Website Designing Course | Lesson 08 | How to create a Table in HTML in Telugu | Blogger VJ

Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
Website Designing Course | Lesson 08 | How to create a Table in HTML in Telugu | Blogger VJ

హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్  లో  వెబ్ పేజెస్ లో Iframes ద్వారా ఒక వెబ్ పేజీ లో ఇంకొక వెబ్ పేజీని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం. అదే విధంగా HTML లో కామెంట్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం. ఈ లెసన్ లో టేబుల్స్ HTML ద్వారా డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని తెలుసుకుందాం.
HTML లో డేటాని టేబుల్స్ ద్వారా ఎక్కువగా వెబ్ డెవలప్మెంట్ లో రిపోర్ట్స్ కోసం ఉపయోగిస్తారు. కాబట్టి టేబుల్స్ బాగా నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ లో బాగా ఉస్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్ స్టార్ట్ చేద్దాం.
ముందుగా నేను ఈ విధంగా ఒక వెబ్ పేజీ ని క్రియేట్ చేస్తున్నాను.
Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
ఈ విధంగా వ్రాసిన కోడింగ్ లో మనం ఒక టేబుల్ రో డేటాని ఇన్సర్ట్ చేశాను. ఒక్కసారి సేవ్ చేసి బ్రౌసర్ లో ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
పైన కనిపించే ఇమేజ్ లో మీకు కొంత డేటా కనిపిస్తుంది కదా! కానీ టేబుల్ లాగా కనిపించేట్లేదు. మీకు అర్థం కావడం కోసం  నేను సెలెక్ట్ చేసి ఉంచాను.
ఒక్కసారి ఆ కోడ్ ని వివరిస్తాను. H1 టాగ్ తరువాత నుండి మనం టేబుల్ కోడ్ ని వ్రాయడం జరిగింది. మొట్టమొదట మనం table అనే టాగ్ వ్రాసాము. ఈ table టాగ్ లోపల మాత్రమే మనం కాలమ్స్, రోస్ (rows) వంటి టాగ్స్ మనం  ఇన్సర్ట్ చేయాలి.
తరువాత వ్రాసిన tr అనే టాగ్ table యొక్క row ని ఇండికేట్ చేస్తుంది. ఒక tr క్లోజ్ అయితేనే ఇంకొక లైన్ లో డేటా రాయటానికి అవకాశం ఉంటుంది.
Tr తరువాత వ్రాసిన td టాగ్ టేబుల్ సెల్ ని ఇండికేట్ చేస్తుంది. మనం ఇందులో వ్రాసిన డేటా సెల్స్ గా మనకి కనిపిస్తుంది.
ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటి అంటే టేబుల్స్ పైన మీకు కంప్లీట్ గ్రిప్ వస్తే ఇక మీకు తిరుగు ఉండదు. మీరు టేబుల్స్ తోనే వెబ్ సైట్స్ చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా టేబుల్స్ నేర్చుకోవాలి.
ఇప్పుడు మనం టేబుల్ కి బోర్డర్ క్రియేట్ చేస్తాను. అందుకోసం border attribute ని table టాగ్ కి వ్రాయాలి. ఈ విధంగా మీరు వ్రాయండి.
Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
ఇప్పుడు సేవ్ చేసి, వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
మనం ఒక టేబుల్ లో 4 tr లు వ్రాసాము. అందుకే మనకి 4 సెల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక row ఒక స్టూడెంట్ డీటెయిల్స్ యాడ్ చేద్దాం. అందుకోసం నేను ఈ విధంగా ఒక tr అందులో మళ్ళి 4 td లు ఇన్సర్ట్ చేస్తున్నాను.
Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
ఈ విధంగా వ్రాసిన తరువాత సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
అదే విధంగా ఇంకొక స్టూడెంట్ ని కూడా యాడ్ చేద్దాం. అందుకోసం మళ్ళి ఈ విధంగా నేను కోడింగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
ఇప్పుడు ఈ వెబ్ పేజీని సేవ్ చేసి, రిఫ్రెష్ చేయండి. ఈ విధంగా మనకి కనిపిస్తుంది.
Website Designing Course | How to create a Table in HTML in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం టేబుల్స్ ని వెబ్ పేజెస్ లో ఇన్సర్ట్ చేస్తాం. మీరు కూడా టేబుల్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. 
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

No comments:

Post a Comment

Popular Posts