What is Web Designing ? How to design Website? Explained in Telugu | Blogger VJ


What is Web Designing ? How to design Website? | Blogger VJ
What is Web Designing ? How to design Website? | Blogger VJ
వెబ్ సైట్ డిజైనింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక ముఖ్యమైన భాగం. ఇందు కోసం మనం WordPress అనే cms వెబ్ సైట్ డిజైనింగ్ టూల్ ని ఉపయోగిస్తాము. WordPress యే ఎందుకు అంటే WordPress ద్వారా వెబ్ సైట్ చేయడం చాలా ఈజీ. అంటే కాదు మనకు SEO (search engine optimization)లో వెబ్ సైట్ ర్యాంకింగ్  చేయడంలో WordPress వెబ్ సైట్స్ చక్కగా ఉపయోగపడతాయి. ఈ పోస్టులో WordPress ద్వారా వెబ్ సైట్ create చేయటం ద్వారా వచ్చే ఉపయోగాలు? మిగితా మార్గాల ద్వారా ఏ విధంగా వెబ్ సైట్ చేసుకోవచ్చు? అసలు డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్ సైట్ అవసరం ఏంటి అనేవి చూద్దాం.

అసలు వెబ్ సైట్స్ ఎందుకు create చేసుకోవాలి? 

ఒక బిజినెస్ కి వెబ్ సైట్ అవసరమా? అనే విషయం చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ మనం ఎందుకు చేస్తాం? మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని సేల్ చేసుకోవటానికి. అలా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని కస్టమర్ కొనుగోలు చేయాలి అంటే మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి అతనికి తెలిసి ఉండాలి.  మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి ఎక్కడ ఉన్న కస్టమర్ ఎలా తెలుసుకుంటాడు? మనకి కాల్ చేసి వివరాలు తెలుసుకుంటాడు అనుకుందాం! అల కాల చేసినప్పుడు మనం ఎంత వరకూ డిటైల్డ్ గా చెప్పగలం. అదే వెబ్ సైట్ ఉంటె మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనం అందులో పొందుపరచవచ్చు. 

వెబ్ సైట్ వలన ఉపయోగాలు ఏంటి?

మన బిజినెస్ కి వెబ్ సైట్ ఉంటె కస్టమర్ కి కొంత నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే అందులో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఎందుకంటే డిజిటల్ రంగం లో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో, అన్ని రకాల మోసాలకి ఆస్కారం ఉంది.
అలాగే మనం ఒక కస్టమర్ యొక్క వివరాలు అంటే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటివి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పొందాలి అంటే మనకి ఒక వెబ్ సైట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పుడు వెబ్ సైట్ చేయడం అంటే కష్టం మరియు ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు కంపెనీలమధ్య పోటి, అందుబాటు లో ఉన్న ఆధునిక టెక్నాలజీ వెబ్ సైట్ డిజైనింగ్ ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అన్ని రంగాలు డిజిటల్ లోకి మారిపోతున్నాయి. అలాంటప్పుడు మీరు మీ బిజినెస్ కి వెబ్ సైట్ కూడా చేయించుకోకపోతే వ్యాపారంలో వేనుకపడిపోతారు. మన వెబ్ సైట్ ద్వారా కూడా మనం లీడ్స్ పొందవచ్చు. మన వెబ్ సైట్ లో కాంటాక్ట్ పేజి ద్వారా మన మెయిల్ కి లీడ్స్ వస్తాయి. కాబట్టి ప్రతీ బిజినెస్ కి వెబ్ సైట్ ఖచ్చితంగా ఉండాలి. 

వర్డుప్రెస్సు అంటే ఏంటి? 

అయితే WordPress ద్వారా వెబ్ సైట్ create చేయటం చాలా ఈజీ. ఎందుకంటే ఇందులో మనకి ఎలాంటి టెక్నికల్ knowledge లేకపోయినా మనం వెబ్ సైట్ create చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లో కొన్ని వేల లెసన్స్ WordPress ద్వారా ఎలా వెబ్ సైట్ డిజైన్ చేయాలి అని ఉన్నాయి. WordPress ద్వారా మనకి నచ్చిన థీమ్స్ (డిజైన్స్) ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన అవసరాలకి తగినట్టుగా అదనపు హంగులను ప్లగిన్స్ ద్వారా ఫ్రీగా add చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంటర్నెట్లో ఉన్న 25% వెబ్ సైట్స్ WordPress లో చేసినవే!

ఇంకా వేరే కంపెనీలు ఏమన్నా ఉన్నాయా?

WordPress కాకుండా కూడా మనం మరికొన్ని మార్గాల ద్వారా కూడా వెబ్ సైట్ ని చేసుకోవచ్చు. ఇక్కడ వాటిల్లో ప్రధానమైనవి డిజైనర్స్  ద్వారా చేయించుకోవటం. లేదా మనకి ఇప్పుడు ఇంటర్నెట్ లో godaddy.com, wix.com వెబ్ సైట్ లు వెబ్ సైట్ డిజైన్ సేర్విసులని అందిస్తున్నాయి. ఈ కంపెనీల వాళ్లు నెలకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఇవే కాకుండా మనకి freelancer వెబ్ సైట్స్ ద్వారా కూడా వెబ్ సైట్స్ ని మన బడ్జెట్ లో చేసి ఇచ్చే వారు ఉన్నారు.
WordPress వెబ్ సైట్ మనకి ఈజీ గా SEO అవ్వటానికి ఉపయోగాపడతాయి. అంటే కాకుండా వీటికి సంబంధించిన సమస్య ఏదన్న వచ్చిన ఇంటర్నెట్లో చాలా మంది మనకి సహాయం చేయగలరు. తరువాత ముఖ్యమైనది మిగితా వాటితో పోలిస్తే మనకి ఖర్చు తక్కువగా అవుతుంది. అతి తక్కువ సమయంలో మనం వెబ్ సైట్ ని కూడా రెడీ చేసుకోవచ్చు.
అయితే మనకి ఇందు కోసం ఎలాంటి టెక్నికల్ knowledge అక్కరలేదు. తరువాత కొంచెం మనం WordPress ని అర్థం చేసుకోగలిగితే చాలు. ఒకవేళ మనకి అర్థం కాకపోయినా పర్వాలేదు, కొన్ని కంపెనీలు అతి తక్కువ కాస్ట్ కి మనకి చేసి ఇస్తాయి. తరువాత మనం వాటిని ఎలా ఉస్ చేయాలి అని ట్రైనింగ్ కూడా ఇస్తాయి. కాబట్టి మనకి డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్ సైట్ చాలా అవసరం, ఇంకా ముఖ్యం కూడా. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

No comments:

Post a Comment

Popular Posts