What is Email Marketing? Explained in Telugu | Blogger VJ


What is Email Marketing? Explained in Telugu | Blogger VJ
What is Email Marketing? Explained in Telugu | Blogger VJ
ప్రతీ రోజు మెయిల్ ఓపెన్ చేయగానే, మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ అయ్యింది.10 నిమిషాలలో మీ లోన్ ఆన్లైన్ లో అప్రూవల్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డు  రెడీ అయ్యింది అని మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్ని కూడా ఈమెయిలు మార్కెటింగ్ లో భాగంగా మనకి వస్తూ ఉంటాయి. అసలు ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ వలన ఉపయోగం ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాలు చూద్దాం! హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ లో భాగంగా ఈ పోస్టులో email marketing గురించి తెలుసుకుందాం.

ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏమిటి?  

సింపుల్ గా చెప్పాలంటే, ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి మన కస్టమర్స్ కి మనం ఈమెయిలు ద్వారా తెలియచేయటానికి ఈమెయిలు మార్కెటింగ్ అంటారు. మనం ఒక బ్రాండ్ ని create చేయాలి అన్నా, ప్రమోట్ చేయాలి అన్నా ఈమెయిలు మార్కెటింగ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనం నేరుగా మన కస్టమర్ లేదా subscribers కి నేరుగా ఈమెయిలు ద్వారా సమాచారాన్ని చేరవేయవచ్చు. ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనం మన కస్టమర్స్ కి అందుబాటులో ఉండవచ్చు.

ఈమెయిలు మార్కటింగ్ వలన ఉపయోగం ఏంటి?

ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనకి మన కస్టమర్ కి మధ్య ఉన్న రేలషన్ మరింత బలంగా అవుతుంది. కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. మన కస్టమర్ కి మన బ్రాండ్ లేదా కంపెనీ పై నమ్మకాన్ని పెంచటంలో తోడ్పడుతుంది. అయితే ఈ మధ్య ఈమెయిలు మార్కెటింగ్ అంటే కేవలం కమర్షియల్ మెసేజెస్ ద్వారా advertisement, బిజినెస్ సేల్స్ కి సంబంధించిన మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయి.  బ్లాగ్స్ కి సంబంధించిన ఈమెయిలస్ చూసినట్లయితే అందులో వాళ్లు రీసెంట్గా పోస్ట్ చేసిన పోస్టు యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మెయిల్స్ మనం పొందుతుంటాం. ఉదాహరణకి మీరు మా పోస్టులు కూడా అలాగే పొంది ఉండవచ్చు!

ఈమెయిలు మార్కెటింగ్ ఎలా చేయాలి?

మనం జిమెయిల్ ద్వారా కేవలం ప్రతీ రోజు కేవలం 500 మెయిల్స్  మాత్రమే పంపగలం. మరి మీ దగ్గర 2000 మంది కస్టమర్స్ లేదా వెబ్ సైట్ విసిటర్స్ ఉంటె మరి ఎలా? అంత మందికి ఎవరికీ వాళ్ళకి ఈమెయిలు పంపినట్టు ఉండే కొన్ని ఈమెయిలు మార్కెటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని టూల్స్ ఎంటో చూద్దాం.
  1. MailChimp(free)
  2. Mailrelay(free)
  3. Aweber(paid)
  4. Drip  (paid)
  5. ConvertKit (paid)
ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కానీ ఇవి పాపులర్ టూల్స్. వీటి గురించి ముందు ముందు వివిరంగా పోస్ట్లు చేయటానికి ప్రయత్నిస్తాం.

ఈమెయిలు మార్కెటింగ్ ఎన్ని రకాలు?

ఈమెయిలు మార్కెటింగ్ లో మనకి ప్రధానంగా 6 రకాల ఈమెయిలస్ ఉన్నాయి. అవి:
  1. Email Newsletters
  2. Digests
  3. Dedicated Emails
  4. Lead Nurturing
  5. Sponsorship Emails
  6. Transactional Emails

ఈ ఈమెయిలస్ ఎలా ఉపయోగపడతాయో, వీటిని ఎలా ఉపయోగించాలో చూడటానికి ఇక్కడ ఉన్న లింక్ పై click చేయండి.

Types of Emails used in Email Marketing

ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

No comments:

Post a Comment

Popular Posts