Free Blogging Course | Lesson #19 | How to link a blog / website to Google Analytics in Telugu | Blogger VJ

How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ

హాయ్!  మనం ఇంతకూ ముందు ఆర్టికల్స్ లో మన బ్లాగ్ ని గూగుల్ కి ఎలా సబ్మిట్ చేయాలి? Sitemap ఎలా క్రియేట్ చేయాలి వంటి విషయాలు తెలుసుకున్నాం. సరే తరువాత ఏంటి? ఏం చేయాలి? మన బ్లాగ్ సక్సెస్ ని కొలవటానికి లేదా మన బ్లాగ్ గ్రోత్ ని ఎలా తెలుసుకోవాలి అంటే గూగుల్ అనలిటిక్స్ ని మన బ్లాగ్ కి లింక్ చేయాలి. అవును గూగుల్ అనలిటిక్స్ టూల్ మన బ్లాగ్ ఎలా ఉంది, ఏయే పోస్టులు ఎక్కువగా రీడర్స్ చదువుతున్నారు, వంటి ఎన్నో అదనపు విశ్లేషణలని అందిస్తుంది. మరి అలాంటి గూగుల్ అనలిటిక్స్ ని ఎలా లింక్ చేయాలి అని ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ముందుగా గూగుల్ లో Analytics అని సెర్చ్ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇప్పుడు మీకు ఈ విధంగా కొన్ని రిజల్ట్స్ కనిపిస్తాయి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
మీకు మొదట కనిపించే గూగుల్ అనలిటిక్స్ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
క్లిక్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు sign up బటన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఈ విధంగా మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన బ్లాగ్ ని అనలిటిక్స్ తో లింక్ చేయటానికి ఒక ఫారం లాంటిది ఫిల్ చేయవచ్చు. మొదట మీకు వెబ్ సైట్ కోసం అనలిటిక్స్ లింక్ చేస్తున్నారా, లేదా మొబైల్ అప్ కోసం చేస్తున్నారా అని మొదటి ఆప్షన్. మనది బ్లాగ్ కాబట్టి మనం వెబ్ సైట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ డిఫాల్ట్ గా వెబ్ సైట్ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి, తరువాత మనకి Setting up your account అని కనిపిస్తుంది. ఆ ఫామ్స్ కూడా ఫిల్ చేయాలి. మొదట Account name ఇవ్వాలి. తరువాత మన బ్లాగ్ నేమ్, వెబ్ సైట్ యుఆర్ఎల్, ఇవ్వవలసి ఉంటుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
తరువాత industry category అని ఉంటుంది కదా, మీ బ్లాగ్ ఏ category కి సంబంధించినదో సెలెక్ట్ చేయాలి. దాని తరువాత reporting time సెలెక్ట్ చేసుకోవాలి. Industry లొ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిల్లో మీ బ్లాగ్ ఏ ఇండస్ట్రీ కి చెందినదో దానిని సెలెక్ట్ చేసుకోండి. తరువాత టైం జోన్, మన టైం జోన్ దగ్గర కంట్రీ(దేశం)  సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
తరువాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి అన్ని కూడా టిక్ చేసి ఉంటాయి. తరువాత మీరు Get Tracking ID అని కనిపించే బటన్ పై క్లిక్ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
క్లిక్ చేసిన తరువాత మీకు ఒక పాప్ విండో ఇలా ఓపెన్ అవుతుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
మీకు కనిపించే స్క్రోల్ బార్ ని కిందకి స్క్రోల్ చేస్తే రెండు చెక్ బాక్స్ లు కనిపిస్తాయి. వాటిని టిక్ చేస్తే మీకు క్రింద ఉన్న i accept అనే బటన్ ఆక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇక్కడ కనిపించే రెండు పాపప్స్ ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇక్కడ మనకి ఒక tracking id ఒకటి కనిపిస్తుంది. దానిని కాపీ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇప్పుడు బ్లాగర్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అందులో other పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
మీకు ఈ పేజిలో చివరన గూగుల్ అనలిటిక్స్ అని కనిపిస్తుంది. మీకు అక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. అందులో మీరు కాపీ చేసిన id ని పేస్ట్ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇప్పుడు పైన కనిపించే save settings పై క్లిక్ చేస్తే గూగుల్ అనలిటిక్స్ తో మీ బ్లాగ్ లింక్ అవుతుంది. ఈ విధంగా మనం మన బ్లాగ్ కి గూగుల్ అనలిటిక్స్ లింక్ చేయవచ్చు. ఈ ఆర్టికల్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive