Free Blogging Course | Lesson #3 | How to Add Blog Title, Description and Logo in Blogger


Free Blogging Course | Lesson #3 | How to Add  Blog Title, Description and Logo in Blogger
Lesson #3 | How to Add  Blog Title, Description and Logo in Blogger

Blogger లో ఒక బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి? అనే విషయాన్నీ మనం ఇంతకూ ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాం. మరి ఒక బ్లాగ్ క్రియేట్ చేసాం కదా! తరువాత ఏం చేయాలి? ఈ ఆర్టికల్ లో బ్లాగ్ టైటిల్, డిస్క్రిప్షన్ ఎలా వ్రాయాలి? బ్లాగ్ లోగోని ఎలా అప్లోడ్ చేయాలి? అనే విషయాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.
       మనం ఇంతకూ ముందు ఆర్టికల్ లో ఒక బ్లాగ్ Blogger లో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. కానీ ఆ బ్లాగ్ ఎలా ఉందొ మనం చూడలేదు. ఇప్పుడు అన్నింటికన్నా ముందు మన బ్లాగ్ ఎలా ఉందొ చూద్దాం.
How to Add  Blog Title, Description and Logo in Blogger
ఇక్కడ మీకు కనిపించే ఇమేజ్ లో టాప్ లెఫ్ట్ లో మీ బ్లాగ్ నేమ్ కనిపిస్తుందా? ఆ దాని కింద View blog అని ఉంది కదా! దాని పై క్లిక్ చేయండి. అప్పుడు ఇంకొక ట్యాబు లేదా విండోలో మీకు మీరు క్రియేట్ చేసిన బ్లాగ్ ఓపెన్ అవుతుంది.
How to Add  Blog Title, Description and Logo in Blogger
మీకు పైన కనిపించే ఇమేజ్ లాగా కనిపిస్తుంది. దాదాపుగా మీ బ్లాగ్ కూడా ఇలాగే కనిపిస్తుంది.

Blog Title

   మన బ్లాగ్ లో అన్నింటి కన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, బ్లాగ్ టైటిల్. అవును ఎందుకంటె బ్లాగ్ టైటిల్ మన బ్లాగ్ ని ఒక  బ్రాండ్ గా తీర్చిదిద్దవచ్చు. అందుకే ఈ ఆర్టికల్ లో బ్లాగ్ టైటిల్ యాడ్ చేయట లేదా మార్చడం వంటివి ఈ పోస్టులో చూద్దాం. మళ్ళి blogger అప్లికేషన్ కి రండి. అందులో మీకు లెఫ్ట్ సైడ్ బార్ లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటి గురించి నిదానంగా, వివరంగా రాబోయే ఆర్టికల్స్ లో తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం బ్లాగ్ టైటిల్ చేంజ్ చేద్దాం.
అందుకోసం ముందు మీరు సెట్టింగ్ అని కనిపిస్తుంది కదా ! దాని పై క్లిక్ చేయండి.
How to Add  Blog Title, Description and Logo in Blogger
మీకు పైన కనిపించే ఇమేజ్ లో టైటిల్ దగ్గర మీకు ఈ బ్లాగ్ క్రియేట్ చేసే సమయంలో మనం బ్లాగ్ టైటిల్ ని కూడా ఇస్తాం. ఒకవేళ మనం దాన్ని మార్చాలి అంటే ఇక్కడ కనిపించే టైటిల్ ప్రక్కన Edit అని ఒక లింక్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయండి.
How to Add  Blog Title, Description and Logo in Blogger
ఇక్కడ మీరు ఎడిట్ చేయటానికి ఒక ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు అక్కడ మీరు, మీకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను Test Blogger VJ అని ఉన్న దానిని Title Changer అని మారుస్తున్నాను.
How to Add  Blog Title, Description and Logo in Blogger
ఇప్పుడు దాని కింద ఉన్న How to Add  Blog Title, Description and Logo in Blogger పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ చేంజ్ మీ బ్లాగ్ లో కనిపిస్తుంది. నేను మీకు ఇంతకూ ముందే చెప్పాను బ్లాగ్ ని ఎలా చూడాలో? కాబట్టి మళ్ళి ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేద్దాం.

How to Add  Blog Title, Description and Logo in Blogger
ఈ విధంగా మనం బ్లాగ్ టైటిల్ ని మార్చవచ్చు.

Blog Description

ఒక బ్లాగ్ కి టైటిల్ ఎంత ముఖ్యమో డిస్క్రిప్షన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక బ్లాగ్ గురించి మీరు సెర్చ్ చేస్తే, అందులో మీ బ్లాగ్ డిస్క్రిప్షన్ ని కూడా సెర్చ్ ఇంజిన్స్ సేవ్ చేసుకుని, ఎవరైతే మీ నిషి గురించి సెర్చ్ చేస్తారో వాళ్ళకి మీ బ్లాగ్ డిస్క్రిప్షన్ ఆధారంగా వాళ్ళకి చూపిస్తుంది. కాబట్టి మీ బ్లాగ్ డిస్క్రిప్షన్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం.
How to Add  Blog Title, Description and Logo in Blogger
ఇంతకూ ముందు మనం టైటిల్ చేంజ్ చేయటానికి సెట్టింగ్స్ లో బేసిక్ సెట్టింగ్స్ పై క్లిక్ చేస్తే మీకు పైన చూపించిన విధంగా స్క్రీన్ వస్తుంది. అందులో Description అని ఉంది కదా ! దాని ఎదురుగా Edit అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
How to Add  Blog Title, Description and Logo in Blogger
పైన చూపించిన విధంగా ఒక టెక్స్ట్ ఏరియ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన బ్లాగ్ కి సంబంధించి 500 లెటర్స్ వరకూ డిస్క్రిప్షన్ వ్రాయవచ్చు. ఇందులో కీవర్డ్స్ కూడా ఉండేటట్లు చూసుకొని ఒక మంచి డిస్క్రిప్షన్ వ్రాయవచ్చు. ఈ డిస్క్రిప్షన్ SEO లో ఉపయోగపడుతుంది. నేను ఉదాహరణకి ఈ విధంగా వ్రాస్తున్నాను.
How to Add  Blog Title, Description and Logo in Blogger
ఈ విధంగా మంచి డిస్క్రిప్షన్ వ్రాయవచ్చు. కాబట్టి మీరుకూడా మంచి డిస్క్రిప్షన్ వ్రాయండి. వ్రాసిన తరువాత సేవ్ చేంజెస్ అని ఉంది కదా, దాని పై క్లిక్ చేయండి. మీరు టైప్ చేసినది సేవ్ అవుతుంది.

Logo ఎలా అప్లోడ్ చేయాలి?

 ఒక బ్లాగ్ ప్రొఫెషనల్ గా ఉంది, లేదా ఉండాలి అంటే దానికి ఒక లోగో ఉండాలి. బ్లాగ్ లోగో ని Blogger లో ఎలా అప్లోడ్ చేయాలి? అనేది చూద్దాం. లెఫ్ట్ సైడ్ బార్ లో సెట్టింగ్స్ పైన Layout అని ఉంది కదా, దాని పై క్లిక్ చేయండి. దాని పై క్లిక్ చేస్తే డిఫాల్ట్ బ్లాగ్ థీమ్ అయితే మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ వస్తుంది (ఇది థీమ్ ని బట్టి మారుతుంది. కానీ ఏ థీమ్ లో అయిన Layout లోనే లోగో చేంజ్ / అప్డేట్ ఆప్షన్ వస్తుంది).
How to Add  Blog Title, Description and Logo in Blogger
ఇక్కడ కనిపించే దాంట్లో header అని ఉంది కదా! అందులో Title Changer ఎదురుగా ఒక పెన్సిల్ సింబల్ ఉంది. అది ఎడిట్ ఆప్షన్ కి సంబంధించిన బటన్. దాని పై క్లిక్ చేస్తే మీకు ఇంకో స్క్రీన్ వస్తుంది.
How to Add  Blog Title, Description and Logo in Blogger
ఒక పాపప్ విండో లో మీకు పైన చిత్రంలో చూపించినట్టు వస్తుంది. ఇందులో మీరు కావాలి అనుకుంటే టైటిల్, డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు వరుసగా Visible, Blog Title, Blog Description, Image అని కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. Visible అని దాని ఎదురుగా Show Page Header అని దాని ముందు ఒక బాక్స్ ఉంది. మీ బ్లాగ్ లో లోగో కనిపించాలి అంటే అది టిక్ చేసి ఉంచుకోవాలి. అక్కరలేదు అనుకుంటే మీరు ఆ టిక్ మార్క్ తీసివేయవచ్చు.
తరువాత ఉన్న Blog Title, Blog Description మీకు తెలుసు. కాబట్టి నేను నెక్స్ట్ దానికి మూవ్ అవుతాను. Image అని ఉంది కదా, ఈ ఆప్షన్ లోనే మనం మన బ్లాగ్ లోగో ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది మీరు అప్లోడ్ చేయబోయే ఇమేజ్ మీ కంప్యూటర్ లో ఉంటె అది సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది మీ లోగో వేరే వెబ్ సైట్ / సర్వర్ లో ఉంటె దాని యుఆర్ఎల్ అయితే దానిని సెలెక్ట్ చేసుకోవాలి. దాదాపుగా మన కంప్యూటర్ నుండే లోగో ఇమేజ్ అప్లోడ్ చేస్తాం కాబట్టి, డిఫాల్ట్ గా అదే సెలెక్ట్ అయ్యి ఉంటుంది.
ఇప్పుడు browse అని ఉన్న బటన్ పై క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఒక 10 సెకండ్ల లోపు ఇమేజ్ అప్లోడ్ అయ్యి మీకు ప్రివ్యూ కనిపిస్తుంది.
How to Add  Blog Title, Description and Logo in Blogger
పైన చూపించినట్టు అన్నమాట. ఇప్పుడు మీకు మళ్ళి దానికింద ఇంకో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇవి ఎందుకు అంటే మీ లోగో ఎక్కడ కనిపించాలి, లోగోతోపాటుగా టైటిల్, డిస్క్రిప్షన్ కూడా కనిపించాలలా, వద్దా అనేవి ఇక్కడ సెట్ చేసుకుంటాం. మూడు ఆప్షన్స్ ఎలా పని చేస్తాయో ఒకసారి చూద్దాం. ముందు Behind title and description అని ఉన్నది సెలెక్ట్ చేసుకుని సేవ్ పై క్లిక్ చేయండి. సేవ్ చేసిన తరువాత view బ్లాగ్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.
How to Add  Blog Title, Description and Logo in Blogger
అంటే టైటిల్, డిస్క్రిప్షన్ లా వెనుక మనం అప్లోడ్ చేసిన లోగో కనిపిస్తుంది. ఇది అంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఇక రెండో ఆప్షన్ చూద్దాం. దానికోసం మళ్ళిహెడర్ ఎదురుగా ఉన్న పెన్సిల్ పై క్లిక్ చేయండి.
How to Add  Blog Title, Description and Logo in Blogger
మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు రెండవ ఆప్షన్, Instead of title and description అని ఉంది కదా దానిని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. సేవ్ చేసిన తరువాత view బ్లాగ్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.
How to Add  Blog Title, Description and Logo in Blogger
అంటే టైటిల్, డిస్క్రిప్షన్ లేకుండా మనం అప్లోడ్ చేసిన లోగో మాత్రమే కనిపిస్తుంది. ఈ ఇమేజ్ మనం అప్లోడ్ చేసిన లోగో సైజు ని బట్టి ఉంటుంది. కాబట్టి మంచి సైజులో డిజైన్ చేసి అప్లోడ్ చేయండి. ఇక మూడో ఆప్షన్, దానికోసం మళ్ళిహెడర్ ఎదురుగా ఉన్న పెన్సిల్ పై క్లిక్ చేయండి.
How to Add  Blog Title, Description and Logo in Blogger
మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మూడవ ఆప్షన్, Have a description placed after the image అని ఉంది కదా దానిని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. సేవ్ చేసిన తరువాత view బ్లాగ్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.
How to Add  Blog Title, Description and Logo in Blogger
అంటే లోగో క్రింద మనం టైప్ చేసిన మొత్తం డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. కాబట్టి ఇది కొంచెం పర్వాలేదు. ఈ మూడు ఆప్షన్స్ లో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. నేను రెండవ ఆప్షన్ రిఫర్ చేస్తాను.
ఈ విధంగా మీ బ్లాగ్ టైటిల్, డిస్క్రిప్షన్, చేంజెస్ చేయవచ్చు. అలాగే మీ లోగో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు.  మీకు ఈ టాపిక్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె మమ్మల్ని సంప్రదించండి. మీ సలహాలని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.

Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive