Free Blogging Course | Lesson #16 | What are the important setting to change in Blogger Blog | Blogger VJ

What are the important setting to change in Blogger Blog | Blogger VJ
హాయ్! blogger లో మనం ఇంతవరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. బ్లాగర్ అప్లికేషను లో మనం కొన్ని సెట్టింగ్స్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటె ఈ సెట్టింగ్స్ మన బ్లాగ్ పెర్ఫార్మన్స్ ని మరింత పెంచాగాలవు. అసలు ఏ సెట్టింగ్స్ మనం చేంజ్ చేయాలి? ఎలా చేంజ్ చేయాలి? అని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ముందుగా blogger లో లాగిన్ అయ్యి మీకు లెఫ్ట్ సైడ్ బార్లో settings అని ఆప్షన్స్ కనిపిస్తాయి.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
ఈ విధంగా మీకు సెట్టింగ్స్ లో బేసిక్ సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఇందులో మనకి టైటిల్ (బ్లాగ్ టైటిల్), డిస్క్రిప్షన్ (బ్లాగ్ డిస్క్రిప్షన్) వంటివి కనిపిస్తాయి. వీటిని కావాలంటే మనం మార్చవచ్చు. అక్కరలేదు అనుకుంటే లైట్ తీసుకోవచ్చు. దాని తరువాత Privacy సెట్టింగ్స్ కనిపిస్తాయి. Edit పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తాయి.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
ఇక్కడ మీకు ఈ విధంగా రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిని డిఫాల్ట్ గానే వేదిలివేయడం వలన మన బ్లాగ్ SEO ఎనేబుల్ గా ఉంటుంది. తరువాత మీకు బ్లాగ్ యొక్క యుఆర్ఎల్ కిసంబంధించినది. కాబట్టి మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఎడిట్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
ఇప్పుడు మీరు చేంజ్ చేసి సేవ్ పై క్లిక్ చేస్తే ఆ యుఆర్ఎల్ సేవ్ అవుతుంది. వీటిని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తరువాత మీకు Posts, comments and sharing అని మరొక ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దాని పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
ఇక్కడ మనకి మన బ్లాగ్ లో ఎన్ని పోస్టులు డిస్ప్లే అవ్వాలి అని డిసైడ్ చేయవచ్చు. డిఫాల్ట్ గా 7 పోస్టులు ఉంటాయి. కావాలనుకుంటే మనం వాటిని చేంజ్ చేయవచ్చు. మనం వీటిని చేంజ్ చేయవలసిన అవసరం లేదు. దాని క్రింద కామెంట్స్ అని ఇంకో సెక్షన్ కనిపిస్తుంది. ఇందులో మనం ఎవరు కామెంట్ చేయాలో డిసైడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక్కడ డిఫాల్ట్ గా గూగుల్ యూసర్స్ ని కామెంట్ చేయటానికి ఎలో చేస్తుంది. మనం అలా కాదు మన బ్లాగ్ రీడర్స్ మాత్రమే కామెంట్ చేయాలి అనుకుంటే వాళ్లు కచ్చితంగా వాళ్లు లాగిన్ అవ్వవలసి ఉంటుంది. కానీ అందరు అందుకు ఇష్టపడరు. కాబట్టి మనం వీటిని కూడా లైట్ తీసుకోవచ్చు.
తరువాత Language and formatting అని మరొక ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
ఇందులో మనకి లాంగ్వేజ్ సెట్టింగ్స్ కనిపిస్తాయి. లాంగ్వేజ్ లో డిఫాల్ట్ గా English (united kingdom) అని ఉంటుంది. ఇప్పుడు దానిని కావాలనుకుంటే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం వంటి ఏ బాషనైన సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మార్చుకోవచ్చు. లేదంటే లేదు.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
మీరు సేవ్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
నేను మళ్ళి ఇంగ్లీష్ లోకి మార్చుకుంటున్నాను. తరువాత formatting లో Time Zone అని ఉంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా Pasific Time అని ఉంటుంది. మీ బ్లాగ్ టైం పసిఫిక్ టైం జోన్ లో ఉంటుంది అందుకే మీ కంప్యూటర్ టైం కి పైన ఇమేజ్ లో కనిపించే టైం లో చాలా తేడ ఉంటుంది. దానిని India Standard Time కి మార్చుకోవాలి.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు రెండు సమయాలు ఒకేలా ఉంటాయి.
What are the important setting to change in Blogger Blog | Blogger VJ
ఇలా ఎందుకు చేంజ్ చేయాలి అంటే, కొన్ని సార్లు మనం పోస్టులని షెడ్యూల్ చేయవలసి వస్తుంది. ఒకవేళ మనం చేంజ్ చేయకపోతే మనం ఒక టైం కి షెడ్యూల్ చేస్తే పోస్టులు ఇంకో టైం లో పోస్ట్ అవుతాయి. మనం ఇండియా లోనే కదా బ్లాగ్గింగ్ చేసేది! కాబట్టి మనకి ఇండియన్ టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాదాపుగా మనం చేంజ్ చేయవలసిన సెట్టింగ్స్ చేంజ్ చేసాం. మీకు search preferences ని నెక్స్ట్ ఆర్టికల్ లో క్లియర్ గా చెప్తాను. ఎందుకంటె ఇది SEO రిలేటెడ్ టాపిక్. కాబట్టి వీటిని బ్లాగ్ SEO సెక్షన్ లో ఇంక్లుడ్ చేయటం జరిగింది. ఈ విధంగా మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive