How to start a free blog with Blogger in Telugu by Blogger VJ

How to start a free blog with blogger by blogger VJ
How to start a free blog with blogger by blogger VJ

ఫ్రీ గా బ్లాగ్గింగ్ చేయటం ఎలా? అని మనం ఇంతకు ముందు ఆర్టికల్లో చెప్పుకోవడం జరిగింది. అందులో blogger.com, wordpress.org అని రెండు ఆప్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ రోజు blogspot/ blogger గురించి తెలుసుకుందాం. blogger.com లో బ్లాగ్గింగ్ ఎలా చేయాలి? బ్లాగర్ ప్లాట్ఫాం ఎలా ఉంటుంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Blogspot లో మనం ఫ్రీగా బ్లాగ్గింగ్ చేయవచ్చు. Blogspot నే blogger.com అని కూడా అంటారు. ఇందులో .blogspot.com అనే ఎక్స్టెన్షన్ తో ఒక నేమ్ ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఫ్రీ హోస్టింగ్ కూడా చేయవచ్చు. అన్నట్టు ఇది Google Product. Blogspot.com ని గూగుల్ కొనుక్కొని మెయిన్ టైన్ చేస్తుంది. Blogspot phython ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధారంగా పని చేస్తుంది.
యూసర్ ఇంటర్ఫేస్, థీమ్ అంత xml లో డిజైన్ చేయబడి వుంటుంది. Blogspot లో మనం Blog ఓపెన్ చేయటానికి ఓక్ gmail అకౌంట్ ఉండాలి. చాలా సులభంగా మనం blogspotలో ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయవచ్చు. ఇందులోనే డిఫాల్ట్ గా కొన్ని థీమ్స్ కూడా ఉంటాయి. వాటిల్లో మనకి నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు.  
Blogspot లో మనకి ఏమి తెలియక పోయినా, MS Word ఒక్కటి తెలిసినా బ్లాగ్గింగ్ చేయవచ్చు. ఒక ఆర్టికల్ ని అందులో టైపు చేసి, ఫార్మాటింగ్ అంత చేసి (అదేనండి కలర్స్ అప్లై చేయడం, ఫాంట్ చేంజ్స్ చేయడం, సైజు, స్టైల్ చేంజ్ చేయడం వంటివి) అందులో నుండి డైరెక్ట్ గా కాపీ చేసి, పేస్ట్ చేస్తే సేమ్ టూ సేమ్ అప్లై అవుతుంది. Blogspot లో మనం క్రియేట్ చేసే పోస్తులని క్యాటగిరి వైస్ గా చేసుకోవటానికి లేబిల్స్ అని ఒక ఆప్షన్ ఉపయోగపడుతుంది.
Blogspot లో ఉన్న అడ్వాన్టేజ్ ఏంటి అంటే అన్లిమిటెడ్ స్పేస్ మనకి దొరుకుతుంది. అంతే కాకుండా గూగుల్ ప్రోడక్ట్ అవ్వడం వలన గూగుల్ లో త్వరగా ర్యాంకింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనకి బ్లాగర్ టెంప్లేట్స్ అని మనం బయటి నుండి టెంప్లేట్స్ డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయవచ్చు. Blogspot ఫ్రీ అయినప్పటికీ ఇందులో కూడా మనం యాడ్స్ పెట్టుకుని ఎర్నింగ్స్ చేయవచ్చు. కాబట్టి ఫ్రీగా మొదలుపెడతాను అనుకునే వాళ్లు Blogspot ని ఉపయోగించుకోవచ్చు.
అయితే ఈ అప్లికేషన్ లో కూడా కొన్ని డ్రాబాక్స్ ఉన్నాయి. థీమ్స్ మనకి నచ్చినట్టుగా చేసుకొని, బ్లాగ్ కస్టమైజ్ చేసుకోవటానికి లిమిటేషన్స్ ఉన్నాయి. కొంచెం టెక్నికల్ పరిజ్ఞానం పై కూడా అవగాహనా పెంచుకోవాలి. ఇందులో కూడా అన్లిమిటెడ్ పోస్టులు, పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే SEO పరంగా కొన్ని టెక్నికల్ గా చేయటానికి అంతగా కుదరదు. ఇది కేవలం బ్లాగ్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. కనీ ఎక్కడ వెబ్ సైట్ లుక్ అనేది తీసుకురాలెం. ఒక వేళ అలా కావాలి అంటే అమౌంట్ పే చేసి టెంప్లేట్స్ పర్చేస్ చేయాలి. కానీ బిగినర్స్ కి బ్లాగర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బ్లాగ్గింగ్ ఎలా చేయాలి అనేటువంటి ఈ Blogspot చక్కగా ఉపయోగపడుతుంది.
ఇది Blogspot కి సంబంధించిన ఓవర్ వ్యూ ఇన్ఫర్మేషన్. దీనీ పై పూర్తిగా A-Z ప్రతి టాపిక్ గురించి ముందు ముందు మరిన్ని ఆర్టికల్స్ వ్రాస్తాను. సో ఫ్రీగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళకి blogspot ట్రై చేయోచ్చు . జై హింద్.
Share:

No comments:

Post a Comment

Popular Posts