What is Google Analytics? Explained in Telugu by Blogger VJ

What is Google Analytics? Explained in Telugu by Blogger VJ
What is Google Analytics? Explained in Telugu by Blogger VJ

మనం మొదటి నుండి డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతిది మేసర్బుల్(Measurable) అని చేపుకున్తున్నాం కదా! అసలు ఎలా measure చేస్తాం? మన వెబ్ సైట్ డిజైన్ చేసిన తరువాత మన వెబ్ సైట్ కి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని కొంటున్నారు? సోషల్ మీడియా ద్వారా ఎంత మంది వస్తునారు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ పోస్టులో తెలుసుకుందాం?
డిజిటల్ మార్కెటింగ్ లో మన వెబ్ సైట్ కి ఎంత మంది వస్తున్నారు? Facebook లో ఇచ్చిన ad ద్వారా ఎంతమంది మన వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యారు? YouTube వీడియో చేయడం ద్వారా మనకి ఎంత వెబ్ సైట్ traffic వచ్చింది? ఇలాంటివి అన్ని తెలుసుకోవటానికి మనకి ఒక ఫ్రీ టూల్ ఉంది. అదే Google Analytics(గూగుల్ అనలిటిక్స్). అవును గూగుల్ వాళ్లు అందించే ఈ ఫ్రీ టూల్ డిజిటల్ మార్కెటింగ్ లో అత్యంత ముఖ్యమైనది.
దీనీ ద్వారా మనం పైన చెప్పినట్టు ఒక వెబ్ సైట్ (మన) కి ఎంత మనది విసిటర్స్ వచ్చారో తెలుసుకోవచ్చు. మన వెబ్ సైట్ లో ప్రతీ యాక్షన్ ని గూగుల్ కనిపెడుతుంది. మనకి హెల్ప్ చేస్తుంది. గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ create చేసుకోవటం, ఒక వెబ్ సైట్ ని అందులో ఇంటిగ్రేట్ చేయటం అనేవి చాలా ఈజీ. అలాగే ఈ టెక్నాలజీ ని అర్థం చేసుకోవటం కూడా చాలా ఈజీ. గూగుల్ అనలిటిక్స్ పై మనకి అవగాహనా వస్తే, మిగితా platforms కి సంభందించిన అనలిటిక్స్ కూడా ఈజీ గా అర్థం అవుతాయి. 
ఇందులో మనం గోల్స్ సెట్ చేసుకొని, వాటిని మనం ఎలా రీచ్ అవ్వాలో, మన బిజినెస్ స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలి అని నిర్ణయించుకోవచ్చు. సోషల్ మీడియా లో ప్రమోట్ చేసిన ad ద్వారా ఎంత మంది మన వెబ్ సైట్ ని విసిత్ చేసారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అప్పుడు ఏ platform నుండి మన వెబ్ సైట్ కి traffic వస్తుందో చూసుకొని, మనం ఆ platform పైన ఇంకా ఫోకస్ చేయటానికి అవకాశం ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్ లో మనకి మన వెబ్ సైట్ ఏ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్లు చూసారు, జెండర్ వైస్ గా ఎంత మంది చూసారు, రెగ్యులర్ విసిటర్స్ ఎంత మంది, క్రొత్తగా వస్తున్నా విసిటర్స్ ఎంతమంది, ఏ ప్రోడక్ట్ లేదా సర్వీస్ కోసం ఎక్కువమంది మన వెబ్ సైట్ కి వస్తున్నారు అనే ఎన్నో విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు.
మొబైల్ లో ఎంత మనది విసిట్ చేస్తున్నారు, కంప్యూటర్ లో ఎంత మంది విసిట్ చేస్తున్నారు, ఏ దేశం నుండి ఎంతమంది చూస్తున్నారు ఇలాంటివి కూడా మనం తెలుసుకోవచ్చు. గూగుల్ అనలిటిక్స్ ని అర్థం చేసుకోవటం చాలా ఈజీ. ఈ పోస్టులో గూగుల్ అనలిటిక్స్ ని ఎందుకు వాడతారో మాత్రమే చెప్పగాలిగం. ముందు ముందు కంప్లీట్ గూగుల్ అనలిటిక్స్ పై పూర్తీ గా ఆర్టికల్స్ వ్రాయటం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive