగే పొంది ఉండవచ్చు!

ఈమెయిలు మార్కెటింగ్ ఎలా చేయాలి?

మనం జిమెయిల్ ద్వారా కేవలం ప్రతీ రోజు కేవలం 500 మెయిల్స్  మాత్రమే పంపగలం. మరి మీ దగ్గర 2000 మంది కస్టమర్స్ లేదా వెబ్ సైట్ విసిటర్స్ ఉంటె మరి ఎలా? అంత మందికి ఎవరికీ వాళ్ళకి ఈమెయిలు పంపినట్టు ఉండే కొన్ని ఈమెయిలు మార్కెటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని టూల్స్ ఎంటో చూద్దాం.
  1. MailChimp(free)
  2. Mailrelay(free)
  3. Aweber(paid)
  4. Drip  (paid)
  5. ConvertKit (paid)
ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కానీ ఇవి పాపులర్ టూల్స్. వీటి గురించి ముందు ముందు వివిరంగా పోస్ట్లు చేయటానికి ప్రయత్నిస్తాం.

ఈమెయిలు మార్కెటింగ్ ఎన్ని రకాలు?

ఈమెయిలు మార్కెటింగ్ లో మనకి ప్రధానంగా 6 రకాల ఈమెయిలస్ ఉన్నాయి. అవి:
  1. Email Newsletters
  2. Digests
  3. Dedicated Emails
  4. Lead Nurturing
  5. Sponsorship Emails
  6. Transactional Emails

ఈ ఈమెయిలస్ ఎలా ఉపయోగపడతాయో, వీటిని ఎలా ఉపయోగించాలో చూడటానికి ఇక్కడ ఉన్న లింక్ పై click చేయండి.

Types of Emails used in Email Marketing

ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

What is Content Marketing? Explained in Telugu | Blogger VJ

What is Content Marketing? Explained in Telugu | Blogger VJ
What is Content Marketing? Explained in Telugu | Blogger VJ
డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ రైటింగ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మన వెబ్ సైట్ కి వచ్చే విసిటర్ మనకి కస్టమర్ గా convert అవ్వాలి అంటే మనం మన వెబ్ సైట్ కి రెగ్యులర్ గా విసిటర్స్ వచ్చేలా చేయాలి. నిజానికి అలా చేయటం కష్టం. ఎందుకంటే ఒక విసిటర్ రెగ్యులర్ గా ఒక వెబ్ సైట్ ని విసిట్ చేస్తున్నాడు అంటే అతను మన వెబ్ సైట్ కంటెంట్ నచ్చి వస్తున్నాడు. మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి మనకి పూర్తి అవగాహనా ఉంది అని అనుకుంటున్నాడు. మరి అలాంటి కంటెంట్ ని మనం ఎలా వ్రాయాలి? అందుకోసం కొన్ని టిప్స్ ని ఇందులో మేము మీకు అందిస్తాము.

అసలు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి?

కంటెంట్ మార్కెటింగ్ అంటే మనం చెప్పాలనుకున్న విషయం ఎలా విసిటర్స్ లేదా మన కస్టమర్స్ కి అందేలా చేయటం. వారికీ మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ పట్ల ఆసక్తి కలిగేలా చేయటంమే కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. మనం అందరం ప్రతీ రోజు కంటెంట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. ఆశ్చర్యపోతున్నారా? అవును మనం ప్రతీ రోజు కంటెంట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. 
ఎలా అంటే మనం Facebook లో పోస్ట్లు పెడుతూ ఉంటాం, కొన్ని పోస్ట్లని లైక్ చేస్తాం, కొన్నింటికి కామెంట్ చేస్తాం. కొన్నింటిని షేర్ చేస్తాం. అలాగే YouTube లో కూడా ఇదే విధంగా మనం లైక్, కామెంట్, షేర్ చేసి ఆ కంటెంట్ ని మార్కెటింగ్ చేస్తాం. చాలామంది బ్లాగ్స్ రాస్తూ ఉంటారు. ఎవరైనా కొత్తగా బ్లాగ్స్ రాస్తున్నారా? అయితే ఈ పోస్ట్ మీకు కూడా ఉపయోగపడుతుంది.
కంటెంట్ అనేది మేజర్ గా నాలుగు రకాలుగా ఉంటుంది. అవి: 1) టెక్స్ట్, 2) ఇమేజ్స్ 3) ఆడియో 4) వీడియో.
  1. టెక్స్ట్: మీరు చదువుతున్న ఆర్టికల్ టెక్స్ట్ కంటెంట్ కిందకి వస్తుంది. బ్లాగ్ పోస్టులు, ఈబూక్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులు ఇవన్ని టెక్స్ట్ కంటెంట్ క్రింద పరిగణించబడతాయి. 
  2.   ఇమేజ్స్: ఇమేజ్స్ లేదా ఫోటోలు ఇవి కూడా కంటెంట్ కిందకే వస్తాయి. చాలా సార్లు ఇవి టెక్స్ట్ కంటెంట్ తో పాటుగా కలిసి ఉంటాయి. ఇమేజ్స్, చార్ట్స్, ఇన్ఫోగ్రాఫ్స్ ఇలాంటివి సోషల్ మీడియా లో ఎక్కువగా షేర్ చేయటానికి యుసర్స్ ఇష్టపడతారు.  
  3. ఆడియో: ఆడియో కంటెంట్ అంటే ఇప్పుడు మళ్ళి క్రొత్తగా వస్తున్నా పోడ్కేస్ట్ అని అంటునారు కదా అవి. అంటే కేవలం ఆడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ని ప్రోవైడ్ చేస్తే వాటిని పోడ్కేస్ట్ అని అంటారు. మళ్ళి ఇపుడిప్పుడే పోడ్కేస్ట్ లకు ఆదరణ పెరుగుతుంది. 
  4. వీడియో: ఇవి మన అందరికి తెలిసినవే! YouTube వెబ్ సైట్లో ఉన్న వీడియోస్ అన్నిరకాల కంటెంట్ లభిస్తుంది. అలాంటివి అన్ని కూడా వీడియో కంటెంట్ కిందకే వస్తాయి.
ఇన్ని రకాలుగా మనం కంటెంట్ ని create చేయవచ్చు. ఒక రెండేళ్ళ క్రితం వరకూ టెక్స్ట్ కంటెంట్ కి మంచి వేల్యూ ఉండేది. ప్రస్తుతం వీడియో కంటెంట్ కి మంచి ఆదరణ ఉంది. బహుశా తిరిగి మళ్ళి టెక్స్ట్ కంటెంట్ కి తిరిగి మంచి రాజులూ వస్తాయి అనేది టాప్ bloggers అంచనా వేస్తున్నారు.
మనం కంటెంట్ మార్కెటింగ్ ఎందుకు చేస్తాము?
మనం కంటెంట్ మార్కెటింగ్ brand awareness, lead generation, engagement, sales వంటి లక్ష్యాల కోసం చేస్తాము. ఈ లక్ష్యలన్ని కూడా మనం మన కస్టమర్స్ ఎంగేజ్మెంట్ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. మీ లక్ష్య సాధనలో ప్రతీ నిత్యం క్రొత్త కంటెంట్ create చేయండి. దానిని ఈమైల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీ విసిటర్స్ కి చేరవేయండి. మీ కంటెంట్ క్రొత్త గా ఉండి, వారికి, వారి సమస్యలకి సహాయం చేయగలిగేలా ఉంటె మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
కంటెంట్ అనేది ఎప్పుడు కూడా శిఖర భాగాన ఉంటుంది. కాబట్టి కంటెంట్ మార్కెటింగ్ చేయడంలో మీరు మాస్టర్స్ అయితే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఎక్స్పర్ట్స్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

What is Web Designing ? How to design Website? Explained in Telugu | Blogger VJ


What is Web Designing ? How to design Website? | Blogger VJ
What is Web Designing ? How to design Website? | Blogger VJ
వెబ్ సైట్ డిజైనింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక ముఖ్యమైన భాగం. ఇందు కోసం మనం WordPress అనే cms వెబ్ సైట్ డిజైనింగ్ టూల్ ని ఉపయోగిస్తాము. WordPress యే ఎందుకు అంటే WordPress ద్వారా వెబ్ సైట్ చేయడం చాలా ఈజీ. అంటే కాదు మనకు SEO (search engine optimization)లో వెబ్ సైట్ ర్యాంకింగ్  చేయడంలో WordPress వెబ్ సైట్స్ చక్కగా ఉపయోగపడతాయి. ఈ పోస్టులో WordPress ద్వారా వెబ్ సైట్ create చేయటం ద్వారా వచ్చే ఉపయోగాలు? మిగితా మార్గాల ద్వారా ఏ విధంగా వెబ్ సైట్ చేసుకోవచ్చు? అసలు డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్ సైట్ అవసరం ఏంటి అనేవి చూద్దాం.

అసలు వెబ్ సైట్స్ ఎందుకు create చేసుకోవాలి? 

ఒక బిజినెస్ కి వెబ్ సైట్ అవసరమా? అనే విషయం చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ మనం ఎందుకు చేస్తాం? మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని సేల్ చేసుకోవటానికి. అలా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని కస్టమర్ కొనుగోలు చేయాలి అంటే మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి అతనికి తెలిసి ఉండాలి.  మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి ఎక్కడ ఉన్న కస్టమర్ ఎలా తెలుసుకుంటాడు? మనకి కాల్ చేసి వివరాలు తెలుసుకుంటాడు అనుకుందాం! అల కాల చేసినప్పుడు మనం ఎంత వరకూ డిటైల్డ్ గా చెప్పగలం. అదే వెబ్ సైట్ ఉంటె మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనం అందులో పొందుపరచవచ్చు. 

వెబ్ సైట్ వలన ఉపయోగాలు ఏంటి?

మన బిజినెస్ కి వెబ్ సైట్ ఉంటె కస్టమర్ కి కొంత నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే అందులో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఎందుకంటే డిజిటల్ రంగం లో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో, అన్ని రకాల మోసాలకి ఆస్కారం ఉంది.
అలాగే మనం ఒక కస్టమర్ యొక్క వివరాలు అంటే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటివి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పొందాలి అంటే మనకి ఒక వెబ్ సైట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పుడు వెబ్ సైట్ చేయడం అంటే కష్టం మరియు ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు కంపెనీలమధ్య పోటి, అందుబాటు లో ఉన్న ఆధునిక టెక్నాలజీ వెబ్ సైట్ డిజైనింగ్ ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అన్ని రంగాలు డిజిటల్ లోకి మారిపోతున్నాయి. అలాంటప్పుడు మీరు మీ బిజినెస్ కి వెబ్ సైట్ కూడా చేయించుకోకపోతే వ్యాపారంలో వేనుకపడిపోతారు. మన వెబ్ సైట్ ద్వారా కూడా మనం లీడ్స్ పొందవచ్చు. మన వెబ్ సైట్ లో కాంటాక్ట్ పేజి ద్వారా మన మెయిల్ కి లీడ్స్ వస్తాయి. కాబట్టి ప్రతీ బిజినెస్ కి వెబ్ సైట్ ఖచ్చితంగా ఉండాలి. 

వర్డుప్రెస్సు అంటే ఏంటి? 

అయితే WordPress ద్వారా వెబ్ సైట్ create చేయటం చాలా ఈజీ. ఎందుకంటే ఇందులో మనకి ఎలాంటి టెక్నికల్ knowledge లేకపోయినా మనం వెబ్ సైట్ create చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లో కొన్ని వేల లెసన్స్ WordPress ద్వారా ఎలా వెబ్ సైట్ డిజైన్ చేయాలి అని ఉన్నాయి. WordPress ద్వారా మనకి నచ్చిన థీమ్స్ (డిజైన్స్) ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన అవసరాలకి తగినట్టుగా అదనపు హంగులను ప్లగిన్స్ ద్వారా ఫ్రీగా add చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంటర్నెట్లో ఉన్న 25% వెబ్ సైట్స్ WordPress లో చేసినవే!

ఇంకా వేరే కంపెనీలు ఏమన్నా ఉన్నాయా?

WordPress కాకుండా కూడా మనం మరికొన్ని మార్గాల ద్వారా కూడా వెబ్ సైట్ ని చేసుకోవచ్చు. ఇక్కడ వాటిల్లో ప్రధానమైనవి డిజైనర్స్  ద్వారా చేయించుకోవటం. లేదా మనకి ఇప్పుడు ఇంటర్నెట్ లో godaddy.com, wix.com వెబ్ సైట్ లు వెబ్ సైట్ డిజైన్ సేర్విసులని అందిస్తున్నాయి. ఈ కంపెనీల వాళ్లు నెలకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఇవే కాకుండా మనకి freelancer వెబ్ సైట్స్ ద్వారా కూడా వెబ్ సైట్స్ ని మన బడ్జెట్ లో చేసి ఇచ్చే వారు ఉన్నారు.
WordPress వెబ్ సైట్ మనకి ఈజీ గా SEO అవ్వటానికి ఉపయోగాపడతాయి. అంటే కాకుండా వీటికి సంబంధించిన సమస్య ఏదన్న వచ్చిన ఇంటర్నెట్లో చాలా మంది మనకి సహాయం చేయగలరు. తరువాత ముఖ్యమైనది మిగితా వాటితో పోలిస్తే మనకి ఖర్చు తక్కువగా అవుతుంది. అతి తక్కువ సమయంలో మనం వెబ్ సైట్ ని కూడా రెడీ చేసుకోవచ్చు.
అయితే మనకి ఇందు కోసం ఎలాంటి టెక్నికల్ knowledge అక్కరలేదు. తరువాత కొంచెం మనం WordPress ని అర్థం చేసుకోగలిగితే చాలు. ఒకవేళ మనకి అర్థం కాకపోయినా పర్వాలేదు, కొన్ని కంపెనీలు అతి తక్కువ కాస్ట్ కి మనకి చేసి ఇస్తాయి. తరువాత మనం వాటిని ఎలా ఉస్ చేయాలి అని ట్రైనింగ్ కూడా ఇస్తాయి. కాబట్టి మనకి డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్ సైట్ చాలా అవసరం, ఇంకా ముఖ్యం కూడా. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

What are the skills learn in Digital Marketing in Telugu | Blogger VJ

What are the skills learn in Digital Marketing in Telugu | Blogger VJ
What are the skills learn in Digital Marketing in Telugu | Blogger VJ

హాయ్ ! డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి modules ఉంటాయి? అసలు Digital Marketing ఎలా నేర్చుకోవచ్చు? అనేటువంటి టాపిక్స్ గురించి తెలుసుకున్నారు కదా! ఒకవేళ ఆ పోస్ట్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటె, వారికోసం ఆ పోస్ట్ యొక్క లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.  ఈ పోస్ట్ లో అనే టాపిక్స్ గురించి తెలుసుకుందాం. “డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటానికి కావాల్సిన స్కిల్స్” ఎంతో చూద్దాం.

Important Skills to Learn Digital Marketing? | డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటానికి కావాల్సిన స్కిల్స్?


Creative Content Writing

డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ అనేది చాల కీరోల్ ప్లే చేస్తుంది. మరి అలాంటప్పుడు మీకు కంటెంట్ ని క్రియేట్ చేయగలగాలి. అలాగని మీరేమి Trivikram లాగా, లేదా Paruchuri Brothersలాగా రాయాలని కాదు. మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి (తెలిసి ఉండాలి).
టిప్: అందుకోసం మీరు ఆల్రెడీ రాసినటువంటి ఆర్టికల్ ని కాపీ పేస్టు చేసుకొని, దాన్ని rewrite చేయడం మొదలుపెట్టండి. Rewrite చేయడం అంటే వాళ్ళు రాసిన పాదాలను ఆ వాక్యానికి తగ్గట్టుగా అదే అర్థం వచ్చే విధంగా వ్రాయాలి.

WordPress Management

WordPress అనేది చాలామంది డిజిటల్ మర్కేటర్స్ use చేసేటువంటి టూల్. ఎందుకంటే WordPress తో మనం చాలా తక్కువ సమయంలో వెబ్ సైట్స్ ని క్రియేట్ చేయగలం. ప్రత్యేకించి WordPress SEO కి అనుగుణంగా ఉన్నటువంటి CMS అప్లికేషను. దీనిని కేవలం వెబ్ సైట్స్ కోసం మాత్రమే కాకుండా బ్లాగ్ క్రియేషన్ కోసం కూడా ఉపయోగిస్తారు. WordPress ద్వారా వెబ్ సైట్ క్రియేట్ చేయటానికి మనం డెవలపర్ కావాల్సిన అవసరం లేదు. కానీ wordpress ని అర్థం చేసుకుంటే చాలు.

Photo Editing Skills

ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ అన్నం కదా అని మీరు Graphic Designer కానవసరం లేదు. (నిజానికి నేను మీకు ఈ విషయం చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనకి మొబైల్స్ లో చాలా అప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి.) బేసిక్స్ తెలిసి ఉంటె చాలు. ఎందుకంటే ఒక ఇమేజ్ కొన్ని వేల పదాలకి సమానం.

Data Analytics

Data Analytics అంటే అదేదో టెక్నాలజీ కాదు. గూగుల్ అనలిటిక్స్ అనే టూల్ ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన టార్గెట్స్ ని రీచ్ అవ్వటానికి మరింత తోడ్పడుతుంది. ఇందు కోసం మనకి గూగుల్ అనలిటిక్స్ సర్టిఫికేషన్ అవసరం లేదు. కానీ మనం ఆ టూల్స్ పై work చేస్తూ ఉంటె తరువాత మాస్టర్ అవుతాము.

Passion

Passion ... ఈ మాట వినటానికి చాలా సింపుల్ గా ఉన్నపటికీ ఏదైనా నేర్చుకోవటానికి Passion అనేది ఉండాలి. ఎందుకంటె మీకు Passionate కాకపోతే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేరు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకసారి, ఒకేసారి నేర్చుకునేది కాదు. ప్రతిరోజూ నేర్చుకోవాలి.
టాప్: పాపులర్ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ ని subscribe చేసుకోండి(updates కోసం మది కూడా subscribe చేసుకోండిJ).

Learn by Doing

చెప్పిన టాపిక్ ని అప్లై చేయకపోతే మనం పూర్తిగా నేర్చుకున్నట్లు కాదు. మనం ఈ సిరీస్ లో చాలా టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. కానీ మీరు ఎప్పుడైతే తెలుసుకున్న దానిని అప్లై చేసినప్పుడే నిజంగా నేర్చుకున్నట్లు.
టిప్: మేము చెప్పే ప్రతి టాపిక్ ని Practice చేయండి.

Urge to learn & Stay Updated  

నేర్చుకోవాలని తపన & నిరంతరం అప్డేట్ గా ఉండటం అనేది కంపుల్సరిగా ఉండవలసిన లక్షణం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎప్పటికి అప్పడు మారిపోతుంటుంది. మీరు ప్రతిరోజూ నేర్చుకోవాలి.
ఉదాహరణకి ఈ పోస్ట్ వ్రాసే సమయానికి ఫేస్బుక్ users డేటాని కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ అనే సంస్థ misuse చేసింది అని ఫేస్బుక్ ఒప్పుకుంది. తరువాత తన అల్గారిథం ని చేంజ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్న లేదా మీ సలహాలు సూచనలను కామెంట్స్ లో తెలియచేయండి. ధన్యవాదాలు.
Share:

#10 Important Modules in Digital Marketing in Telugu | Blogger VJ

Digital Marketing Modules in Telugu by Blogger VJ
Digital Marketing Modules in Telugu by Blogger VJ

హాయ్ లాస్ట్ పోస్ట్ లో మనం అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ట్రెడిషనల్ మార్కెటింగ్ కి, డిజిటల్ మార్కెటింగ్ కి తేడ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి? అనే వాటి గురించి తెలుసుకున్నాం. ఈ పోస్టులో డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి? ఏమిమి మడ్యుల్స్ ఉంటాయి? అవి ఏంటి? అనేవి చూద్దాం!
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఒక advertisement ని customize చేయవచ్చు అని తెలుసుకున్నాం.  అయితే ఇందులో మనం కొన్ని టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలి. అయితే టెక్నాలజీస్ అన్నాం కదా అని బయపడకండి, ఎందుకంటే  ఈ టెక్నాలజీస్ ఎవరైనా నేర్చుకోవచ్చు. 
  • Website Designing (Wordpress)
  • Content Writing
  • Email Marketing (Mail Chimp)
  • SEO
  • SMO
    • Facebook
    • Twitter
    • YouTube
    • Instagram
    • LinkedIn
    • Pintrest
  • Google Analytics
  • Google Adwords
  • SEM
  • SMM
  • Mobile Marketing

వీటిని అన్నింటి గురించి మనం ముందు ముందు పోస్ట్లలో తెలుసుకుందాం.
డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్లోనే ఎందుకు నేర్చుకోవాలి? బుక్స్ దొరకవా? బుక్స్ చదువుకుని కూడా నేర్చుకోవచ్చు కదా? అనే సందేహం మీకు రావచ్చు. డిజిటల్ రంగం ప్రతీ నిత్యం అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరు అనుకునట్టుగానే ఒక బుక్ చదివి నేర్చుకోవచ్చు. ఆ బుక్ రాసిన 2 సంవత్సరాల తరువాత మీరు ఆ బుక్ కొని నేర్చుకుంటే అప్పటికి ఆ బుక్ చెప్పినవి అన్ని మారిపోయి ఉంటాయి. కాబట్టి ఎపటికి అప్పుడు మీరు అప్డేట్ గా ఉండాలి. అల ఉండగల్గితేనే మీరు డిజిటల్ మార్కెటింగ్ రంగం లో ముందుకు వెళ్ళగలరు. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

What is Digital Marketing in Telugu | Blogger VJ


What is Digital Marketing in Telugu by Blogger VJ
What is Digital Marketing in Telugu by Blogger VJ
డిజిటల్ మార్కెటింగ్... ఇప్పుడు ప్రతి రంగాన్ని తనతో కలుపుకుపోతున్న రంగం. డిజిటల్ మార్కెటింగ్ వల్ల మన దేశంలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు 2020కల్ల వస్తాయని ఒక అంచనా. మరి అంతగా ఈ రంగంలో ఏం ఉంది? డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ రంగంలో మార్కెటింగ్ రూపు రేఖలు కూడా మారిపోతున్నాయి. అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ కి, డిజిటల్ మార్కెటింగ్ ని తేడా ఏంటి? 

ఉదాహరణకి ఒక్కప్పుడు మార్కెటింగ్ అంటే ఇంటింటికి వెళ్లి మన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసేవాళ్ళం. తరువాత పాంఫ్లెట్స్, పోస్టర్స్ వేయిన్చేవాళ్ళు. క్రమంగా రేడియో ads వచ్చాయి. తరువాత టీవీ రేడియో స్తానాన్ని ఆక్రమించింది. ఇక్కడ అన్నింటి ప్రయోజనం ఒక్కటే. ఒక product కస్టమర్ కి చేరటం, కస్టమర్ కి మన ప్రోడక్ట్ గురించి తెలియటం.  అయితే ఇవి ఎంత మందికి చేరాయి, ఎంతమంది వీటిని చూసారు అనేది తెలిసేది కాదు.
ఇప్పుడు కాలం మారింది. అబ్దుల్ కలాంగారు చెప్పినట్టు టెక్నాలజీ అంటే కేవలం ఫ్యాక్టరీలలోనో, లేదా కెమికల్స్ కలపడం వంటి వాటిల్లో మాత్రమే పరిమితం కాకూడదు అని. ఇప్పుడు సరిగ్గా టెక్నాలజీ వ్యాపార పోకడలనే మార్చేస్తుంది. మన దేశంలో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన తరువాత దేశ ముఖ చిత్రం మారింది. ఒక్కొకటిగా అన్ని సేవలు  డిజిటల్ అయ్యాయి. అలాగే స్మార్ట్ మొబైల్ వాడె వినియోగదారులు కూడా పెరిగారు.
సరిగ్గా ఈ మార్పులన్నీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ కి అదనపు బలాన్ని సమకూర్చాయి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మహా సముద్రం. ఇందులో అనేక రకాల మాడ్యుల్స్ ఉన్నాయి. అయితే అన్ని అందరికి ఉపయోగపడవు. కానీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఒక advertisement కనుక ఇస్తే అది ఎంత మందికి రీచ్ అయ్యింది, ఎంత మంది దానికి కనెక్ట్ అయ్యారు, ఏ ఏ వయసుల వాళ్లు చూసారు, ఆడవాళ్ళూ చూసారా? మగవాళ్ళు చూసారా? ఇల్లాంటి ఎన్నో వివరాలని, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం విశ్లేషించవచ్చు. మనం ఈ విశ్లేషణ ద్వారా తరువాత మళ్ళి ప్లానింగ్ చేసుకోవచ్చు.
ఇప్పటికి టీవీ advertisement రంగం ఆదాయాన్ని కొల్లగొడుతున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ కోర్స్ యాభైవేల రూపాయల నుండి ఎనభై వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. పట్టణాలలో ఇన్స్టిట్యూట్  రేంజ్ ని బట్టి ఇరవై ఐదు వేల వరకూ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ మర్కేటర్స్ కి కూడా అదే విధంగే డిమాండ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పూర్తీ చేసిన వెంటనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు వేల రూపాయలను చేల్లిస్తునాయి.
అంతటి ఆర్ధిక స్తోమత లేని వాళ్ళ కోసం కొన్ని డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ లు ఫ్రీ కోర్సులు (బేసిక్) అందిస్తున్నాయి.
తెలుగు లో మీకు డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహనా కల్పించటానికి ఈ కోర్స్ ని డిజైన్ చేయడం జరిగింది.
ఈ సిరీస్ లో మేము దాదాపుగా డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతీ టాపిక్ గురించి విహంగ వీక్షణం (overview) గా చెప్పడం జరుగుతుంది. ప్రతీ టాపిక్ గురించి విడివిడిగా కోర్స్ లను తరువాత అందించడం జరుగుతుంది.  మీరు మా కోర్స్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం ద్వారా మనకు సహాయం చేసిన వారవుతారు. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

How to start blogging for Low Price in Telugu by Blogger VJ


How to start blogging for low price by blogger vj
How to start blogging for low price by blogger vj

బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసే వాళ్ళలో చాలా మంది స్టూడెంట్స్, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎక్కువ మంది మనీ ఎర్న్ చేయడం కోసమే చేస్తారు. కాబట్టి వాళ్ళలో చాలా మంది వీలు అయితే ఫ్రీగా, లేదా అతి తక్కువ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు.అలంటి వల్ల కోసమే ఈ ఆర్టికల్. ఇందులో ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఎందుకు తీసుకోకూడదు? Godaddy, Wix వంటి కంపెనీలు ఆఫర్ చేసే సర్వీసులు ఎందుకు రిఫర్ చేయకూడదు? అతి తక్కువ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయటం ఎలా? అనే విషయాలని చూద్దాం!

ఫ్రీ వెబ్ హోస్టింగ్ బ్లాగ్గింగ్ కి ఎందుకు తీసుకోకూడదు?

        చాలా మంది ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఎక్కడ దొరుకుతుంది? అని గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. నిజానికి చాలా కంపెనీలు ఫ్రీ హోస్టింగ్ ని అందిస్తున్నాయి. అయితే ఈ హోస్టింగ్ సర్వీస్ లని బ్లాగ్గింగ్ చేసే వాళ్లు ఎందుకు రిఫర్ చేయకూడదు అని చూద్దాం.

  • ఫ్రీ హోస్టింగ్ సర్వీస్ లు అందించే వెబ్సైట్ల సర్వర్స్ ఎప్పుడు ఆగిపోతాయి తెలియదు.
  • వెబ్ సైట్ లోడింగ్ స్పీడ్ కూడా చాలా స్లోగా ఉంటుంది.
  • అంతే కాకుండా స్పేస్ లిమిటేషన్ ఉంటుంది.
  • ఫ్రీ సర్వీస్ కాబట్టి సపోర్ట్ అంత బాగోదు. ఏదో ఒక 20% - 30% మాత్రమే ఉంటుంది.
  • ఇవి WordPress వంటి అప్లికేషన్లకి సపోర్ట్ చేసిన అంత స్పీడ్ గా వుండవు.
  • ఈ సర్వర్స్ లో స్టాటిక్ వెబ్ సైట్ లకి అంత ఇబ్బంది ఉండదు. కానీ డైనమిక్ వెబ్ సైట్ల వర్కింగ్ స్పీడ్ చాలా తగ్గుతుంది.
  • వీళ్ళు ఎంతసేపటికి ఫ్రీగా రిజిస్టర్ అయిన వాళ్ళని ప్రీమియం సర్వీసెస్ / ప్యాకేజ్స్ తీసుకోమని రిఫర్ చేస్తారు.
  • వీళ్ళు అందించే బ్యాండ్విడ్త్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా వెబ్ సైట్స్ / కంపెనీలు చెప్పటానికి అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అని అంటారు కానీ, అన్లిమిటెడ్ ఇవ్వరు.

Wordpress కాకుండా Godaddy, Wix వంటివి ఎందుకు రిఫర్ చేయకూడదు?

        Godday, Wix వంటి చాలా వెబ్ సైట్లు చాలా తెలివిగా మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. వాళ్లు ఆఫర్ చేసే సర్వీస్ గురించి ఇక్కడ చెప్పుకుందాం. వల్ల దగ్గర మంత్లీ 600 - 800 రూపాయల మధ్యన ఉండే ప్లాన్లలో మనకి హోస్టింగ్ తో పాటుగా వెబ్ సైట్ బిల్డర్ సర్వీస్ ని కూడా అందిస్తారు. వెబ్ సైట్ బిల్డర్ అంటే డ్రాగ్ & డ్రాప్ పద్ధతి ద్వారా మనకి కావలసినట్టు వెబ్ సైట్ / బ్లాగ్ డిజైన్ చేసే టూల్. వీళ్ళు మనల్ని ఎట్ట్రక్ట్ చేయటానికి ఫ్రీ గా డొమైన్ ఇస్తారు. .com, .in, .org ఇలా ఏదైనా.
        ఈ సర్వీస్ లో మొదట ప్రైసింగ్ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి నెలకి 800 అని అనుకుందాం. అంటే సంవత్సరానికి 800 x 12 = 9600. GST ఎక్స్ట్రా. అదే మనం BlueHost సర్వీస్ తీసుకున్నా 5000 సంవత్సరానికి అంతకు మించదు. BlueHost అయితే ఫ్రీగా .com డొమైన్ ఎక్స్టెన్షన్ తో ఇస్తుంది. అలా కాకుండా HostGator, లేదా Hostinger వంటివి అయితే ఇంకా తక్కువ చార్జ్ చేస్తాయి. విడిగా డొమైన్ పర్చేస్ చేసిన ఇంకో వెయ్యి రూపాయల దాక తగ్గుతుంది.
        వెబ్ సైట్ బిల్డర్ టూల్ డ్రాగ్ & డ్రాప్ చేసుకునే వెసులుబాటు ఉన్నా అందులో మనకి కావాల్సిన అదనపు హంగులు అంటే ఈమెయిలు కలెక్షన్ ఫార్మ్స్, కాంటాక్ట్ ఫారం, సోషల్ షేరింగ్ వంటి ఆప్షన్స్ వుండవు, అదే సెల్ఫ్ హోస్టింగ్ WordPress లో మనకి అన్ని రకాల అవసరాలకి ఫ్రీ మరియు పైడ్ ప్లగిన్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో వుంచుకొని వీటిని తిరస్కరించడానికి ప్రయత్నించండి.

అతి తక్కివ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయడం ఎలా?

        చాలా మంది బ్లాగ్గింగ్ చేసే బిగినర్స్ మనీ ఎఫ్ఫర్ట్ చేయలేకపోవచ్చు. వాళ్లు దాదాపుగా ఫ్రీ గా స్టార్ట్ చేద్దాం అనే అనుకుంటారు. ఫ్రీగా స్టార్ట్ చేసే సర్విసులలో ఉండే లాభనష్టాల గురించి ఇంతకు ముందు ఆర్టికల్స్ లో చెప్పుకోవటం జరిగింది. మరి అతి తక్కువతో అంటే 1000 రూపాయలతో బ్లాగ్ స్టార్ట్ చేయటం ఎలా? అంటే ఇందుకు నేను చెప్పే మార్గ డొమైన్ .com, .in, .org, .net వంటి ఎక్స్టెన్షన్ తో కొనుక్కొని blog-spot అప్లికేషను వాడుకోవచ్చు.
        అవును కస్టమ్ డొమైన్ నేమ్ ని blog-spot లో లింక్ చేఉకుని blog-spot ప్లాట్ఫారం లో (అంటే గూగుల్ హోస్టింగ్) ఉపయోగించుకుని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు. అంటే ఓక్ డొమైన్ కొనుకుంటే సరిపోతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సర్వీస్ ని మనం కొంత కాలం మాత్రమే ఉపయోగించుకుంటాం. (అంటే గూగుల్ లైఫ్ టైం ఇస్తుంది.) వర్డుప్రెస్సు లోకి మారటం తప్పనిసరి. వర్డ్ప్రెస్ బ్లాగ్ కి అదనపు సౌకర్యాలు ఉంటాయి.
          Blog-spot లో కూడా చాలా థీమ్స్ ఫ్రీగా దొరుకుతాయి. వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. Blog-spot పై కూడా YouTube, ఇంకా చాలా బ్లాగ్స్ ట్యుటోరియల్స్ అందిస్తున్నాయి. నిదానంగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు. మంచి కంటెంట్ ప్రెసెంట్ చేయగలిగితే అతి తక్కువ సమయంలో పాపులర్ అవ్వవచ్చు. అప్పుడు నిదానంగా డబ్బులు చూసుకొని WordPress లోకి మారొచ్చు. ఈ పద్ధతి ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బులు లేవు అని ఆగిపోకుండా త్వరగా సక్సెస్ అవ్వవచ్చు. ఏదో ఒక విధంగా మొదలుపెడితే త్వరగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటె మమల్ని కాంటాక్ట్ అవ్వండి. జై హింద్.
Share:

How to start a free blog with Blogger in Telugu by Blogger VJ

How to start a free blog with blogger by blogger VJ
How to start a free blog with blogger by blogger VJ

ఫ్రీ గా బ్లాగ్గింగ్ చేయటం ఎలా? అని మనం ఇంతకు ముందు ఆర్టికల్లో చెప్పుకోవడం జరిగింది. అందులో blogger.com, wordpress.org అని రెండు ఆప్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ రోజు blogspot/ blogger గురించి తెలుసుకుందాం. blogger.com లో బ్లాగ్గింగ్ ఎలా చేయాలి? బ్లాగర్ ప్లాట్ఫాం ఎలా ఉంటుంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Blogspot లో మనం ఫ్రీగా బ్లాగ్గింగ్ చేయవచ్చు. Blogspot నే blogger.com అని కూడా అంటారు. ఇందులో .blogspot.com అనే ఎక్స్టెన్షన్ తో ఒక నేమ్ ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఫ్రీ హోస్టింగ్ కూడా చేయవచ్చు. అన్నట్టు ఇది Google Product. Blogspot.com ని గూగుల్ కొనుక్కొని మెయిన్ టైన్ చేస్తుంది. Blogspot phython ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధారంగా పని చేస్తుంది.
యూసర్ ఇంటర్ఫేస్, థీమ్ అంత xml లో డిజైన్ చేయబడి వుంటుంది. Blogspot లో మనం Blog ఓపెన్ చేయటానికి ఓక్ gmail అకౌంట్ ఉండాలి. చాలా సులభంగా మనం blogspotలో ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయవచ్చు. ఇందులోనే డిఫాల్ట్ గా కొన్ని థీమ్స్ కూడా ఉంటాయి. వాటిల్లో మనకి నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు.  
Blogspot లో మనకి ఏమి తెలియక పోయినా, MS Word ఒక్కటి తెలిసినా బ్లాగ్గింగ్ చేయవచ్చు. ఒక ఆర్టికల్ ని అందులో టైపు చేసి, ఫార్మాటింగ్ అంత చేసి (అదేనండి కలర్స్ అప్లై చేయడం, ఫాంట్ చేంజ్స్ చేయడం, సైజు, స్టైల్ చేంజ్ చేయడం వంటివి) అందులో నుండి డైరెక్ట్ గా కాపీ చేసి, పేస్ట్ చేస్తే సేమ్ టూ సేమ్ అప్లై అవుతుంది. Blogspot లో మనం క్రియేట్ చేసే పోస్తులని క్యాటగిరి వైస్ గా చేసుకోవటానికి లేబిల్స్ అని ఒక ఆప్షన్ ఉపయోగపడుతుంది.
Blogspot లో ఉన్న అడ్వాన్టేజ్ ఏంటి అంటే అన్లిమిటెడ్ స్పేస్ మనకి దొరుకుతుంది. అంతే కాకుండా గూగుల్ ప్రోడక్ట్ అవ్వడం వలన గూగుల్ లో త్వరగా ర్యాంకింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనకి బ్లాగర్ టెంప్లేట్స్ అని మనం బయటి నుండి టెంప్లేట్స్ డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయవచ్చు. Blogspot ఫ్రీ అయినప్పటికీ ఇందులో కూడా మనం యాడ్స్ పెట్టుకుని ఎర్నింగ్స్ చేయవచ్చు. కాబట్టి ఫ్రీగా మొదలుపెడతాను అనుకునే వాళ్లు Blogspot ని ఉపయోగించుకోవచ్చు.
అయితే ఈ అప్లికేషన్ లో కూడా కొన్ని డ్రాబాక్స్ ఉన్నాయి. థీమ్స్ మనకి నచ్చినట్టుగా చేసుకొని, బ్లాగ్ కస్టమైజ్ చేసుకోవటానికి లిమిటేషన్స్ ఉన్నాయి. కొంచెం టెక్నికల్ పరిజ్ఞానం పై కూడా అవగాహనా పెంచుకోవాలి. ఇందులో కూడా అన్లిమిటెడ్ పోస్టులు, పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే SEO పరంగా కొన్ని టెక్నికల్ గా చేయటానికి అంతగా కుదరదు. ఇది కేవలం బ్లాగ్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. కనీ ఎక్కడ వెబ్ సైట్ లుక్ అనేది తీసుకురాలెం. ఒక వేళ అలా కావాలి అంటే అమౌంట్ పే చేసి టెంప్లేట్స్ పర్చేస్ చేయాలి. కానీ బిగినర్స్ కి బ్లాగర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బ్లాగ్గింగ్ ఎలా చేయాలి అనేటువంటి ఈ Blogspot చక్కగా ఉపయోగపడుతుంది.
ఇది Blogspot కి సంబంధించిన ఓవర్ వ్యూ ఇన్ఫర్మేషన్. దీనీ పై పూర్తిగా A-Z ప్రతి టాపిక్ గురించి ముందు ముందు మరిన్ని ఆర్టికల్స్ వ్రాస్తాను. సో ఫ్రీగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళకి blogspot ట్రై చేయోచ్చు . జై హింద్.
Share:

Popular Posts