Happy New Year 2019 | Blogger VJ New Year Resolutions


Happy New Year 2019 blog
Happy New Year 2019

హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆర్టికల్ లో నేను అసలు బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అని మీకు చెప్తాను. 2018 లో నేను ఒక బ్లాగ్ ని స్టార్ట్ చేశాను. అదే  చదువుతున్న బ్లాగ్. Blogger VJ. నేను 2014 నుండి బ్లాగింగ్, వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటూ ఉన్నాను. 2014 నుండి అని అన్నాను అంటే ఇప్పటికి నేను కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటున్నాను. అందుకే ఆలా అన్నాను. తరువాత 2016 మధ్యలో నుండి నేను డిజిటల్  మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను. ఇవి నేర్చుకునే ప్రాసెస్ లో నేను చాలా మిస్టేక్స్ చేసాను.
త్వరగా నేను ఒక ప్రొఫెషనల్ అవ్వాలని షార్ట్ కట్స్ వెతికేవాడిని. కానీ నేను సక్సెస్ అవ్వలేదు. నేను చాలా రకాల ప్రయత్నాలు చేసేవాడిని. బ్లాగింగ్ చేశాను, వెబ్ డిజైనింగ్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేశాను. కానీ నేను ఫెయిల్ అయ్యాను. అప్పుడు నాకు ఒక విషయం తెలుసుకున్నాను. సక్సెస్ అవ్వటానికి ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు అని. బోర్ కొడుతుందా నేను చెప్పేది మీకు వినటానికి. అవును ఖచ్చితంగా బోర్ కొడుతోంది.  అందుకే నేను చేసిన మిస్టేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటానికి, నాకు ఉన్న knowledge మీతో షేర్ చేసుకోవాలి అని ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేశాను. అందుకే దీనికి A failure’s valuable Journey అని టాగ్ లైన్ పెట్టాను. నాకు ఉన్న knowledge మీతో ఎందుకు షేర్ చేయాలి ? అని మీకు అనిపించవచ్చు. ఈ సమాజం ఒక విజేత అనుభవాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక ఫెయిల్యూర్ అనుభవాన్ని తెలుసుకోవాలని అనుకుంటుందా ? నా మనసు నాకు చెప్పిన సమాధానం అవును అని. ఎలా అని దానిని అడిగాను. అందుకు నాకు అది ఒక ఉదాహరణని చూపించింది.
అది ఏంటి అంటే నేను మొదట ఆన్లైన్ ద్వారా మనీ ఎర్నింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు కనిపించిన మార్గం బ్లాగింగ్. అప్పుడు నేను ఏం చేశాను? బ్లాగింగ్ ద్వారా అంత సంపాదించవచ్చు, ఇంత సంపాదించవచ్చు, అని చెప్పే వాళ్ళ వీడియోస్ చూసేవాడిని, వాళ్ళ బ్లాగ్ పోస్ట్స్ చదివేవాడిని. వాళ్ళు చెప్పిన టిప్స్ ఫాలో అయ్యేవాడిని. అప్పట్లో తెలుగులో ఈ టాపిక్స్ పై బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ లేవు. నేను ట్రై చేశాను కానీ నను సక్సెస్ కాలేదు. అలాగని నేను బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయడం కుదరదు అని చెప్పట్లేదు. కానీ చాలా మంది చెప్తున్నట్లు అంత ఈజీ కాదు. ఈ విషయం నాకు చాలా త్వరగా అర్థం అయ్యింది. ఇప్పుడు నేను బ్లాగర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అని ఫైండ్ ఔట్ చేయాలి అని అనుకున్నాను. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని ఎలా తెలుసుకోవాలి ? ఇప్పుడు న్యూ బ్లాగర్ మిస్టేక్స్ అని సెర్చ్ చేసేవాడిని. చాలా వీడియోస్ చూసాక నాకు నేను చేసిన మిస్టేక్స్ అర్థం అయ్యాయి. ఇదే నాకు నా మనసు చెప్పింది. అవును నిజమే, ఫెయిల్యూర్స్ గురించి కూడా తెలుసుకోవాలి అని ఫెయిల్ అవ్వకూడదు అని అనుకునే చాలా మంది  అనుకుంటారు. మరి వాళ్ళ కోసం ఎందుకు నీ అనుభవాన్ని షేర్ చేయకూడదు అని. అందుకే ఈ బ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగింది.
అదే విధంగా కొత్తగా బ్లాగింగ్ చేయలి అని అనుకున్నవాళ్ళ కోసం కూడా నేను తెలుగులో ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేశాను. మనకి బ్లాగింగ్ గురించి డిజిటల్ మార్కెటింగ్ వంటి వాటి గురించి తెలుగు లో ఉన్న బ్లాగ్స్ వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అంటే చాలా చాలా తక్కువ. తెలుగులోనే ఎందుకు అంటే మనకి ఎన్ని భాషలు వచ్చిన మాతృభాషలో తెలుసుకునేది బాగా అర్థం అవుతుంది. అందుకే నేను తెలుగుని సెలెక్ట్ చేసుకున్నా.
కొత్తగా బ్లాగింగ్ చేయాలి అనుకునే వారికోసం నా బ్లాగ్ లో ఒక ఫ్రీ కోర్స్ ని స్టార్ట్ చేశాను. ఇందులో నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎలా ఓక్ ప్రొఫెషనల్ బ్లాగ్ ని క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది. ఆ కోర్స్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె జాయిన్ అవ్వండి.
ఇంకా అసలు బ్లాగింగ్ అంటే ఏంటి? అసలు బ్లాగింగ్ ఏ విధంగా చేస్తారు అని ఇప్పటికే నేను బ్లాగ్స్ వ్రాయటం జరిగింది. అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలి అనుకునే వారి కోసం ఒక బేసిక్ కోర్స్ ని కూడా మన బ్లాగ్ లో పబ్లిష్ చేయడం జరిగింది. 


Happy New Year 2019 blog
Happy New Year 2019

 ఈ నూతన సంవత్సరం మేము వెబ్సైటు డిజైనింగ్ ఎలా నేర్చుకోవాలి అని ఒక కోర్స్ ని తయారు చేస్తున్నాము. అందులో ఒక స్టాటిక్ వెబ్సైటు ని స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి అని వివరించడం జరుగుతుంది. పూర్తిగా మీరు నేర్చుకున్న కోడింగ్  తో ఒక వెబ్సైటు ఎలా తయారు చేయాలో చెప్తాం. అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ పైన ప్రాక్టికల్ కోర్స్ ని కూడా లాంచ్ చేస్తాం. అందుకు మాకు మీ సపోర్ట్ కావాలి. ఇది మా న్యూ ఇయర్ ప్రోగ్రాం. ఇంతే కాకుండా ఇంకా ఎన్నో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ మన బ్లాగ్ లో లాంచ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్  కోసం మా బ్లాగ్ ని విసిట్ చేస్తూ ఉండండి. మరొకసారో మీకు, మీ కుటుంభం సభ్యులకి Blogger VJ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive