What is Facebook Marketing? explained in Telugu by Blogger VJ


What is Facebook Marketing? explained in Telugu by Blogger VJ
What is Facebook Marketing? explained in Telugu by Blogger VJ
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకూ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని మెయిన్ టాపిక్స్ గురించి తెలుసుకున్నారు. సోషల్ మీడియా లో ఉన్న ఒకటైన, మెయిన్ platform facebook మార్కెటింగ్ గురించి మనం ఈ పోసులో తెలుసుకుందాం! అసలు facebook ని మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎందుకు యూస్ చేయాలి? facebook మార్కెటింగ్ ఎలా చేయాలి? అనేది ఓవరాల్ గా చూద్దాం.
ఫేస్బుక్ సోషల్ మీడియా platform లో అత్యంత ముఖ్యమైనది. facebook మన బిజినెస్ కి ఎలా ఉపయోగపడుతుంది? మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లే  మన దేశం లో స్మార్ట్ మొబైల్స్ వాడకం అనేది గత 5 సంవత్సరాలలో చాలా బసగా పెరిగింది. అలాగే ఇంటర్నెట్ వాడె వినియోగదారుల సంఖ్య కూడా చాలా పెరిగింది. ప్రపంచంలో అత్యంత మంది ఇంటర్నెట్ వినియోగదారులు చైనా లో ఉంటె, తరువాత మన దేశంలోనే ఉన్నారు. 2020 కల్లా మన దేశం ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య చైనా ని మించిపోతుంది అనేది ఒక అంచనా.
ఇంటర్నెట్ వినియోగ పెరగటానికి,  డేటా ధర మొబైల్ కంపెనీస్ మధ్య పోటి వాతావరణం కారణంగా బాగా తగ్గటం కూడా ఒక కారణం. దీనీ వల్ల మన దేశంలో ఫేస్బుక్, youtube వాడె వారి సంఖ్య బాగా పెరిగింది. అంటే దాదాపుగా ప్రతీ ఒక్కరు ఈ రెండిటిలో ఒకదానిని ఉపయోగిస్తూ ఉంటారు. youtube గురించి మరొక పోస్టులో వివరిస్తాను. అయితే ఈ పోస్టులో ఫేస్బుక్ గురించి మాట్లాడుకుందాం. సాదారణంగా ఫేస్బుక్ లో అందరు తమ తమ ఇష్టాలని, అభిరుచులని, అన్నింటిని పంచుకుంటూ ఉంటారు. మన స్నేహితులు, బంధువులు మొదలైన వారికీ సంబంధించిన అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. సుమారుగా ఒక్కో ఫేస్బుక్ యూసర్ కి సుమారుగా 200 మంది ఫ్రెండ్స్ ఉంటారు అని అంచనా! అయితే ఒక యూసర్ ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాన్ని అందులో కనీసం ఒక 50 మంది దానిని చూస్తారు.
ఒక సర్వే ప్రకారం ఒక నెలకి ఫేస్బుక్ 2.19 బిలియన్ యూసర్స్ ఆక్టివ్ గా ఉంటారు అని, అంటే సుమారుగా 200 కోట్లకి పై మాటే.కాబట్టి ఫేస్బుక్ ని మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి మన ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తే అది అతి తక్కువ మందికి మాత్రమే రీచ్ అవ్వుతుంది. మన ప్రోడక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు అందరిని మనం మన ఫ్రెండ్స్ గా చేర్చుకోలేము. ఎందుకంటె ప్రైవసీ ఒకటి, రెండోది facebook ఒక యూసర్ కి కేవలం 5000 మంది ఫ్రెండ్స్ మాత్రమే అక్సేప్ట్ చేస్తుంది. మరి మనం ఎలా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి?
అందుకోసం మనకి ఫేస్బుక్ బిజినెస్ పేజి అనే ఆప్షన్ ని అందిస్తుంది. మన బిజినెస్ కి సంబంధించిన బిజినెస్ పేజి ని ఒక దానిని create చేసి, దాంట్లో మన బిజినెస్ డీటెయిల్స్ (ప్రోడక్ట్ లేదా సర్వీస్) ఇచ్చి అందులో మనం మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ నచ్చిన వాళ్లు మాత్రమే మన పేజి ని లైక్ చేసి మనల్ని ఫాలో అవుతారు. మనం పెట్టిన పోస్టుని ఒక 10 మంది లైక్ చేసారు అనుకుందాం. అప్పుడు facebook వాళ్లు లైక్ చేసిన మన బిజినెస్ పోస్ట్ ని వల్ల లిస్టు లో ఉన్న ఫ్రెండ్స్ కి షేర్ చేస్తుంది (చూపిస్తుంది). అందులో కనీసం మనకి ఒక పది మంది చుసిన ఒక 100 మందికి మన పోస్ట్ రీచ్ అవ్వుతుంది. ఒకవేళ అందులో మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ అవసరం ఉన్న వాళ్లు ఎవరైనా ఉంటె మనకి వల్ల నుండి బిజినెస్ వస్తుంది.
సో ఈ విధంగా మనం మన బిజినెస్ కోసం ఫేస్బుక్ ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా కాకుండా మనం కొంత అమౌంట్ పే చేసి ఫేస్బుక్ లో మార్కెటింగ్ కూడా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మన బిజినెస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వుతుంది. అంటే కాకుండా మనం ఫేస్బుక్ కి ద్వారా అమౌంట్ పే చేసి మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి facebook కూడా మనకి హెల్ప్ చేస్తుంది.
facebook మన బిజినెస్ కి ఎలా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారా? ఫేస్బుక్ లో మార్కెటింగ్ అంటే మనం ఫేస్బుక్ కి బిజినెస్ ఇస్తున్నాం. కాబట్టి facebook మనకి, మన బిజినెస్ పోస్టులకి హెల్ప్ చేస్తుంది. మనం పెట్టిన పోస్టులని ఫేస్బుక్ తన దగ్గర ఉన్న తన యూసర్ డేటాబేస్ ఆధారంగా వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫేస్బుక్ చూసుకుంటుంది.
ఫేస్బుక్ లో మార్కెటింగ్ అంటే మనం మన దగ్గర ఉన్న అమౌంట్ ని బట్టి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. మనం ఆ 100 రూపాయలతో మన facebook మార్కెటింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఒక పోస్ట్ create చేసి దానిని ప్రమోట్ చేయవచ్చు. facebook మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఆధారంగా ఆ 100 రూపాయలు అయిపోయే వరకూ ప్రమోట్ చేస్తుంది. ఈ లోపు మనకి ఆ ప్రమోషన్ నుండి ఒక ఒక 10 లీడ్స్ వచ్చి, రెండు convert అయ్యిన మనకి బిజినెస్ వస్తుంది కదా!
facebook మార్కెటింగ్ లో మనకి బ్రాండింగ్, అవేర్నెస్, లీడ్ జనరేషన్, కన్వేర్షన్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి, facebook మార్కెటింగ్ కి సంబంధించిన మరిన్ని విషయాలని facebook మార్కెటింగ్ కోర్స్ లో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive