Website Designing Course | Lesson 01 | How to create a web page in telugu | Blogger VJ

Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
Website Designing Course | Lesson 01 | How to create a web page in Telugu | Blogger VJ

హాయ్ ఫ్రెండ్స్, Blogger VJ లో నుండి HTML లెస్సన్స్ మనం నేర్చుకోబోతున్నాం.  ఈ లెసన్ లో మనం HTML ద్వారా వెబ్ పేజీ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. నిజానికి మనం HTML నేర్చుకోవాలి అంటే ఎదో ఒక టెక్స్ట్ ఎడిటర్ ఉపయోగించాలి. మనం Dream viewer, Notepad++, Editplus వంటి టెక్స్ట్ ఎడిటర్స్ ని కూడా ఉపయోగించవచ్చు. కానీ వీటిని ఉపయోగించడం వలన HTML టాగ్స్ నేర్చుకోవటం కొంచెం కష్టం. ఎందుకు అంటే, వీటిల్లో ఆటో ఫిల్ ఆప్షన్ ద్వారా మనం ఒక రెండు లెటర్స్ టైపు చేసిన వెంటనే ఆ లెటర్ రిలేటెడ్ టాగ్స్ ఏమి ఉన్నాయో అవి లిస్ట్ గ వస్తాయి. ఆలా వస్తే మనం ఉన్ని లిమిటెడ్ టాగ్స్ ని గుర్తుంచుకోలేం. కాబట్టి మనం వీటిని ఉపయోగించము.
మరి ఏ టెక్స్ట్ ఎడిటర్ ఉపయోగిస్తాం? అందుకోసం మనం మన సిస్టం లో ఉండే notepad ని ఉపయోగిస్తాం. ఇది డిఫాల్ట్ గా ఉండే సాఫ్ట్వేర్. విండోస్ ఇన్స్టలేషన్ తో పాటుగా మనకి ఇది కూడా ఇన్స్టాల్ అవుతుంది. అదే విధంగా మనం యూస్ చేయటానికి ఈజీ గా ఉంటుంది.

ఒక వెబ్ పేజీ ని ఎలా క్రియేట్ చేయాలి? How to create a web page?

ముందుగా మనం మన సిస్టం లో ఉన్న notepad ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ

ఇప్పుడు మీరు అక్కడ కనిపించే మెనూలో format మెనూ పై క్లిక్ చేస్తే మీకు ఎలా ఆప్షన్స్ కనిపిస్తాయి.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
పైన కనిపించే font పై క్లిక్ చేయండి అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అంటే మనం ఫాంట్ యొక్క సైజు పెంచటం కోసం ఇదంత చేస్తున్నాం.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
ఇందులో మీరు font size పెంచుకోండి. ఇలా చేయటం వలన మనం టైపు చేసే టెక్స్ట్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
ఇప్పుడు ఇక మనం ఒక వెబ్ పేజీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అందుకోసం నేను ఈ విధంగా కొంత కోడింగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
ఈ విధంగా టైపు చేసిన తరువాత మనం ఫైల్ మెనూలోకి వెళ్లి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
ఈ విధంగా మనకి కనిపిస్తుంది. అప్పుడు మీకు క్రింది  విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
ఇక్కడ మీకు కనిపించే ఫైల్ నేమ్ దగ్గర ఆ ఫైల్ నేమ్ ఇచ్చిన తరువాత మీరు .html అని టైపు చేయాలి.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ

తరువాత Save as type అని కనిపించే దాని ఎదురుగా ఉన్న దాంట్లో ఉన్న All files పై క్లిక్ దానిని సెలెక్ట్ చేయండి. 
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
ఇప్పుడు మీరు సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక వెబ్ ఫైల్ ఒకటి కనిపిస్తుంది.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
పైన కనిపించే ఇమేజ్ లో మీకు index.html అని ఒక ఫైల్ కనిపిస్తుంది కదా. ఒక వేళ మీ సిస్టం లో file extension హైడ్ అయ్యి ఉంటె మీకు index అని మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆ వెబ్ పేజీ ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ

Website Designing Course | How to create a web page in telugu | Blogger VJ
నా సిస్టం లో firefox డిఫాల్ట్ బ్రౌసర్ కాబట్టి ఈ విధంగా బ్రౌసర్ లో ఓపెన్ అయ్యింది. మీకు డిఫాల్ట్ బ్రౌసర్ ఏది అయితే మీకు ఆ బ్రౌసర్ లో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక వెబ్ పేజీ ని క్రియేట్ చేస్తాం.
సరే బాగానే ఉంది. కానీ మీరు ఏమి వ్రాసారో మీకు తెలుసా? అది నేను మీకు వివరించకపోతే ఈ లెసన్ కంప్లీట్ అవ్వదు. కాబట్టి నేను కోడ్ ఎక్సప్లనేషన్ చేస్తాను. ఈ లెసన్ లో మనం వ్రాసిన కోడ్ లో ఉన్న <h1>Free Blogging Course in Telugu</h1> ఈ లైన్ మనకి వెబ్ పేజీ లో కనిపించే హెడ్డింగ్ ని డిఫైన్ చేస్తుంది. ఇందులో ఇది h1 అనేది హెడ్డింగ్ 1 అనే టాగ్ ని డిఫైన్ చేస్తుంది.
తరువాత ఉన్న <p> Blogger VJ is offering a free course on blogging in Telugu.</p> ఈ లైన్ మనకి కనిపించే వెబ్ పేజీలో పేరాగ్రాఫ్ ని డిఫైన్ చేస్తుంది. మనం పేరాగ్రాఫ్స్ వ్రాయాలి అంటే ఈ <p> టాగ్ ని ఉపయోగిస్తాము.  ఇవి మనకి కనిపించే మెయిన్ టాగ్స్.
ఇవి కాకుండా మనకి మనం వ్రాసిన కోడ్ లో <body> అనే టాగ్ ఉంది. ఇది HTML  ఉండే అత్యంత ముఖ్యమైన టాగ్. ఇది ఒక పేరెంట్ టాగ్. ఒక html పేజీ లో ఒక్క <body> టాగ్ మాత్రమే ఉంటుంది. మనం ఒక వెబ్ పేజీ లో కనిపించే పార్ట్ అంత కూడా body టాగ్ లో మాత్రమే వ్రాయాలి. తరువాత మనకి <body> టాగ్ పైన కనిపించే <head> టాగ్ body టాగ్ లాగే అత్యంత ముఖ్యమైనది. ఈ <head> టాగ్ లో మనం స్టైల్స్, జావా స్క్రిప్ట్ కూడా ఇందులోనే వ్రాస్తాం. <head> టాగ్ లో వ్రాసేవి మనకి వెబ్ పేజీ లో కనిపించవు. తరువాత <head> టాగ్ లో వ్రాసిన <title> అని ఇంకో టాగ్ ఉంది. ఈ టాగ్ కూడా ఒక వెబ్ పేజీ లో ఒకటి మాత్రమే వ్రాయాలి. ఈ టాగ్ లో మనం వ్రాసిన title మన వెబ్ పేజీ యొక్క టైటిల్ ని డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా దీని వలన ఒక ఉపయోగం కూడా ఉంది. అది ఏంటి అంటే, ఈ title టాగ్ వలన సెర్చ్ ఇంజిన్ లు మన వెబ్ పేజీ లో ఉన్న కంటెంట్ ని ఒక అంచనా వేస్తాయి.
  తరువాత అత్యంత ముఖ్యమైనది <html> టాగ్. మనం ఈ టాగ్ ఉపయోగించడం వలన బ్రౌసర్ కి మనం వ్రాసిన వెబ్ పేజీ ఏ లాంగ్వేజ్ లో వ్రాశామో తెలియచేయాలి. అందుకోసం మనం ఈ html టాగ్ ని వ్రాస్తాం. ఇది కూడా ఒక్కసారి మాత్రమే వ్రాస్తాం. ఒక వెబ్ పేజీ లో మీరు ఏమి వ్రాసిన, అవి అన్ని కూడా ఈ html పేజీ లో మాత్రమే వ్రాయాలి.
ఈ విధంగా మనం ఒక వెబ్ పేజీని క్రియేట్ చేస్తాం. ఈ లెసన్ లో మనం క్రియేట్ చేసిన వెబ్ పేజీ యొక్క కోడింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. తరువాత లెసన్ లో మన హెడ్డింగ్స్ గురించి, పేరాగ్రాఫ్స్ గురించి తెలుసుకుందాం. 
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive