What is YouTube Marketing in Telugu? Blogger VJ


What is YouTube Marketing in Telugu? Blogger VJ
YouTube, మన దేశంలో JIO  వచ్చిన తరువాత ఎక్కువ మంది ఉపయోగించడం మొదలు పెట్టిన వెబ్ సైట్. YouTube వీడియో మార్కెటింగ్ platform. అంటే కాకుండా ప్రపంచంలో గూగుల్ తరువాత అత్యంత ట్రాఫిక్ ఉన్న రెండవ సెర్చ్ ఇంజిన్. అవును, గూగుల్ తరువాత అత్యంత పాపులర్ వెబ్ సైట్ YouTube. మరి అలాంటి YouTube మన బిజినెస్ డెవలప్మెంట్ కి ఎలా ఉపయోగపడుతుంది? హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ పోస్టులో ఫేస్బుక్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు కదా? ఈ పోస్టులో YouTube ద్వారా మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాలు చూద్దాం!
సాదారణంగా జనరల్ టెక్స్ట్ కంటెంట్ కన్నా ఇమేజ్స్ ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే నార్మల్ టెక్స్ట్ కంటెంట్ కన్నా ఇమేజ్స్ ఉన్న కంటెంట్ తో యూసర్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వుతారు. అలాగే ఇమేజ్స్ కన్నా వీడియోస్ అయితే ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. అందుకే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో వీడియో ad మేకింగ్ కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి అదే ఫార్ములా ఉపయోగపడుతుంది.

కాబట్టి మన బిజినెస్ డెవలప్మెంట్ లో భాగంగా మనం మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేయటానికి మనం ఒక వీడియో చేసి ఆ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ఎలా ఉపయోగించాలి? ఆ ప్రోడక్ట్ లేదా సర్వీస్ యూసర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయాలని మన వీడియో ద్వారా చక్కగా అర్థం అయ్యేటట్లు చేయవచ్చు. వీటిని మనం ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో ప్రమోట్ చేయటం ద్వారా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని కస్టమర్స్ కి చేరువ అవ్వటంలో YouTube మనకి సహాయం చేస్తుంది.
అంటే కాకుండా కేవలం బిజినెస్ కోసమే కాకుండా ప్రమోషనల్ వీడియోస్ రెగ్యులర్ గా అప్డేట్ చేయటం ద్వారా మన ప్రోడక్ట్ యొక్క ఫీడ్ బ్యాక్ తీసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే కాకుండా బిజినెస్ ఓనర్స్ కీ మాత్రమే కాకుండా, bloggers కి కూడా YouTube మార్కెటింగ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. YouTube లో మనం ఒక వీడియో ని మార్కెటింగ్ చేయటం చాలా ఈజీ. అంతే కాకుండా YouTube మార్కెటింగ్ చేయటం ద్వారా మన వెబ్ సైట్ SEO లో గూగుల్ లో ర్యాంకింగ్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.  దాదాపుగా ఒక పోస్ట్ ని మనం ఎలా అయితే టాగ్స్ సెట్ చేయటం, మంచి టైటిల్ పెట్టటం, keywords search చేయటం అన్ని దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది.
మనం ఇంతకు ముందు మనం Google Adwords గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రమోట్ చేస్తామో, అదే విధంగా మనం వీడియో ని కూడా ప్రమోట్ చేయవచ్చు. PPC లాగే వీడియో ప్రమోషన్ కూడా చేయవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన వాళ్ల ఇంట్లో కొంత ఇబ్బందిగా ఉంది. ఆర్ధికంగా, మానసికంగా వాళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ స్తితి లో ఉన్నప్పుడు వాళ్లు YouTube కొన్ని వీడియోస్ చూశారు. ఆ వీడియోస్ ఏంటి అంటే జాతకాలూ, శాంతులు వంటివి చేసే వాళ్ళకి చెందిన వీడియో. వాళ్లు ఉండేది కేరళలోని ఒక గ్రామం. అక్కడికి వెళ్ళటానికి 23 గంటలు ప్రయాణం చేయాలి. సరే వాళ్లు అక్కడికి వెళ్లారు, వాళ్లు ఎదో చెప్పారు, ఏదో శాంతులు చేయించుకున్నారు, అది వేరే విషయం. నేను విషయం తెలుసుకొని ఆశర్యపోయాను. అప్పుడు నాకు YouTube మార్కెటింగ్ ఎలా పనిచేసిందో అప్పుడు ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యింది అని తెలిసింది. అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అంటే YouTube మార్కెటింగ్ కూడా మన చేయటం మన బిజినెస్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది.
YouTube లో మనం చేసే వీడియోస్ ని కూడా మనం ఎంతమంది చూసారు అనేటువంటి అనలిటిక్స్ ద్వారా మనం అనాలిసిస్ చేయవచ్చు. కేవలం YouTube ఛానల్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు అనేవి మీకు తెలిసిన విషయమే. YouTube మార్కెటింగ్ లో ఉన్న ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, స్ట్రాటజీస్ గురించి ముందు ముందు పోస్టులలో తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.

Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive