What is SEO (Search Engine Optimization)? Explained in Telugu | Blogger VJ

What is SEO (Search Engine Optimaization)? Explained in Telugu | Blogger VJ
What is SEO (Search Engine Optimization)? Explained in Telugu | Blogger VJ

మనకి దేని గురించి అయిన తెలియకపోతే మనం వెంటనే ఏం చేస్తాం? మన మొబైల్ లోనో లేదా కంప్యూటర్ లోనో గూగుల్ లో search చేస్తాం, అవునా! అలాగే మన కస్టమర్స్, లేదా మన క్లైంట్స్ వెబ్ సైట్ కూడా అలాగే రావాలి అని ఎవరైనా అనుకుంటారు, కదా! మరి అది ఎలా సాధ్యం. 
ఉదాహరణకి మీరు ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తున్నారు అనుకుందాం. ఎవరైనా గూగుల్ లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ గుంటూరు అని టైపు చేసి search చేస్తే మీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వెబ్ సైట్ ఫస్ట్ రావాలి అంటే ఎం చేయాలి? అంటే అలా రావాలి అంటే మనం search engine optimization అని అంటారు. దీనినే SEO అని కూడా అంటారు. 
మరి SEO ఎలా చేయాలి? SEO చేయటానికి ఎంత ఖర్చు అవుతుంది? SEO చేస్తే ర్యాంకింగ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది? ఇలాంటి ఎన్నో విషయల గురించి ఈ పోస్ట్లో చూద్దాం ! SEO అనేది కొంత టెక్నికల్ పార్ట్ కి సంబంధించిన విషయం. కానీ అదేదో అర్థం కానీ విషయం మాత్రం కాదు. SEO మనం చేసుకోవచ్చు. 
ఒక వేళ మనకి చేయటానికి టైం లేకపోయినా, చేయటం కుదరకపోయినా ఒక SEO ఎక్స్పర్ట్ ని హైర్ చేసుకోవచ్చు లేదా SEO ఏజెన్సీ వల్ల ద్వారా చేయవచ్చు.
SEO అనేది మనం వెబ్ సైట్ డొమైన్ (వెబ్ సైట్ పేరు) తోనే మొదలవుతుంది. SEO లో WordPress వెబ్ సైట్ అయితే ఇంకా ఎన్నో అదనపు సౌకర్యాలుంటాయి. అంటే HTML కోడింగ్ లో చేయవలసిన SEO టెక్నిక్స్ చాలా వరకు చేసి ఉంటాయి. తరువాత keywords గురించి కొంత రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. రెగ్యులర్ గా వెబ్ సైట్ నందు కంటెంట్ అప్డేట్ చేయాలి. మన వెబ్ సైట్ ని search engines కి సబ్మిట్ చేయాలి. 
ఒకసారి search engines కి వెబ్ సైట్ ని సబ్మిట్ చేసాక, ఆయా search engines యొక్క crawlers మన వెబ్ సైట్ ని రీడ్ చేసి వాటి డేటాబేస్ లో ఇండెక్స్ చేసుకుంటాయి. గూగుల్ అయితే ఒక పేజిని ఇండెక్స్ ర్యాంకింగ్ చేయటానికి సుమారుగా 200 విషయాలని పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఇవి ఎపటికి అప్పుడు మారిపోతూ ఉంటాయి.
ఇది ఒక నిరంతర ప్రక్రియ. మనం రెగ్యులర్ గా మన వెబ్ సైట్ ని అప్డేట్ చేయడం అంటే ఎలా చేస్తాము? అందుకోసమే పెద్ద పెద్ద బిజినెస్ వెబ్ సైట్స్ బ్లాగ్స్ ని రేగులర్ గా maintain చేస్తూ ఉంటాయి.  SEO లో మనకి బిజినెస్ కి కావాల్సిన keywords ని సెలెక్ట్ చేసుకొని వాటిని మన వెబ్ సైట్ కోసం optimize చేయాలి. ఇంకా meta tags, meta descriptionవంటివి on-page optimization చేస్తాము.  ఇలా రకరకాల పద్దతుల ద్వారా మనం మన వెబ్ సైట్ ని SEO ఫ్రెండ్లీగా రెడీ చేయాలి.

SEO చేయటం ద్వారా మనకి కలిగే ఉపయోగం ఏంటి? 

మన వెబ్ సైట్ ద్వారా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని సేల్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఈ డిజిటల్ యుగంలో ప్రతీ దానికి గూగుల్ పై ఆధారపడిన రోజులలో వెబ్ సైట్ ఎంత అవసరమో, SEO కూడా అంతే అవసరం. ఇందువల్ల మన బిజినెస్ డెవలప్ అవ్వాలి. వెబ్ సైట్ వల్ల మనకి ఒక రెండు లీడ్స్ వచ్చిన చాలు. మన వెబ్ సైట్ create చేసి, SEO చేసిన ప్రయోజనం జరిగినట్టే. అంతే కదా! 
కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ లో SEO కూడా ఒక భాగమే. మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ప్రతీ మాడ్యుల్ ని మనం విడివిడిగా చూడకూడదు. ఎందుకంటే కొన్ని మన బిజినెస్ brand విలువని create చేస్తాయి. కొన్ని లీడ్స్ తీసుకురావటంలో ఉపయోగపడతాయి. కొన్ని డైరెక్ట్ గా సేల్స్ చేయటంలో ఉపయోగపడతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

No comments:

Post a Comment

Popular Posts