What is SEM ? What is SMM? in Telugu by Blogger VJ

What is SEM ? What is SMM? in Telugu by Blogger VJ
What is SEM ? What is SMM? in Telugu by Blogger VJ

మనం ఇంతకూ ముందు పోస్టులలో SEO గురించి SOCIAL MEDIA OPTIMIZATION ల గురించి తెలుసుకున్నాం. అయితే మనం మొదటి నుండి డిజిటల్ మార్కెటింగ్... డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తున్నాం కదా మరి మనం ఇంతవరకూ మార్కెటింగ్ చేయలేదు కదా అని మీకు సందేహం రావచ్చు. అవును ఇంతవరకూ మనం మార్కెటింగ్ చేయలేదు. ఈ పోస్టులో SEARCH ENGINE MARKETING గురించి, SOCIAL MEDIA MARKETING లా గురించి  తెలుసుకుందాం.

SEARCH ENGINE MARKETING అంటే ఏమిటి?

పేరులోనే ఉంది SEARCH ENGINE ద్వారా మన ప్రోడక్ట్ ని  మనం మార్కెటింగ్ చేస్తాం. అయితే ఇందు కోసం మనం డబ్బు ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి మనం గూగుల్ లో ఒక మొబైల్ కోసం సెర్చ్ చేసాం అనుకుందాం. అప్పుడు మనకి మొబైల్స్ యొక్క వెబ్ సైట్స్ తోపాటుగా మనకి అమెజాన్, ఫ్లిప్కర్ట్ వంటి eCommerce వెబ్ సైట్ ల లింక్స్ కూడా కనిపిస్తాయి. వీటిని SEARCH ENGINE MARKETING చేయటం ద్వారా మొదట ఈ లింక్స్ వస్తాయి. అంటే మన ad అనేది ఫస్ట్ పేజిలో ఎలాంటి SEO చేయవలసిన అవసరం లేకుండా మన వెబ్ సైట్ SEARCH ENGINE ఫస్ట్ పేజి లో మన ad వస్తుంది.
అయితే మనకి చాలా SEARCH ENGINES అందుబాటులో ఉన్నాయి. వాటిలో Google, Bing, Yahoo, Ask.com, AOL.com, Baidu లు టాప్ SEARCH ENGINES. వీటిలో మనం advertisement చేయటం ద్వారా SEARCH ENGINE MARKETING చేయవచ్చు. అయితే SEARCH ENGINE MARKETING ద్వారా మన వెబ్ సైట్ SEARCH ENGINES లో టాప్ లో రావటం ద్వారా HIGH CTR(CLICK THROUGH RATE) సాధ్యపడుతుంది.
SEARCH ENGINE MARKETING లో Google, Bing & Yahoo లు టాప్ SEARCH ENGINES. Google Ad-words ద్వారా మనం గూగుల్ లో మనం ad ఇవ్వవచ్చు. BING లేదా YAHOO ADS ద్వారా మనం BING / YAHOO లలో SEARCH ENGINE MARKETING చేసి, మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని మార్కెటింగ్ చేయవచ్చు.

SOCIAL MEDIA MARKETING అంటే ఏమిటి?

సోషల్ మీడియా platform ల ద్వారా మనం మార్కెటింగ్ చేయటాన్ని SOCIAL MEDIA MARKETING అని అంటారు. ఇందులో మనకి Facebook, Twitter, YouTube, Instagram వంటి ఫేమస్ సోషల్ మీడియా platforms లో మనం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేసుకుంటాం. ఇలా చేయటం ద్వారా డైరెక్ట్ గా కస్టమర్ కి మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించగలం.  
అలాగే వారితో ఇంటరాక్ట్ అవ్వటానికి, ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి ఉపయోగిస్తాము. ఈ SOCIAL MEDIA MARKETING లో Facebook ద్వారా మనకి ఎక్కువగా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి వాళ్ళని మోటివేట్ చేయటానికి అవకాశం ఉంటుంది. అలతే twitter మన దగ్గర తక్కువ, కానీ ప్రొఫెషనల్ పీపుల్ ట్విట్టర్ యూస్ చేస్తేరు.  అలాగే YouTube లో మార్కెటింగ్ చేయటం కోసం పైన చెప్పినట్టు గూగుల్ ad-words ద్వారా ప్రమోట్ చేయవచ్చు.  ఈ పోస్టులో కేవలం SEARCH ENGINE MARKETING, SOCIAL MEDIA MARKETING లా గురించి ఇంట్రడక్షన్ గా మాత్రమే చెప్తున్నాం. ముందు ముందు డీటెయిల్ పోస్టులను అందించగలం. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

No comments:

Post a Comment

Popular Posts