Blogging As A Startup ! Explained in Telugu by Blogger VJ

Blogging as Startup by Blogger VJ
Blogging as Startup by Blogger VJ

 బ్లాగ్గింగ్ గురించి తెలుసుకున్నాం, ఎందుకు చాలా మంది అవుతున్నారో తెలుసుకున్నాం, ఎలా నిషి సెలెక్ట్ చేసుకోవాలి, అనే విషయాల గురించి ఇంతకూ ముందు ఆర్టికల్స్ లో తెలుసుకున్నాం. ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి? ఫ్రీగా చేయవచ్చా? లేక ఏమన్నా డబ్బు ఖర్చు పెట్టాలా? ఫ్రీగా బ్లాగ్గింగ్ చేస్తే సక్సెస్ అవుతామా? డబ్బు ఖర్చు పెడితే సక్సెస్ అవుతామా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం !

ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?

        ఒక మంచి ఆలోచన వచ్చిన వెంటనే లేదా బ్లాగ్గింగ్ చేయాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే బ్లాగ్గింగ్ మొదలు పెట్టడం మంచిది అని ఇంతకూ ముందు ఆర్టికల్లో చెప్పను. అయితే ఇక్కడ బ్లాగ్గింగ్ చేసే విధాన 2 రకాలు (నా ఆలోచనల్లో). ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ ద్వారా చేయడం ఒకటి. మరొకటి మనం సొంతంగా ఒక బ్లాగ్ ని మొదలుపెట్టాడు. మీ ఇష్టం, మీరు ఎలా అయిన మొదలు పెట్టవచ్చు. అయితే నా సలహా సొంత బ్లాగ్ అయితే మంచిది. అందువల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
        బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయటానికి ముందుగ ఒక నిషిని సెలెక్ట్ చేసుకుని, ఈ నిషి అయితే మనం నిరంతరం బ్లాగ్ ఆపకుండా చేయగలం అని ఒక నమ్మకం వచ్చాక, ఏ ప్లాట్ఫారం పై చేయాలి అని ఆలోచించుకోవాలి. ఎందుకంటె మనం ఎంచుకునే ప్లాట్ఫారం కూడా మన సక్సెస్ లో ఉపయోగపడుతుంది. బ్లాగ్గింగ్ చేయటానికి రకరకాల ప్లాట్ఫారంస్ ఉనంయి. వాటిల్లో Blogspot, Wordpress, Jomla, కష్టమైజడ్ CMS అప్లికేషన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో Blogspot, Wordpress, Jomlaలు బాగా పాపులర్ అప్లికేషన్లు. అదృష్టం ఏంటి అంటే ఈ ప్లాట్ఫాంస్ 3 మనకి ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. ప్లాట్ఫాం నిర్ణయించుకున్న తరువాత ప్రమోషనల్ ఆక్టివిటీస్ (Marketing Plan) గురించి ఆలోచించాలి. ఇవి ఒక్కో బ్లాగర్ యొక్క ఆలోచనా విధానం బట్టి మారుతూ ఉంటుంది.
        మార్కెటింగ్ కూడా అయ్యాక మన బ్లాగ్ యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉందొ తెలుసుకోవటానికి మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని, మన బ్లాగ్ ని మరింత బాగా పాపులర్ అయ్యేలా చేసుకోవచ్చు. ఓక్ బ్లాగ్ స్టార్ట్ చేయటానికి బేసి ప్రాసెస్ ఇది. వీటిని గురించి వివరంగా ముందు ముందు తెలుసుకుందాం.

బ్లాగ్గింగ్ ఫ్రీగా చేయవచ్చా? డబ్బు ఏమన్నా ఖర్చు పెట్టాలా?

        ఈ రెండు ప్రశ్నలకి నా దగ్గర 2 సమాధానాలు ఉన్నాయి. అవి: 1) బ్లాగ్గింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయవచ్చు. 2) డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. ఏంట్రా వీడు ఫ్రీగా చేయోచ్చు , డబ్బు ఖర్చు పెట్టాలి అంటదు అని అనుకుంటున్నారా? టెన్షన్ పడకండి, కూల్ గా ఉండండి. నేను వివరణ ఇస్తాను.

ఫ్రీగా చేయటం: 

మొదట ఈ ఆప్షన్ లో మనం పూర్తిగా ఒక బ్లాగ్ ని ఫ్రీగా స్టార్ట్ చేయవచ్చు. ఓక్ విషయం ఇక్కగా మనం గుర్తు పెట్టుకోవాలి. ఉచితంగా ఒక సర్వీస్ లభిస్తుంది అంటే ఆ సర్వీస్ లో లిమిటేషన్స్ వుంటాయి. అంతే కాకుండా కండిషన్స్ కూడా వుంటాయి. ఈ ఆప్షన్లో ఒక డొమైన్ నేమ్ కావాలి అయితే, అమన్ బ్లాగ్ పేరు www.yourdomainname.blogspot.com లేదా www.yourdomainname.wordpress.com లతో వస్తుంది. అంటే మన బ్లాగ్ ద్వారా వల్ల వెబ్ సైట్స్ కి ప్రమోషన్ జరుగుతుంది. వాళ్ళకి మనం ఉపయోగపడుతున్నాం కాబట్టి వాళ్లు మనకి ఆ డొమైన్ నేమ్ ఫ్రీగా ఇస్తారు. (డొమైన్ నేమ్ వాళ్ళది అందులో సబ్ డొమైన్ మనది).
        ఆ తరువాత మన బ్లాగ్ యూసర్ కి రీచ్ అవ్వాలంటే దాన్ని మనం ఏదో ఒక వెబ్ సర్వర్లో హోస్ట్ చేయాలి. పైన చెప్పిన వెబ్ సైట్స్ హోస్టింగ్ ని కూడా ఫ్రీగా అందిస్తాయి. అయితే ఇందులో మనకి కొన్ని లిమిటేషన్స్, కండిషన్స్ ఉంటాయి. ఫ్రీగా వెబ్ సైట్ / బ్లాగ్ థీమ్స్ లేదా టెంప్లేట్స్ కూడా దొరుకుతాయి. రెడీ టూ యూస్ అన్నమాట. మనకి కావలసినట్టు సెట్ చేసుకొని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు.

డబ్బు ఖర్చు పెట్టడం: 

ఈ ఆప్షన్లో మనకి కావలసినంత స్వేచ్చ ఉంటుంది. డబ్బో ఖర్చు పెడుతున్నాం కదా అని భయపడిపోకండి. డొమైన్ నేమ్, వెబ్ హోస్టింగ్ ల కోసమే మనం ఖర్చు పెట్టేది. మనకి కావాల్సిన పేరు మిద మనం .com, .in వంటి ఎక్స్టెన్షన్ల డొమైన్ నేమ్స్ కొనుక్కోవటం ద్వారా బ్లాగ్ నేమ్ ప్రొఫెషనల్ గా ఉండటమే కాకుండా, సులభంగా విసిటర్స్ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. మనకి 950 నుండి 1150 రూపాయలలో 2 సంవత్సరాలకి డొమైన్ నేమ్ ఆఫర్ లో వస్తుంది. కాబట్టి మనకి ఇంకొంచెం ఖర్చు తగ్గుతుంది.
ఇక హోస్టింగ్ విషయానికి వస్తే నేను 3 రకాల హోస్టింగ్ లా గురించి చెప్తాను. అయితే ఇవి మనం పెట్టె ప్రైస్ ని బట్టి వాటి క్వాలిటీ ఉంటుంది అనే విషయం మర్చుపోకూడదు.

  1. మొదటిది BlueHost సర్వీస్. ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. నెలకి 329 ఛార్జ్ చేస్తున్నారు. సంవత్సరానికి 3948 +taxs గా ఉంటుంది. సర్వీస్ విషయంలో ఎలాంటి రాజీపడవలసిన అవసరం ఉండదు.
  2. రెండవది Hostgator సర్వీస్. దీని ప్రైస్ BlueHost తో పోల్చుకుంటే చాలా తక్కువ. నెలకి 199 ఛార్జ్ చేస్తున్నారు. సంవత్సరానికి అయితే 2388 + taxs గా ఉంటుంది. ఈ సర్వీస్ కూడా బాగానే ఉంటుంది.
  3. ఇక చివరిది డెడికేటెడ్ హోస్టింగ్ సర్వర్ లో మీరు షేరింగ్ తీసుకోవటం. ఈ సర్వీస్ ని మేము అందిస్తాము. సర్వీస్ కూడా బాగుంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ. సంవత్సరానికి 2000* రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. సర్వీస్ పరంగా మీకు భయం కూడా ఉండదు, ఎందుకంటె మా క్లైంట్స్ వెబ్ సైట్స్ కూడా వీటిలోనే ఉంటాయి కాబట్టి.

వీటిల్లో మీ బడ్జెట్ ని దృష్టి లో పెట్టుకుని మీరు హోస్టింగ్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హోస్టింగ్ తీసుకున్న తరువాత డొమైన్ నేమ్ కి హోస్టింగ్ సర్వర్స్ ని లింక్ చేస్తే వెబ్ సైట్ లైవ్ అవుతుంది. అప్పుడు మీరు మీకు నచ్చినట్టు బ్లాగ్ ని డిజైన్ చేసుకోవచ్చు.
ఫ్రీగా బ్లాగ్గింగ్ చేస్తే సక్సెస్ అవుతామా? డబ్బు ఖర్చు పెడితే సక్సెస్ అవుతామా?
మనం  ఇంతకూ ముందే చెప్పుకున్నట్లు ఫ్రీగా ఇచ్చే సర్వీసెస్ లో మనకి లిమిటేషన్స్ ఉంటాయి. మనీ స్పెండ్ చేసే వాటిల్లో మనకి ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం నీట్ గా మన బ్లాగ్ ని ప్రెసెంట్ చేయవచ్చు. చాలా మంది నాకు తెలిసిన వాళ్లు ఫ్రీగా మొదలుపెట్టి నిదానంగా పెయిడ్ వాటిల్లోకి మారి సక్సెస్ అయ్యారు. అలా చాలా మందే ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి.
ఒక బ్లాగ్ సక్సెస్ కావటానికి చాలా కారణాలు వుంటాయి. వాటిల్లో బ్లాగ్ లోడ్ అయ్యే స్పీడ్ కూడా ఒక కారణం. అన్నింటికన్నా మన బ్లాగ్ కంటెంట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి వీటన్నిటి గురించి తెలుసుకొని, నిదానంగా నిర్ణయం తీసుకోని, సక్సెస్ అవ్వండి. Wish you All the Best .. . జై హింద్.  
Share:

No comments:

Post a Comment

Popular Posts