What is Google Adwords in telugu by Blogger VJ

What is Google Adwords in telugu by Blogger VJ
What is Google Adwords in telugu by Blogger VJ

హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంత వరకూ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న దాదాపు అన్ని ఫండమెంటల్స్ గురించి తెలుసుకున్నారు. మనం ఇంతకు ముందు మనం SEARCH ENGINE MARKETING గురించి తెలుసుకున్నాం. గూగుల్ లో SEM చేయటానికి GOOGLE ADWORDS ద్వారా చేస్తాం అని చెప్పుకున్నాం కదా! సో ఈ పోస్టులో మనం GOOGLE ADWORDS గురించి తెలుసుకుందాం. GOOGLE ADWORDS లో మనం ఏ ఏ రకాలుగా మార్కెటింగ్ చేయవచ్చు? అని చూద్దాం.
GOOGLE ADWORDS పూర్తిగా గూగుల్ డెవలప్ చేసిన సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కోసం తయారు చేసుకున్న అద్భుతమైన టూల్. ఇందులో మనం కేవలం సెర్చ్ ఇంజిన్ లో మాత్రమే మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన పేజి లింక్, లేదా వెబ్ సైట్ లింక్ ని మనం ad గా ఇవ్వవచ్చు. అయితే SEM ద్వారా మనకి కలిగే అద్భుతమైన ప్రయోజనం ఏంటి అంటే మన వెబ్ సైట్ కి ఎలాంటి SEO చేయకుండా మన వెబ్ సైట్ ఫస్ట్ పేజి లో డిస్ప్లే అవ్వుతుంది. దీనీ వలన మనకి high click through rate సాధ్యపడుతుంది.
అంతే కాకుండా మనకి కొన్ని బ్లాగ్స్ లో కూడా గూగుల్ ads డిస్ప్లే అవుతాయి. ఇలా సెట్ చేయటానికి మార్కెట్ విత్ గూగుల్ పార్టనర్స్ ద్వారా సెట్ చేయవచ్చు. youtube వీడియోస్ లో ad ఇవ్వాలి అంటే మనం youtube వీడియోస్ లో సెట్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి కొన్ని ఫ్రీ అప్స్ లో కూడా మనకి ads డిస్ప్లే అవుతూ ఉంటాయి. గూగుల్ అప్స్ లో కూడా మనం సెట్ చేసుకుంటే ఆ అప్స్ లో కూడా మన ad డిస్ప్లే చేయవచ్చు. అంటే మనం ఏ టైపు ఆడియన్స్ ని టార్గెట్ చేయాలి అనుకుంటే వాళ్ళని టార్గెట్ చేయవచ్చు. మన డబ్బు కూడా వేస్ట్ అవ్వకుండా మన టార్గెట్ రీచ్ అవ్వవచ్చు.
మీరు కనుక ఈ మధ్య కనుక బ్లాగ్స్ లో కనుక గమనించి ఉంటె RS Brothers, GRT Jewelers వాళ్లు కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ads ఇస్తున్నారు. నిదానంగా అందరు కూడా డిజిటల్ వైపు మళ్లుతారు. అప్పుడు అలాంటి వాళ్ళకి డిజిటల్ మార్కేటర్స్ SEM చేయటానికి అవసరం అవుతారు.  అంతే కాకుండా మన బ్లాగ్స్, YouTube వీడియోస్ ప్రమోట్ చేసుకోవటానికి, మన brand ని ప్రమోట్ చేయటానికి మనం Google Ad-words ని ఉపయోగించవచ్చు.  Google Ad-words లో మనకి ఉన్న అదనపు సదుపాయం ఏంటి అంటే మనం టార్గెట్ చేసిన keywords కి మనం ఒక్కో క్లిక్ కి మనం ఎంత స్పెండ్ చేయాలో బిడ్డింగ్ చేయవచ్చు. దీనీ ద్వారా మన డబ్బు వృధాగా అవ్వకుండా ఉంటుంది.
ఈ పద్ధతిని PPC (Pay Per Click) అని అంటారు. ఇక్కడ Google Ad-words ద్వారా PPC ads ఇవ్వటానికి క్లైంట్స్ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకి నేను ఒక వెబ్ సైట్ డిజైనింగ్ కంపెనీ నిర్కాహిస్తున్నాను అనుకుందాం. నేను Google Ad-words ద్వారా న ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేయాలి అనుకున్న! అప్పుడు నేను కొన్ని keywords టార్గెట్ చేసి, నేను ఒక 1000 రూపాయలతో ఒక ad create చేశాను అనుకుందాం. ఇక్కడ నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నా వెబ్ సైట్ లింక్ పై క్లిక్  చేస్తే ఒక్కో క్లిక్కుకి 10 రూపాయలుగా బిడ్డింగ్ వేసాను అనుకుందాం. అప్పుడు నా వెబ్ సైట్ కి 100 క్లిక్కులు వస్తాయి. అంటే న వెబ్ సైట్ లో ఉన్న సర్వీసెస్ ని 100 మంది చూస్తారు. వారిలో నాకు 30 మంది కాల్ చేసి న సర్వీస్ గురించి ఎంక్వయిరీ చేసారు అనుకుందాం. అప్పుడు వారిలో నుండి 15 మంది నాకు వెబ్ సైట్ డిజైన్ చేయమని ఆర్డర్ ఇస్తే నాకు సుమారుగా ఒక వెబ్ సైట్ కి 5000 – 10000రూపాయల వరకూ వస్తాయి అనుకుందాం. యావరేజ్ గా 5000 అనుకుందాం, అప్పుడు నాకు 75 వేల రూపాయలు బిజినెస్ జరిగినట్టే కదా!
అంటే వెయ్యి రూపాయల ad తో నేను 75 వేల బిజినెస్ చేసినట్టే కదా! అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మనం ఎప్పుడైనా ఒక ad రన్ చేస్తున్నాం అంటే అది లాంగ్ రన్ లో చేస్తే, మనకి ఆ ad రన్ చేసినందువల్ల ad కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది. ఇది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ లో ఒకటి. కాబట్టి ad రన్ చేసేటప్పుడు ఈ విషయాన్నీ గుర్తు పెట్టుకోండి. ఒక వేల మీరు ఒక రోజు లేదా రెండు రోజులకి ad కనుక రన్ చేస్తే మీకు ad కాస్ట్ అనేది బాగా పెరుగుతుంది.
ఈ Google Ad-words మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవటానికి మనం Google Analytics ని లింక్ చేసి రిజల్ట్స్ లేదా కన్వేర్శన్స్ ని ట్రాక్ చేయవచ్చు. ముందు ముందు Google Ad-words గురించి పూర్తీ కోర్స్ ని డిజైన్ చేసి అందులో Google Ad-words ని పూర్తిగా వివరించగలం. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.

Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive