Web Design Landing Page


హాయ్! అందరికి నమస్కారం. తెలుగులో వెబ్ సైట్ డిజైనింగ్ ఎలా నేర్చుకోవాలి? అనే అంశం పై ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో కేవలం వెబ్ సైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా లభిస్తుంది. ఈ వెబ్ డిజైనింగ్ ఎవెరెవరు నేర్చుకోవచ్చు? ఎలా నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి అనే విషయంపై ముందుగ వివరిస్తాము.  

free web designing course in telugu

వెబ్ డిజైనింగ్ ఎవెరెవరు నేర్చుకోవచ్చు?

ఈ వెబ్ డిజైనింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. స్టూడెంట్స్, గృహిణులు, ఉద్యోగులు ఇలా అందరు నేర్చుకోవచ్చు.

వెబ్ డిజైనింగ్ ఎలా నేర్చుకోవాలి?

ముందుగ మనకి వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉండాలి. అది లేకుంటే మనం ఏ కోర్సు నేర్చుకోలేము. ఇందులో చెప్పే క్లాసులు చేప్పినవి చెప్పినట్లు ప్రాక్టిస్ చేస్తే చాల సులభంగా నేర్చుకోవచ్చు. ఒక వేళ ఎలాంటి సందేహాలు అయిన ఉంటె వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మేము మీ డౌట్స్ ను సాల్వ్ చేస్తాము.

వెబ్ డిజైనింగ్ నేర్చుకోవటానికి ఏమి అర్హతలు కావాలి?

ఈ కోర్సు నేర్చుకోవటానికి ఎలాంటి అర్హతలు అక్కరలేదు. కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం, నేర్చుకోవాలన్న తపన, కొంత క్రియేటివిటీ ఉంటె చాలు. ఎలాంటి టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్ళు సైతం నేర్చుకోవచ్చు.

ఇంటర్నెట్ లో, YouTubeలో చాలా టుటోరియల్స్ ఉన్నాయి కదా, మరి మీ వెబ్ సైట్ ఎందుకు చూడాలి?

  • మనకి ఇంటర్నెట్ లో చాలా సోర్స్ (source) ఉంది. నిజమే, కానీ అందులో మనకి ఉపయోగపడేవి ఎన్ని అనేవి ఆలోచించాలి.
  • సరైన మార్గదర్శనం ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి example చెప్తారు తప్ప కంప్లీట్ గా ఒక వెబ్ సైట్ ని ఎలా చేయాలి అనేవి ఉండవు.
  • పెయిడ్ కోర్సులు కూడా చాలా వరకు మనకు ఇలాగె లభ్యం అవ్వుతాయి.
  • లాంగ్వేజ్(Language) ప్రాబ్లం కూడా ఒక కారణం. చాలావరకు కంటెంట్ ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉంటాయి. అవి అందరికి అర్థం కావాలని లేదు కదా!

మరి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా?

  • అవును ఉన్నాయి, వాటిల్లో ఎంత వరకు మనం కట్టిన ఫీజుకు న్యాయం చేస్తున్నారు?
  • మనం కూడా అక్కడ నేర్చుకోవటానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంతమందిలో మనకి ప్రాక్టిస్ చేయడానికి కంప్యూటర్స్ ఉండవు.
  • ప్రాక్టిస్ చేయకపోతే డౌట్స్ ఎలా వస్తాయి. వాళ్ళు మాత్రం వాళ్ళ షెడ్యూల్ ప్రకారం కోర్సు పూర్తి చేసేస్తారు. మీకు అర్థం కాకపోతే పరిస్థితి ఏంటి? మీరు కట్టిన డబ్బులకి ఎంత వరకు న్యాయం జరుగుతుంది.
పైన చెప్పిన అన్ని సమస్యలని నేను ఎదుర్కొన్నాను. మన తెలుగులో సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్ సైట్ స్  నాకు కనపడలేదు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంది ఉంటారు. కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ వెబ్ సైట్ ని తయారు చేయడం జరిగింది.  మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి. మీకు నచినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Popular Posts