Digital Marketing Landing Page


హాయ్ ! ఈ మధ్య ఎక్కడ చూసిన Digital Marketing ... Digital Marketing అని మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ Digital Marketing అంటే ఏమిటి? దీని వలన ఉపయోగం ఏంటి? అసలు ఎవెరెవరు నేర్చుకోవచ్చు? ఇందులో ఏమేమి modules ఉంటాయి? అసలు Digital Marketing ఎలా నేర్చుకోవచ్చు? అనే టాపిక్స్ గురించి తెలుసుకుందాం.
free digital marketing course in telugu
What is Digital Marketing? | డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
Digital Marketing గురించి సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ప్రోడక్ట్ ని లేదా ఒక బ్రాండ్ ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రమోట్ చేయటాన్ని digital marketing అంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ నే మనం ఆన్లైన్ మార్కెటింగ్ అని, ఇంటర్నెట్ మార్కెటింగ్ అని, వెబ్ మార్కెటింగ్ అని కూడా అంటారు. Traditional marketing అంటే మనం పేపర్స్, మాగజైన్స్, టీవీల్లో ads, hoarding, flex banners, pamphlets distribution లాంటివి అన్ని. అయితే ఇందులో మనకి ఉన్న disadvantage ఏంటి అంటే మన ad ఎంత మంది చూసారు లేదా ఎంత మందికి రీచ్ అయ్యింది, ఎవరు చూసారు, చిన్న పిల్లలు, చూసారా? పెద్దవాళ్ళు చూసారా? మగవాళ్ళు చూసారా? ఆడవాళ్లు చూసారా? అనేది మనకు తెలిసే అవకాశం లేదు.
అదే Digital Marketingలో అయితే ఒక ad ఎంత మందికి రీచ్ అవ్వాలి, ఏయే వయసులవారికి రీచ్ అవ్వాలి, జెంట్స్ కి రీచ్ అవ్వలా? లేడీస్ కి రీచ్ అవ్వలా? లేదా ఇద్దరికీ రీచ్ అవ్వలా? అసలు ఎంతమందికి రీచ్ అయ్యింది అనేటువంటి ఎన్నో advantages ఉంటాయి. 

What is use  of Digital Marketing? | డిజిటల్ మార్కెటింగ్ వలన ఉపయోగం ఏమిటి?

అసలు Digital Marketing వలన మనకి ఉపయోగం ఏంటి? అంటే రెగ్యులర్ ప్రమోషన్ లో మనం బ్యానర్స్ వేయిస్తాం. Pamphlets వేయిస్తామ్. టీవిలో, పేపర్లో ads లాంటివి ఇస్తాం. అయితే ఇవి ఎంతమందికి రీచ్ అయ్యాయి అనేది మనకి తెలియదు. కానీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే ఎవరికీ ఉపయోగపడేవి, ఎవరు చుస్తే ఆ ప్రోడక్ట్ లేదా ఆ బ్రాండ్ value పెరుగుతుందో వాళ్ళకి  మాత్రమే మన ప్రోడక్ట్ కి చెందిన ads అనేవి చేరవేయటం జరుగుతుంది.
ఇక్కడ నేను ఒక example చెప్తాను. ఒక T-Shirts తయారు చేసే కంపెనీ కొత్త  డిజైన్స్ ని మార్కెట్లో రిలీజ్ చేయాలి అని అనుకుంది. T-Shirts ఎక్కువగా ఎవరిని ఆకర్షిస్తాయి, యువతని, టినేజేర్స్ ని. మారి అలాంటప్పుడు  పేపర్ లోనో, టీవీ లోనో ad ఇవ్వటం వల్ల అది T-Shirts అవసరం ఉన్నవాళ్ళకి, లేని వాళ్ళకి చేరుతుంది. దానివల్ల కొంత సమయం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. తరువాత రెగ్యులర్ మార్కెటింగ్ కన్నా డిజిటల్ మార్కెటింగ్ కి అయ్యే ఖర్చు తక్కువ. ఈ కారణాల వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ బాగా పాపులర్ అయ్యింది.
డిజిటల్ మార్కెటింగ్ వలన మనం కేవలం ప్రొడక్ట్స్ ని లేదా బ్రాండ్ ని ప్రమోట్  చేయడం మాత్రమే కాకుండా కస్టమర్స్ కి 24x7 సపోర్ట్ ని కూడా అందించగలం.
డిజిటల్ మార్కెటింగ్ లో Social Media ద్వారా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అయి మన ప్రోడక్ట్ లేదా బ్రాండ్ యొక్క feedbackను  తెలుసుకోవచ్చు. అది పాజిటివ్ అయిన లేదా నెగిటివ్ అయిన మన ప్రోడక్ట్ లేదా బ్రాండ్ డెవలప్మెంట్ లో feedback మనకి సహాయంగా ఉంటుంది.
డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఎన్నో advantages ని అందిస్తుంది. ఈమధ్య డిజిటల్ మార్కెటింగ్ ద్వారా feedback తీసుకోవడం అనేది సర్వ సాధారణం అయ్యింది.

Who can learn Digital Marketing? | డిజిటల్ మార్కెటింగ్ ఎవరెవరు నేర్చుకోవచ్చు?

ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలాంటి వాళ్ళు అయినా నేర్చుకోవచ్చు.  స్టూడెంట్స్ కానీ, ఉద్యోగులు కానీ, స్టార్ట్ అప్స్ ఓనర్స్ కానీ, చిన్న వ్యాపారాలు కానీ ఇలా  ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి టెక్నికల్ బాక్గ్రౌండ్ అక్కరలేదు. కాబట్టి  డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు.
ఈనాడు రెగ్యులర్ మార్కెటింగ్ పై ఖర్చు చేసే కొన్ని బిలియన్ డాలర్లు డిజిటల్ మార్కెటింగ్ కి మళ్లిస్తూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.

Popular Posts