What are the skills learn in Digital Marketing in Telugu | Blogger VJ

What are the skills learn in Digital Marketing in Telugu | Blogger VJ
What are the skills learn in Digital Marketing in Telugu | Blogger VJ

హాయ్ ! డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి modules ఉంటాయి? అసలు Digital Marketing ఎలా నేర్చుకోవచ్చు? అనేటువంటి టాపిక్స్ గురించి తెలుసుకున్నారు కదా! ఒకవేళ ఆ పోస్ట్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటె, వారికోసం ఆ పోస్ట్ యొక్క లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.  ఈ పోస్ట్ లో అనే టాపిక్స్ గురించి తెలుసుకుందాం. “డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటానికి కావాల్సిన స్కిల్స్” ఎంతో చూద్దాం.

Important Skills to Learn Digital Marketing? | డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటానికి కావాల్సిన స్కిల్స్?


Creative Content Writing

డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ అనేది చాల కీరోల్ ప్లే చేస్తుంది. మరి అలాంటప్పుడు మీకు కంటెంట్ ని క్రియేట్ చేయగలగాలి. అలాగని మీరేమి Trivikram లాగా, లేదా Paruchuri Brothersలాగా రాయాలని కాదు. మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి (తెలిసి ఉండాలి).
టిప్: అందుకోసం మీరు ఆల్రెడీ రాసినటువంటి ఆర్టికల్ ని కాపీ పేస్టు చేసుకొని, దాన్ని rewrite చేయడం మొదలుపెట్టండి. Rewrite చేయడం అంటే వాళ్ళు రాసిన పాదాలను ఆ వాక్యానికి తగ్గట్టుగా అదే అర్థం వచ్చే విధంగా వ్రాయాలి.

WordPress Management

WordPress అనేది చాలామంది డిజిటల్ మర్కేటర్స్ use చేసేటువంటి టూల్. ఎందుకంటే WordPress తో మనం చాలా తక్కువ సమయంలో వెబ్ సైట్స్ ని క్రియేట్ చేయగలం. ప్రత్యేకించి WordPress SEO కి అనుగుణంగా ఉన్నటువంటి CMS అప్లికేషను. దీనిని కేవలం వెబ్ సైట్స్ కోసం మాత్రమే కాకుండా బ్లాగ్ క్రియేషన్ కోసం కూడా ఉపయోగిస్తారు. WordPress ద్వారా వెబ్ సైట్ క్రియేట్ చేయటానికి మనం డెవలపర్ కావాల్సిన అవసరం లేదు. కానీ wordpress ని అర్థం చేసుకుంటే చాలు.

Photo Editing Skills

ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ అన్నం కదా అని మీరు Graphic Designer కానవసరం లేదు. (నిజానికి నేను మీకు ఈ విషయం చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనకి మొబైల్స్ లో చాలా అప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి.) బేసిక్స్ తెలిసి ఉంటె చాలు. ఎందుకంటే ఒక ఇమేజ్ కొన్ని వేల పదాలకి సమానం.

Data Analytics

Data Analytics అంటే అదేదో టెక్నాలజీ కాదు. గూగుల్ అనలిటిక్స్ అనే టూల్ ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన టార్గెట్స్ ని రీచ్ అవ్వటానికి మరింత తోడ్పడుతుంది. ఇందు కోసం మనకి గూగుల్ అనలిటిక్స్ సర్టిఫికేషన్ అవసరం లేదు. కానీ మనం ఆ టూల్స్ పై work చేస్తూ ఉంటె తరువాత మాస్టర్ అవుతాము.

Passion

Passion ... ఈ మాట వినటానికి చాలా సింపుల్ గా ఉన్నపటికీ ఏదైనా నేర్చుకోవటానికి Passion అనేది ఉండాలి. ఎందుకంటె మీకు Passionate కాకపోతే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేరు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకసారి, ఒకేసారి నేర్చుకునేది కాదు. ప్రతిరోజూ నేర్చుకోవాలి.
టాప్: పాపులర్ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ ని subscribe చేసుకోండి(updates కోసం మది కూడా subscribe చేసుకోండిJ).

Learn by Doing

చెప్పిన టాపిక్ ని అప్లై చేయకపోతే మనం పూర్తిగా నేర్చుకున్నట్లు కాదు. మనం ఈ సిరీస్ లో చాలా టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. కానీ మీరు ఎప్పుడైతే తెలుసుకున్న దానిని అప్లై చేసినప్పుడే నిజంగా నేర్చుకున్నట్లు.
టిప్: మేము చెప్పే ప్రతి టాపిక్ ని Practice చేయండి.

Urge to learn & Stay Updated  

నేర్చుకోవాలని తపన & నిరంతరం అప్డేట్ గా ఉండటం అనేది కంపుల్సరిగా ఉండవలసిన లక్షణం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎప్పటికి అప్పడు మారిపోతుంటుంది. మీరు ప్రతిరోజూ నేర్చుకోవాలి.
ఉదాహరణకి ఈ పోస్ట్ వ్రాసే సమయానికి ఫేస్బుక్ users డేటాని కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ అనే సంస్థ misuse చేసింది అని ఫేస్బుక్ ఒప్పుకుంది. తరువాత తన అల్గారిథం ని చేంజ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్న లేదా మీ సలహాలు సూచనలను కామెంట్స్ లో తెలియచేయండి. ధన్యవాదాలు.
Share:

No comments:

Post a Comment

Popular Posts