Free Blogging Course | Lesson #10 How to Customize Theme in Blogger in Telugu | Blogger VJ

హాయ్ మనం ఇంతకు ముందు ఒక కస్టమ్ టెంప్లేట్ ని బ్లాగ్ కి ఎలా అప్లై చేయటం తెలుసుకున్నాం. అయితే కేవలం టెంప్లేట్ అప్లోడ్ చేయటంతో మన పని అయిపోలేదు. ఇంకా కొన్ని కష్టమైజషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్ లో ఎలా కష్టమైజషన్ చేయాలో తెలుసుకుందాం. దాదాపుగా అన్ని blogger లో టెంప్లేట్స్ కష్టమైజేషన్ ఒకేలా ఉంటుంది.
మరి కష్టమైజషన్ ఎలా చేయాలి? మీకు ఎలా చేయాలో తెలియదు కదా? మరి ఎలా? సాదారణంగా మనుషులకి ఒక క్రొత్త పని మొదటి నుండి ఎలా చేయాలో తెలియదు అని అంటూ ఉంటారు. అప్పుడు మనం కాపీ చేస్తే సరిపోతుంది కదా. నేర్చుకోవటం కూడా అదే కదా. అవును ఇది ఇలా చేయాలి అని మనకి నేర్పించేవాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలి అని చెప్తారు కదా.
కాబట్టి నేను ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ని ఎలా ఎడిట్ చేయాలో చెప్తునాను. అందుకోసం నేను ఆ టెంప్లేట్ ప్రివ్యూ ని ఓపెన్ చేసి, దానిని చూసి మన బ్లాగ్ ని కష్టమైజషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగ నేను ఆ టెంప్లేట్ కి సంబంధించిన పేజిని ఓపెన్ చేశాను. అందుకు సంబంధించిన లింక్ ని ఇక్కడ ఇస్తున్నాను. Neko దీని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మీ బ్లాగ్ ఓపెన్ చేయండి. మీ బ్లాగ్ ఇలా కనిపిస్తుంది.
Blogger లో లాగిన్ అయిన తరువాత లెఫ్ట్ సైడ్ బార్ లో కనిపించే Layout అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

మనం ఇంత వరకూ డిఫాల్ట్ గా ఉన్న టెంప్లేట్స్ ని ఉపయోగించాం. అందులో ఉండే కొన్ని విడ్జెట్స్ కూడా ఇందులో ఉండిపోతాయి. వాటిని ముందుగ రిమూవ్ చేయండి. నేను మీకు ఒకటి ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. మీరు మిగిలినవి అన్ని రిమూవ్ చేయండి.
ముందుగా నేను మన బ్లాగ్ లో కనిపిస్తున్న Report Abuse అని ఉన్న ఆప్షన్ ని రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటె ఈ విడ్జెట్ మనం డౌన్లోడ్ చేసుకున్న టెంప్లేట్ లో లేదు కాబట్టి దీనిని నేను రిమూవ్ చేస్తున్నాను.
మీ బ్లాగర్ లో layout లో ఈ విధంగా కనిపిస్తుంది. పైన ఇమేజ్ లో  మీకు కనిపిస్తున్న Report Abuse అని ఉన్న విడ్జెట్ లో edit అని ఒక బటన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది.

ఇక్కడ మీకు 3 బటన్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి.
వీటిల్లో Remove బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంకొక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
OK పై క్లిక్ చేస్తే ఆ పాపప్ క్లోస్ అవుతుంది. విడ్జెట్ కూడా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు బ్లాగ్ రిఫ్రెష్ చేస్తే మీకు ఆ విడ్జెట్ కనిపించదు.
ఇదే విధంగా నేను ఇంకొన్ని విడ్జెట్స్ కూడా రిమూవ్ చేస్తున్నాను. Search This Blog, Blog Archive, About Me, Adsence Blog Archive, Attribution, Follow by Email, Featured Post విడ్జెట్స్ రిమూవ్ చేస్తాను. అప్పుడు మీకు లేఔట్ ఇలా కనిపిస్తుంది.
ఇపుడు ఒకసారి బ్లాగ్ రిఫ్రెష్ చేస్తే మీకు ఈ విధంగా మీకు కనిపిస్తుంది.
ఇప్పుడు లోగో చేంజ్ చేయండి. మనం ఇంతకూ ముందు లోగో ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం. కాబట్టి మీరు లోగో చేంజ్ చేయండి. ప్రతీది నేను చెప్పటం వల్ల ఈ ఆర్టికల్ చాలా పెద్దది అవుతుంది అర్థం చేసుకోగలరు. మీరు లోగో చేంజ్ చేసిన తరువాత మీకు బ్లాగ్ లో ఇలా కనిపిస్తుంది.
అదే విధంగా మనకి టెంప్లేట్ లో మనకి ఒక స్లయిడర్ ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. అయితే ఇక్కడ మీరు మీకు స్లయిడర్ లో కావాల్సిన ఇమేజస్ ముందుగానే డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఈ టెంప్లేట్ లో మీకు 5 ఇమేజస్ కావాలి. కాబట్టి నేను కూడా 5 ఇమజేస్ డిజైన్ చేసి పెట్టుకునాను.

ఇప్పుడు మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బార్ లో theme అని కనిపిస్తుంది కదా. దాని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

ఇక్కడ కనిపించే Edit HTML అని ఉన్న బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ముందుగా ఆ ఎడిటర్ పై మౌస్ క్లిక్ చేసి ctrl+f ద్వారా ఫైండ్ ఆప్షన్ ఏనాబుల్ అవుతుంది. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న కర్సర్ లో
Content Slider అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
మీరు ఎంటర్ ప్రెస్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీకు content slider అని సెలక్ట్ అయ్యి కనిపిస్తుంది. కొంచెం జాగ్రతగా పరిశిలిస్తే మీకు అక్కడ slides గురించి కొంత కోడింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు posts అని కనిపించే ఆప్షన్ పై రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
పైన కనిపిస్తున్న ఆప్షన్స్ లో Open Link in New Tab అని ఉంది కదా దాని పై క్లిక్ చేస్తే మీకు ఇంకొక క్రొత్త ట్యాబు లో ఓపెన్ అవుతుంది.

ఇప్పుడు New Post పై క్లిక్ చేస్తే మీకు visual composer ఓపెన్ అవుతుంది. దీనిని కేవలం ఇమేజెస్ అప్లోడ్ చేయటానికి ఉపయోగించుదాం. మనం తరువాత దీనిని వేరుగా గుర్తు ఉంచుకోవటానికి పోస్ట్ టైటిల్ దగ్గర images అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది.

ఇక్కడ మనం choose files బటన్ పై క్లిక్ చేస్తే ఫైల్ సెలెక్టర్ ఓపెన్ అవుతుంది.
ఓపెన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇమజేస్ లోడ్ అవుతాయి.

లోడింగ్ కంప్లేట్ అయ్యాక మీకు ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది.
Add Selected బటన్ పై click చేస్తే ఈ ఇమజేస్ అన్ని పోస్టులో ఇన్సర్ట్ అవుతాయి.
ఇప్పుడు మీకు ఎ ఇమేజ్ పై రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
Open Link in New Tab ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఇంకొక క్రొత్త ట్యాబు లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన ఈ ట్యాబులో పైన కనిపించే యుఆర్ఎల్ పై క్లిక్ చేసి ఆ యుఆర్ఎల్ ని కాపీ చేయండి.
ఇప్పుడు ఒక నోటేపాడ్ ఫైల్ ఓపెన్ చేసుకొని అందులో పేస్ట్ చేయండి.
అదే విధంగా మిగిలిన అన్ని ఇమజేస్ యొక్క యుఆర్ఎల్స్ కాపీ చేసి పేస్ట్ చేయండి.
ఈ విధంగా మీరు కాపీ పేస్ట్ చేసుకొని, ఆ ఫైల్ ని సేవ్ చేసుకోండి.
ఇప్పుడు మళ్ళి HTML editor ఉన్న టాబ్ ఓపెన్ చేయండి.
ఇక్కడ మీకు పైన కనిపించే చిత్రంలో సెలెక్ట్ అయ్యి ఉన్న ప్లేస్ లో మీరు కాపీ చేసిన slider 1 యొక్క యుఆర్ఎల్ లింక్ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి save theme పై క్లిక్ చేసి, ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా స్లయిడర్లో మీకు మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ అప్డేట్ అవుతుంది.
అదే విధంగా ఇప్పుడు slider 2 చేంజ్ చేద్దాం.
ఇక్కడ ఇమేజ్ లో మీకు slider2, slider3 ల కోడ్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మీరు నోట్పాడ్ లో సేవ్ చేసుకున్న యుఆర్ఎల్స్ కాపీ చేసి పేస్ట్ చేయండి.
ఎక్కడ పేస్ట్ చేయాలో క్రింద ఉన్న ఇమేజ్ లో సెలెక్ట్ చేసి ఉన్న ప్లేస్ లో పేస్ట్ చేయండి.
మళ్ళి save theme పై క్లిక్ చేసి ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు అదే విధంగా slider4, slider5 లు కూడా చేంజ్ చేయండి. అప్పుడు మీకు బ్లాగ్ ఈ విధంగా కనిపిస్తుంది.
దాదాపుగా మనం ఈ టెంప్లేట్ ని చేంజ్ చేసినట్లే. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బ్లాగ్ పేజిలు యాడ్ చేద్దాం. ఇందుకోసం ఆల్రెడీ ఒక విడ్జెట్ ఉంది. దానిని జస్ట్ ఎడిట్ చేద్దాం. layout ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
కొంచెం క్రిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇందులో మీకు పేజెస్ పై ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది.
ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మన బ్లాగ్ లో ఎన్ని పేజెస్ క్రియేట్ చేస్తే అన్ని పేజీలు కనిపిస్తాయి. ఇక్కడ ఏ పేజీలు డిస్ప్లే అవ్వాలి అని మనం అనుకుంటామో అవి మాత్రమే కనిపించేలా చేయవచ్చు. ఏ పేజి డిస్ప్లే కావాలి అను అనుకుంటామో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. దాని ఎదురుగా ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి save బటన్ పై క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది.
అప్పుడు మన బ్లాగ్ లో ఈ విధంగా కనిపిస్తుంది.
తరువాత ఫూటర్ ని చేంజ్ చేయటం ఎలాగో చూద్దాం. ఇందు కోసం మళ్ళి Theme ఆప్షన్ పై క్లిక్ చేసి Edit HTML బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా మీకు కనిపిస్తుంది.
పైన కనిపించినట్టు సెర్చ్ బార్ లో ఈ విధంగా footer-container అని టైప్ చేయండి. టైప్ చేసాక ఎంటర్ చేయండి. ఈ టెంప్లేట్ లో 2640 వ లైన్ లో మీకు ఈ విధంగా సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది.
ఇక్కడ కనిపించే ఫూటర్ ని చేంజ్ చేయవచ్చు. అయితే కొన్నిసార్లు టెంప్లేట్ క్రియేటర్స్ నుండి అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఉన్న దానిని చేంజ్ చేస్తే సరిపోతుంది.
ఇక్కడ మనకి 2 ఫూటర్స్ కనపడుతూ ఉన్నాయి. నిజానికి మనకి ఒక ఫూటర్ సరిపోతుంది. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా రెండు కావాలి అనుకుంటే మీరు కూడా రెంటిని మోడిఫై చేయవచ్చు. ముందుగా పైన కనిపించే Powered by Blogger అని ఉంది కదా దానిని మోడిఫై చేద్దాం. నిజానికి మనకి ఇక్కడ ఉన్న Powered by Blogger అని ఉన్నది అక్కరలేదు. కాబట్టి ఆ లైన్ ని తీసి వేద్దాం.
సెలెక్ట్ చేసిన భాగాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసాక save theme పై క్లిక్ చేసి ఒక్కసారి బ్లాగ్ ఓపెన్ చేసి చుడండి.
మీకు బ్లాగ్ లో ఫూటర్ చేంజ్ అవ్వకపోతే ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు రెండవ ఫూటర్ ని ఎడిట్ చేద్దాం. నేను దీనిని మోడిఫై చేశాను కదా అందుకని ఈ టెంప్లేట్ కి Design by Blogger VJ అని మార్చుతాను.
ఇక్కడ నేను బాగా అర్థం అవ్వటానికి ఆ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చెస్తునాను.

Distributed By Gooyaabi Templates | Blogger Theme By NewBloggerThemes

పైన ఉన్న కోడ్ లో Distributed By  అని ఉన్న చోట Designed by అని అదే విధంగా లింక్ దగ్గర నా బ్లాగ్ లింక్ ఇవ్వాలి, ఆ తరువాత ఉన్న Gooyaabi Templates దగ్గర Blogger VJ అని మారుస్తాను. ఒక్కసారి నేను పైన ఉన్న కోడ్ ని మార్చి ఇక్కడ ఇస్తున్నాను. దానిని సెలెక్ట్ చేసి ఉన్న చోట మార్చండి.

Designed By Blogger VJ

ఇక్కడ ఈ టెంప్లేట్ వాళ్లు ఆల్రెడీ ఒక మెసేజ్ ఇక్కడ కామెంట్ రూపంలో ఇచ్చారు. మనం ఈ లైన్ ఎడిట్ చేయటానికి మనకి పర్మిషన్ లేదు. ఎందుకంటే మనం ఈ టెంప్లేట్ ని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకున్నాం. ఒకవేళ ఈ టెంప్లేట్ కొనుకుంటే మీకు ఆ పర్మిషన్ లబిస్తుంది.
మార్చిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఈ విధంగా మనం మనకి కావాల్సినట్టుగా టెంప్లేట్ ని మోడిఫై చేసుకోవచ్చు. తరువాతి ఆర్టికల్లో సోషల్ మీడియా ఐకాన్స్, మేనుబార్ ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. ఈ టాపిక్ పై మీకు డౌట్స్ యామన్న ఉంటె కామెంట్ చేయండి.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive